కథలు

డిజిటల్ ప్రేమ

“వద్దు, వద్దు, మనం వర్షంలో తడవ కూడదు. అందుకే ఆ చెట్టు దగ్గరకు వెళదాం. అమ్మా పరిగెత్తు  తొందరగా” అని అలేఖిని  పరిగెత్తే లోపలే  వర్షం చుక్కలు కనికరం లేకుండా ఆమె మీద పడ్డాయి. కొన్ని నిమిషాల ఫోటో షూట్ తర్వాత, ఫోటోలు ఆమెకు సంతృప్తికరంగా ఉన్నాయో లేదో చూసుకుంది. తల్లి కూతుళ్లు ఇద్దరూ స్థలాలను మార్చుకున్నారు. చివరగా, కొన్ని సెల్ఫీల తర్వాత, వారు సమీపంలోని షెల్టర్‌కి పరుగెత్తారు. వారు ఉత్సాహంగా ముసిముసిగా నవ్వుతూ, మంచి వాటిని ఎంచుకోవడానికి కష్ట పడ్డారు. క్లిక్ చేసిన ఫోటోలను సెలెక్ట్ చేశారు. ఎంచుకున్న వాటిని సరైన ఫిల్టర్‌, లైటింగ్, కాంట్రాస్ట్ మొదలైన
సాహిత్యం సంభాషణ

యుద్ధం మధ్య దండకారణ్య కథకుల సమావేశం

నా సన్నిహిత మితృడు కామ్రేడ్‌ చందూ దండకారణ్యంలో సాహితీ కార్యశాల నడుపుతున్నాం, విధిగా మీరు రావాలని నన్ను కోరాడు. డేట్‌ పంపాడు. వాస్తవంగా అ తేదీలలో నాకు అప్పటికే నిర్ణయమైపోయిన ఇతరత్ర పలు పనులున్నాయి. కానీ, ఏం చేయడం? నేనూ సాహితీ ప్రియుడినే! నాకూ వెళ్లాలనే వుంది. చందుకు దండకారణ్యంలో పాట రచనపై కార్యశాలలు నడిపిన అనుభవం వుంది. స్వతహాగా అనేక పాటలు రాశాడు. తాను పాడుతాడు, పాటపై అడుతాడు. కానీ, కథల కార్యశాల నడిపిన అనుభవం మాత్రం ఆయనకు లేదు. కథలు రాసిన అనుభవం కూడా లేదు. కథలు చదివింది కూడ తక్కువేననీ ఆయన నిర్మాహమాటంగానే తెలిపాడు.
హస్బెండ్ స్టిచ్ - 3 కథలు

ఇరవై నాలుగు గంటలు – పది మైళ్ళు

ఆ స్త్రీలు యుగాలుగా నడుస్తున్నారు..నడుస్తూనే ఉన్నారు…యుగాలుగా వంటింట్లో... అమ్మమ్మ.. నానమ్మ.. ముత్తమ్మ  .. అమ్మ.,పిన్ని, అక్క, అత్త.. కోడళ్లు ,భార్యలు  , కూతుర్లు ., ఇంకా చాలా మంది  గుస గుస లాడుతూ.. మూల్గుతూ .. కొన్నిసార్లు ఒకరితో ఒకరు  కొట్లాడుతూ,,అరుచుకుంటూ   బట్టలు నాని పోయేంతగా చెమటలు కక్కుతూ ! కత్తులూ .. ఫోర్కులూ .. గరిటెలు.. ఉడుకుడుకి పోతూ ఆవిర్లు కక్కుతూ అరిచరిచి  ఆగిపోయే కుక్కర్లు .. బజ్జీలతో కాగి కాగి ., మసలి మసలి పోయే బాండళ్ళు..        కప్పులూ.. సాసర్లు .. వణికే వేళ్ళతో పట్టుకుంటూ .. జారవిడుస్తూ ! ఆ స్రీల 
కథలు

