ఎర్రమన్ను, ముగ్గుపిండి
నాగులకుంటలో తెల్లవారింది. మేనపాటి నరసింహులు సైకిల్ బెల్లు గణగణ లాడిస్తూ వీధిలోకి వచ్చాడు. అప్పటికింకా ఉదయం ఆరు కూడా కాలేదు సమయం.ఎంత బలంగా బెల్లు నొక్కుతున్నా కుడిచేతి బొటనవేలు నొప్పి పెడుతోంది, కానీ బెల్లు అంతగా మోగడం లేదు. అప్పటికే లేచి తయారైన పిల్లలు అక్కడక్కడా బిగ్గరగా పాఠాలు చదువుకుంటున్న చప్పుడు వినిపిస్తోంది. దినపత్రికలు వేసే కుర్రాళ్ళు ఇద్దరు ఒకరితో ఒకరు పోటీ పడుతూ హుషారుగా నవ్వుకుంటూ రివ్వున దూసుకు వెడుతున్నారు సైకిళ్ళపైన. తనూ కదులుతూనే వాళ్ళ సైకిళ్ళని తదేకంగా చూస్తూ , తన సైకిల్ వైపు తలవంచి పరీక్షగా చూసుకున్నాడు. సైకిల్ మరీ పాతబడిపోయింది. ముందులాగా వేగంగా,