“మా తప్పు ఏంది సామీ ?”
“ అశోకు వచ్చిoడాడా ? వాడి గురించి ఏమైనా తెలిసిందా అబ్బోడా? “ యస్టీ కాలనీ లోకి అడుగుపెట్టి దుర్గమ్మ గుడిపక్కలోకి తిరిగి నిలబడితే చాలు, బోరింగు పక్కలోo చి ఎప్పుడూ ఒక పలకరింపు మీకు వినపడుతుంది. ఆ గొంతులో వణుకు, భయం, ఆదుర్దా ప్రేమ , ఆశ అన్నీ కలగలసిపోయి మీకు వినిపిస్తాయి.గుడిలోంచి వచ్చే పిలుపు కాదు అది. గుడి పక్కనే ఒక మొండిగోడల సగం ఇల్లు మీకు కనపడుతుంది. పైన రేకులతో కప్పబడిన పాత ఇల్లు. తలుపు సగం ఊడిపోయి ఎప్పుడూ మూయాల్సిన అవసరం లేనట్లు వుంటుంది.బయటే నులకమంచం పైన ఒక సగంమనిషి కూర్చునో ,