మనసుడికి పోతే…

రిక్షా అప్పన్న కూతురు పెళ్లంట. ఆడి పెద్ద కూతురు మల్లీశ్వరికి పద్నాలుగేళ్లుంటాయి. ముగ్గురు కూతుళ్ల తరువాత ఒక్కడే మొగ్గుంటడు పుట్టాడు అప్పన్నకి. అప్పన్నకి తాను తోలే రిక్షా కాకుండా పన్నెండు బళ్లు అద్దెకు తిరుగుతాయి. చెయ్యెత్తు మనిషైనా అప్పన్నకి ఒక కాలు బోదకాలు అవ్వడం చేత ఎక్కువగా రిక్షా తొక్కడు. బళ్ల అద్దెలు వసూలు చేసుకుంటాడు. అతని అన్నదమ్ములందరిదీ ఒకటే వాసని పెంకుటిళ్లు. చూడముచ్చటగా ఉంటాయి. ఎలమంచిల్లోని మాలపల్లంతటికీ అప్పన్నే మోతుబరి. అప్పన్న అక్క ఒకావిడ రంగం ఎల్లి బోల్డు బంగారం, డబ్బు తెచ్చిందనీ, అన్నదమ్ములకి ఒక కాపు కాసిందనీ చెప్పుకుంటారు. రంగవప్పయ్యమ్మకి ఈ ఊర్లో ఒక మొగుడున్నాడు.
సాహిత్యం వ్యాసాలు

నైతిక , మత , వ్యంగ్యాత్మకాలు

(1829లో వేమన పద్యాల కూర్పుకు బ్రౌన్‌ రాసిన ఇంగ్లీషు ముందుమాట)  తెలుగు: సిఎస్‌ఆర్‌ ప్రసాద్‌ ఏదైనా ఒక భాషను అధ్యయనం చేయాలని అనుకున్నప్పుడు మనం సహజంగానే దేశీయులలో ప్రజాదరణపొందిన పుస్తకాలను గురించి తెలుసుకోవాలని అశిస్తాం. ఆ పుస్తకాలు సరళమైన శైలిలో వుండి విదేశీయులు కూడా తేలికగా అర్థం చేసుకునేటట్లు వుండాలని అనుకుంటాం. తెలుగుకు సంబంధించి 1824లో ఇలాంటి పరిశోధన ప్రారంభించాను. ఆ సందర్భంగా ఈ పుస్తకంలో ప్రచురించిన పద్యాలతో నాకు పరిచయం కలిగింది. ‘వేమ’ లేదా ‘వేమన’ (రెండు పేర్లూ వాడుకలో వుండేవి) రచించిన అనేకమైన రాత ప్రతులు నాకు లభ్యమయ్యాయి. నేను వాటిని చదివి నా ఉద్యోగబాధ్యతల్లో
సాహిత్యం కవిత్వం

ఒక రహశ్యం చెబుతా..

పట్టుపరుపులు లేవుజారి పడేంత నునుపైన కట్టడాలూ లేవు అప్పుడంతానడక నేర్పిన పూల దారుల పెరళ్ళవిఆకాశాన్ని పొదివిపట్టిన ఆనందమదినిలబడిన నేల మట్టిని శ్వాసించిన ఒకానొక విజయమదిఅప్పట్లో మనుషులుండే వారని చెప్పుకునే అరుదైన క్షణాలూ అవే! ఇప్పుడుఏవేవో లెక్కలు వేసుకుని రెండుగా చీలిపోయాంఇద్దరి మధ్యా కొలవలేనంత దూరంవేలు పెట్టి చూపిస్తూ!కూడికలు ముందు స్థానంలో ఉన్నాయనుకుంటాం కానీఆకాశాన్ని భూమిని మింగేసిన లెక్కకు తేలనితీసివేతల జాబితా అదంతా!మెదడు అట్టడుగు పొరల్లోపూడుకు పోయిన అవశేషాల నిండు గర్భమది! ఈ మాట వినగానే గుండె పాతాళంలోకి జారిపోయిందా!?నీ చోటు ఇదేనని నొక్కి వక్కాణిస్తోందా!?ఎవరు ఏమైనా అనుకోనీఒక మాట మాత్రం చెప్పుకోవాలిప్రపంచమిప్పుడు విలువల్ని వివేకాన్నిప్లాస్టిక్ జార్ లో కుదించిన
సాహిత్యం కవిత్వం

వసంత మేఘమై కురస్తాం.

