చాలా కాలం నుండి నేను "రక్త చలన సంగీతం " కామ్రేడ్ రిక్కల సహదేవ రెడ్డి (రిసారె) పుస్తకం కోసం ప్రయత్నాలు చేశాను. నాకు నిరాశే ఎదురైంది. రెండు సంవత్సరాల నా ప్రయత్నంలో మిత్రుడు శివరాత్రి సుధాకర్ సలహాతో నాకు " రక్త చలన సంగీతం" సంకలనం వీక్షణం వేణుగోపాల్ సార్ వద్ద దొరికింది. ఎంతో ప్రేమతో వేణుగోపాల్ సార్ పుస్తకాన్ని అందించారు. ఆ పుస్తకం మిత్రుడు నరేష్ ద్వారా నా చేతి మునివేళ్లు తాకింది. నాకు కామ్రేడ్ రిక్కల సహదేవ రెడ్డి గూర్చి ముందుగా పరిచయం చేసింది మాత్రం కామ్రేడ్ అమర్. నేను అమర్ దగ్గర నుండి