సాహిత్యం కొత్త పుస్తకం

పిల్లల కలల ప్రపంచం

పిల్లల సినిమాలని వాటి సమీక్షలని విశ్లేషించే ముందు మనం మన బాల్యంలోకి తొంగి చూడాలి. మనల్ని ఆకట్టుకున్న సినిమాలు, మనపై ప్రభావం చూపిన సినిమాలు గుర్తొస్తాయి. అవి ఎందుకు ప్రభావం చూపించాయో ఇప్పుడు వయసుపెరిగాక మరో కోణంలో అర్థమవుతుంది. వాటిని పిల్లల కోసం తీసిన సినిమాలుగా, పిల్లల గురించి పెద్దల కోసం తీసిన సినిమాలుగా విభజించవచ్చు. పిల్లల కోసం తీసిన సినిమాలు ఏ వయసు వారి కోసం తీశారో కూడా చూడాలి. ఎందుకంటే, వారి వారి వయసుని బట్టి జ్ఞాన సముపార్జన, అవగాహన వుంటాయి. వారి మానసిక ఎదుగుదలకి అనుగుణంగా మనం వారికి విజ్ఞానాన్ని అందించగల్గితే వారు ఎంతో
సాహిత్యం కొత్త పుస్తకం

విధ్వంస, నిర్మాణాల కొత్త ప్రపంచపు కథలు

ఇవి ఈ తరం విప్లవ కథలు. సరిగ్గా ఇప్పటి మనందరి జీవితానుభవంతో సరిపోలే కథలు. మన అనుభవ పరిధికి ఆవల ఉన్న వాస్తవికతలోకి మనల్ని నడిపించే కథలు. అదే ఈ కథల ప్రత్యేకత. ఇందులో పదకొండు కథలే ఉన్నాయి. ఇవన్నీ విప్లవ దృక్పథ వైశాల్యాన్ని చూపిస్తాయి. ‘కొన్ని రంగులు ఒక కల’ అనే కథతో పావని కథా రచనలోకి అడుగుపెట్టింది. విరసం నిర్వహిస్తున్న కథల వర్క్‌షాపులు కథకుల కలయికకు, అభిప్రాయాల కలబోతకే పరిమితం కాకుండా కొత్త కథల, కథకుల తయారీ కేంద్రాలనడానికి ఒక ఉదాహరణ పావని. సాహిత్యం, రాజకీయాలు, ప్రజా ఉద్యమాలపట్ల ఇష్టంతో పావని సాహిత్యోద్యమంలోకి వచ్చింది. తన
సాహిత్యం కొత్త పుస్తకం

ఒక పల్లెటూరి పిల్ల ప్రయాణం

గత పది సంవత్సరాలుగా కథలు రాస్తున్న పావని తన కథల సంకలనానికి ముందు మాట రాసివ్వమని అడిగింది. పావని వయస్సు రీత్యా మా చిన్నమ్మాయి తోటిది. విరసం సభల్లో, కథల వర్క్‌ షాపుల్లో ఇప్పటి యువతరపు ప్రతినిధిగా పరిచయం. వాళ్ల తాతది మధ్యతరగతి పై కులపు వ్యవసాయ కుటుంబం. కడప జిల్లాలోని పులివెందుల. గిట్టుబాటు కాని వ్యవసాయ గ్రామాల్లో ఊపిరిసలపనివ్వని భూస్వామిక ముఠా తగాదాలు, 1947లో అధికారమార్పిడి జరిగిన తర్వాత పల్లెల్లోకి అందివచ్చిన పాఠశాలలు, పావని తండ్రి చదువుకుని ఉద్యోగస్తుడిగా ప్రొద్దుటూరుకు మారారు. అప్పటికే పల్లెలనొదిలి పట్నాలలో స్థిరపడ్డ కుటుంబానికి చెందిన పావని అమ్మగారు వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు. అంటే
సాహిత్యం కొత్త పుస్తకం

