గణేష్ నారాయణ్ దేవి జ్ఞానానికి, శక్తికి మధ్య వుండే సంబంధం గురించి పరిశోధిస్తూ అనేక పుస్తకాలు, వ్యాసాలు రచించారు. మానవ చరిత్రలో శిష్టవర్గాలు, జ్ఞానాన్ని నిర్వచిస్తూ దానిపై గుత్తాధిపత్యాన్ని ఎలా సాధించారో ఆయన వివరించారు. ఆయన గుజరాత్‌లోని వడోదరా (బరోడా)లో ‘‘భాషా రీసెర్చ్ అండ్ పబ్లికేషన్ సెంటర్’’ను, తేజ్‌ఘర్‌లో ‘‘ఆదివాసీ అకాడమీ’’ని స్థాపించారు. 2010లో ఆయన నాయకత్వంలో జరిగిన ‘‘భారతదేశంలో ప్రజల భాషల సర్వే’’ నేటికీ సజీవంగా వున్న 780 భారతీయ భాషలను రికార్డు చేసింది. ఆయనకు సాహిత్య అకాడమీ అవార్టు, సార్క్ దేశాల సాహిత్య అవార్డు, ప్రిన్స్ క్లాస్ (PrinceClaus)1 అవార్డు, అంతర్జాతీయ లింగ్వాపాక్స్ బహుమతి (