దిగులు పడకు నేస్తంవర్గ పోరాటాల చరిత్ర మనది.రేపటి సూర్యోదయం కోసం త్యాగం అనివార్యమైనది.తూర్పు పవనానాలువికసిస్తున్నాయి.అక్రమ చట్టాలతోమతాల మరణహోమం జరుగుతున్నది.బూటకపు ప్రజాస్వామ్య వ్యవస్థలకుళ్లును కడుగుదం.రండి నేస్తం…త్యాగం బాటలో చిందిన రక్తంను విత్తనాలుగా చల్లుదాం.నేల రాలిన చోటపువ్వులు వికసిస్తున్నయ్.కష్టాలు కన్నీళ్లు లేనిసమాజం కోసం కవాత్ చేద్దం..రేపటి వసంతం కోసంకదలి రండి .మరో వసంత మేఘమై కురస్తాం…..
సాహిత్యం కొత్త పుస్తకం

విప్లవాన్వేషణలో…..

ఇది విప్లవకారుడు రాంప్రసాద్ బిస్మిల్ ఆత్మకథ. 1925 ఆగస్టు 9న అంటే ఇప్పటికి తొంభై ఏడేళ్ల క్రితం కాకోరీ రైలునాపి ఖజానా కొల్లగొట్టిన విప్లవాకారుల బృంద నాయకుడు రాంప్రసాద్ బిస్మిల్ ఆత్మకథ. కాకోరీ కుట్ర కేసుగా ప్రసిద్ధమైన నేరారోపణలో శిక్షలు పడిన విప్లవకారుల కథ. వీరిలో రాంప్రసాద్ ‘బిస్మిల్’, అష్ఫఖుల్లా ఖాన్ ‘వారాసీ’, రాజేంద్రనాథ్ లాహిరి స్వయంగా ఖజానా కొల్లగొట్టిన ఘటనలో పాల్గొన్నవారు. వీరిలో రాజేంద్రనాథ్ లాహిరిని అప్పటి సంయుక్త రాష్ట్రాల (ఇప్పటి ఉత్తరప్రదేశ్) గోండా జైలులో నిర్ణీతమైన తేదీకి రెండు రోజుల ముందే 1927 డిసెంబర్ 17న ఉరి తీశారు. ఎందుకంటే అతన్ని నిర్ణీత తేదీకి ముందే
సాహిత్యం కొత్త పుస్తకం

ఒంటరి గానం కాదు. సామూహిక గీతం.

ఏ బిందువు దగ్గర మొదలు పెట్టాలో తెలిస్తే చివరాఖరి వాక్యమేదో స్పష్టమౌతుంది. ఆరంభం, కొనసాగింపు తేలికయిన విషయం కాదు. విరసం ఆరంభం కూడా ఆలా జరగలేదు. నిరసన, ఆగ్రహ ప్రకటన ద్వారా మాత్రమే విప్లవ రచయితల సంఘం ఏర్పడలేదు. ఒక నిర్మాణం వెనుక అచంచల విశ్వాసం, నిమగ్నత మాతమ్రే సరిపోదు. ప్రజల నుండి ప్రజలకు ప్రవహించే సన్నటి నీటిధార అనేక దాహార్తులను తీర్చుతూ, అనేక ఖాళీలను పూరిస్తూ సాగవలసి ఉంటుంది. ఈ నడకలో కొన్ని ఖాళీలు కొత్తగా కనబడవచ్చు. దేనికయినా అన్వేషణే ముఖ్యం. విరసం యాభై ఏళ్ల సందర్భంగా పర్‌స్పెక్టివ్‌ ప్రచురణగా ‘50 ఏళ్ల విరసం పయనం ప్రభావం’
సాహిత్యం కొత్త పుస్తకం

పిల్లల కలల ప్రపంచం

పిల్లల సినిమాలని వాటి సమీక్షలని విశ్లేషించే ముందు మనం మన బాల్యంలోకి తొంగి చూడాలి. మనల్ని ఆకట్టుకున్న సినిమాలు, మనపై ప్రభావం చూపిన సినిమాలు గుర్తొస్తాయి. అవి ఎందుకు ప్రభావం చూపించాయో ఇప్పుడు వయసుపెరిగాక మరో కోణంలో అర్థమవుతుంది. వాటిని పిల్లల కోసం తీసిన సినిమాలుగా, పిల్లల గురించి పెద్దల కోసం తీసిన సినిమాలుగా విభజించవచ్చు. పిల్లల కోసం తీసిన సినిమాలు ఏ వయసు వారి కోసం తీశారో కూడా చూడాలి. ఎందుకంటే, వారి వారి వయసుని బట్టి జ్ఞాన సముపార్జన, అవగాహన వుంటాయి. వారి మానసిక ఎదుగుదలకి అనుగుణంగా మనం వారికి విజ్ఞానాన్ని అందించగల్గితే వారు ఎంతో