లందల్ల ఎగసిన రగల్‌ జెండా… సలంద్ర

అతడు యిందూరు లందల్లో ఉదయించిన తొలిపొద్దు. వెలి బతుకుల్ని ప్రేమించిన ఎన్నెల కోన. దోపిడీ, పీడన, అణచివేత, వివక్షల నుంచి విముక్తి దారిని కలగన్న స్వాప్నికుడు. నిప్పుల పాటల డప్పై మోగిన ధిక్కార గీతం. మతోన్మాద ఆగడాలపై కాగడాలా రగిలిన రాడికల్‌ రగల్‌ జెండా. అతడు ఉస్మానియా శిగన మెరిసిన మోదుగు పూవు. అక్షరాల్ని ప్రేమించి అగ్నిపర్వతాల్ని రాజేసిన తుడుం మోతల యుద్ధగీతం. హోరెత్తే రేరేలా పాటల్లో ఆదిమ గానం. అతడు విప్లవ కవి సలంద్ర. కవి, రచయిత, జర్నలిస్టు, విప్లవకారుడు. ఎక్కడి యిందూరు!. ఎక్కడి హైదరాబాద్‌!. దారి పొడవునా నెర్రెలు వారిన బీళ్లను గుండెలకు హత్తుకున్నాడు. గుక్కెడు
సాహిత్యం కొత్త పుస్తకం

ఇసుకపర్రల్లో చెరిగిపోతోన్న పాదముద్రలు

నీ మూలం యెక్కడనది నవ్విందికాగజ్ దిఖావోనది నడక ఆపిందివెనక్కి పోనది అదృశ్యమైంది మనిషి కూడా నదిలా ప్రవాహశీలే . పుట్టిన చోట మనుషులు యెవరూ పాతుకుపోయి వుండరు. పొట్ట చేతబట్టుకుని పక్షుల్లా పలుదెసలకు పయనిస్తారు.  వలసపోతారు (అందరం అమ్మ కడుపునుంచి భూమ్మీదకి వలస వచ్చినవాళ్ళమే. కాకుంటే సామ్రాజ్య విస్తరణవాదుల ఆధిపత్య వలసలు వేరు; శ్రమజీవుల పొట్టకూటి వలసలు వేరు). అలా బెంగాల్ నుంచి అస్సామ్ బ్రహ్మపుత్ర పరివాహ ప్రాంతాలకు బ్రిటిష్ పాలకులు రవాణా చేస్తే కూలీలుగా వలస వచ్చిన ముస్లింలు  మియాలు. మేం మియాలం కాదు అసోమియాలం అంటారు వాళ్ళు( నేను చారువా (ఇసక మేటవాసి) ని కాను,
సాహిత్యం కవిత్వం

నాలుగు పిట్టలు ( మినీ కవితలు)

కాలపు చరకలో కొంత గతాన్నివొదులుకున్నానుబంగారుభవిష్యత్తీగను వొడికిఇస్తుందని వేచి చూస్తున్నాను****చెరువును అంగీలాతొడిగిన నేలచేపల్నినగిషీలు చేసుకుంది***వెన్నెల అద్దంలోతన మోము చూసుకొనిచెరువుమురుసిపోతోంది***ఎండ మగ్గం తోమబ్బుల బట్టను అల్లుకొనికప్పుకుందినింగి***ఈ మౌన రాత్రిలోకొంత శబ్దాన్ని కోరుకున్నానువెన్నెల కొలనునుముద్దాడింది***చేపలకు కొలను చెబుతున్నకథలనుతారకలు కూడాఊ కొడుతూ వింటున్నాయి***కొలనును కాగితం చేసుకొనికవిత్వం రాస్తున్నాడుచందమామచేప పిల్లలు అక్షరాలు***సూఫీ పాడిన పాటనువినిఅలల చప్పట్లతోఆదరించింది చెరువు***16.11.22
సాహిత్యం కవిత్వం

వనాన్ని మింగిన కులం

ఒక చాటింపు పొద్దు కుంగే వేళఓ సమూహ కలయికవంటా వార్పు రేపుడప్పు పై దరువు తో మరునాడు పొద్దు పొడిచే వేళబండెడ్లు సిద్దంగిన్నెలు తపేలాలతో తరలుఅంతా ఒకే చోటు వనం అంటే చెట్లుఇళ్లకు గొళ్ళెం పెట్టిచెట్ల కిందకిసమూహాలుగాసమూహ సంఖ్య బట్టి చెట్టు ఎంపికనీడ కోసం ఉసిరి లేదు మర్రి లేదువేప లేదు రావి లేదుచల్లని గాలి కాసింత నీడ ఆ వేళమంత్రం లేదుతంత్రం లేదుసామూహిక వికాసంలో భాగంమానసిక సంఘర్షణకు ఉపశమనంఅందరిలో ఒకరమై ఒకరికి ఒకరమైమాటలు చేతలు కలివిడిగా చెట్టు కొమ్మలకు వేలాడే వేటలుజంతు అనాటమీ లో ఆరి తేరిన చేతులుపొందిక గా పోగులుపొయ్యి మీద నూనె తాళింపు చిటపటఅల్లం
సాహిత్యం కవిత్వం

అమ్మ

అవును!!!నేను..ఎన్నిసార్లు పిలిచినావిసుగురాని పదం అమ్మ! ఎందుకంటే..మా అమ్మ అందరి అమ్మలాటీవీ ముందు కూర్చునివంట ప్రోగ్రామోకామెడీ ప్రోగ్రామో చూసే అమ్మ కాదు..మా అమ్మ! నైస్ గా ఇంగ్లీషులో మాట్లాడే అమ్మ కాదు..మా అమ్మ !రోజుకో టిఫిన్ చేసి పెట్టే అమ్మ కాదు.. మా అమ్మ!మరిమా అమ్మ ఎలాంటి అమ్మ ? ఈ భూమి మీదఅరొక్క పంటకి పురుడు పోసే అమ్మ.. మా అమ్మ!ఎర్రని సూర్యున్ని తన వీపు మీద మోస్తూపంటకి కలుపు తీసే అమ్మ… మా అమ్మ ! ఆకాశమంత దుఃఖంఅవనికి ఉన్నంత ఓర్పుమా అమ్మ సొంతం తన చెమట చుక్కల్నితన కన్నీటి గుక్కల్నితాగిన ఈ భూమిమా అమ్మకి ఎప్పుడు
సాహిత్యం కవిత్వం

వాళ్ళు ముగ్గురు

వాళ్ళు ముగ్గురే అనుకునివాళ్ళని లేకుండా చేస్తేఇంకేమీ మిగలదనివిషం పెట్టిచిత్రహింసలకు గురిచేసికొయ్యూరు అడవుల్లోహతమార్చిసంబరాలు చేసుకున్నావు కానీ ఆ చిత్రహింసలకొలిమిలోంచిఫీనిక్స్ పక్షిలావేలాదిమంది సాయుధప్రజా విముక్తి సైన్యంపుట్టుకొచ్చింది నువ్వో కాగితప్పులవనిరుజువయిందిస్పార్టకస్ నుండిదండకారణ్య ఆదివాసీ వరకునెత్తుటి పుటలలోంచిమరల మరలవిముక్తి నినాదంవినబడుతూనే వుంది అమరత్వం పొత్తికడపులోంచిఉద్యమ నెల వంకలుఉదయిస్తూనే వుంటారు శ్యాం మహేష్ మురళీఅమర్ రహే అమర్ రహే
సాహిత్యం కవిత్వం

అలల కెరటాలు

అనంత విశ్వాన్ని నిబ్బరంగా చూస్తానుఅంతా అర్థం అయినట్టే కట్టిపడేస్తుందిజీవితం కూడా. ఆకర్షణ తో కట్టుబడ్డట్టుముడిపడటాలు చెదిరిపోవటాలు చూస్తాం. కాలం పైన చిరు నవ్వు తాకికాసేపు చేసే కాలక్షేపం చూస్తాం. మరుక్షణంగాలికి కాలం ఊగిపెట్టే కన్నీటిని చూస్తాం. మురిసిపోయే లోపేతుపాను ముసిరినట్లుఅంతలోనేస్వచ్ఛం గా దృశ్యాలుగా చెక్కబడుతున్నట్లుఅనుభవాలు కుదుపుతుంటాయి . తీరం వైపు కళ్ళను పరచిఅలల కెరటాలను చూస్తాను.సంతోషాలు దుఃఖాలు పోటీపడిఊగిపోతుంటాయి. అయినానిశ్చలంగా సముద్రం వైపు చూస్తూప్రశాంతతను పల్లవిస్తాను.