సాహిత్యం గల్పిక కథలు

సెగ సెకలు!

పెట్రోలు ధరలు పెరిగాయని మా ఆయన స్కూటరు వొదిలి సైకిలు యెక్కాడు. దారికాసిన పోలీసులు సైకిలు లాక్కున్నారు. మా ఆయన హెల్మెట్ లేదనేమోనని అనుమానించి, హెల్మెట్ తెచ్చుకుంటాను అన్నాడు. వినలేదు. బెల్లే హారన్ అని ట్రింగు ట్రింగుమని కొట్టి చూపించాడు. వినలేదు. లైట్ వేసి చూపించాడు. వినలేదు. టూవీలర్ ఫోర్వీలర్ లైసెన్స్ వుంది, సైకిలుకి లైసెన్స్ తీసుకుంటాను అన్నాడు. వినలేదు. మేం త్రిబుల్స్ వెళ్ళడం లేదు కదా అన్నాడు. అయినా వినలేదు. పోన్లే సైకిలు తీసుకుంటే తీసుకున్నారు. నడిచిపోతానని మా ఆయన బుద్ధిగా నడిచి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు పోలీసులు యెవరికో ఫోను చేశారు. వాళ్ళు వచ్చి మా ఆయన్ని
సాహిత్యం కవిత్వం

మీరూ – మీ రాజ్యం

నాలుగు రోడ్ల కూడలిలోనిమ్మ కాయ ముగ్గు తొక్కండిభూత వైద్య పట్టాదార్లుబెనారస్ నుండి వస్తున్నారు ఆత్మ పరమాత్మ లసంఘర్షణ ల నిగ్గు తేల్చేనిఖార్సైన చదువులురాజు ఇలాకాలో చెబుతున్నారు ఎలా చస్తేఎలా చంపితేఆత్మ పునర్జన్మ పొందుతుందోచెప్పే ప్రయోగశాలలు తయారవుతున్నాయితొందర పడినోట్లో రాగి చెంబులు పెట్టిడంబెల్స్ తో చంపబాకండి త్రిశూలం వాడితే శివుడొస్తడోచక్రం తో ఛేదిస్తే విష్ణువు వస్తాడోచెప్పే జ్ఞానంబాబాలకి లేదనివిశ్వవిద్యాలయాల్లో పురుడు పోస్తున్నారు నగ్న దేహాన్నిపటాల ముందు ప్రదర్శిస్తేపటాలు శాంతిస్తాయో లేదోననేపరిశోధనలు కొనసాగుతాయి త్వరలో అంతా ద్వైతమేశాస్త్రం సమాధిమీరు కోరుకుంటున్న సమాజమే వస్తుందిఆత్మలన్నీ మరుజన్మ ఎత్తిచావులేని పురాణ వైద్యాన్ని వెలుగులోకి తెస్తుంది రాజ్యం!! బువ్వ పెట్టే వాడ్ని చంపైనామీ మూఢ నమ్మకాన్ని
సాహిత్యం గల్పిక కథలు

జైలూ బెయిలూ!

“అబ్బా... వీవీకి బెయిలొచ్చింది, యేమైనా కోర్టుల వల్లే కాస్తో కూస్తో న్యాయం జరుగుతుంది” “రెండువేల పద్దెనిమిది నుంచి జైల్లో పెట్టి విచారణ జరపకుండానే తీర్పు యివ్వకుండానే శిక్షాకాలం అమలు చేస్తున్నారు కదా?” “ఔన్లే, యిప్పటిదాకా ఆయన మీద పెట్టిన యే కేసూ నిలబడలేదు” “ఇప్పుడూ బీమా కోరేగాం కేసూ నిలబడదు. ఆల్రెడీ ఆర్సెనాల్ ఫోరెన్సిక్ సంస్థ అమెరికా వాళ్ళు రిలీజ్ చేసిన రిపోర్టులో కూడా పోలీసులు పెట్టిన ఎలిగేషన్లు కల్పితాలని, నిందితుల కంప్యూటర్లలోకి సాక్షాలని అక్రమంగా లోడ్ చేశారని చెప్పింది” “ఎవరు యేమి చెప్పినా, మనం చెప్పిన రిజల్టు వస్తేనే మనం నమ్ముతాం, అదే నమ్మదగింది అవుతుంది” “అమెరికా
గల్పిక కథలు

దేశాంతరం!

కరోనా కాదుగాని బడీ లేక బయట ఆడుకోవడానికీ లేక పొద్దస్తమానమూ ఇంట్లో టీవీ చూస్తూ కాలం గడిపేస్తుంటే పరీక్షా కాలం కాస్తా వచ్చేసింది! “భారతదేశానికి సరిహద్దులు తెలపండి?” ప్రశ్నపత్రంలోని ప్రశ్న! “భారతదేశానికి తూర్పున బంగాళాఖాతము, పశ్చిమాన అరేబియా మహాసముద్రం, ఉత్తరాన హిమాలయా పర్వతాలు, దక్షిణాన హిందూ మహాసముద్రం ఉన్నాయి” జవాబు రాసిన విద్యార్థికి జీరో మార్కులు వేశారు మాస్టారు! చదివి రాసిన విద్యార్థి డంగైపోయాడు! “టిక్రి, సింఘు, గాజీబోర్డర్” అని జవాబు రాసిన మిగతా విద్యార్థులను మాస్టారు మెచ్చుకొని ఎన్నికి అన్ని మార్కులూ వేసేశారు! టీవీలూ పేపర్లూ చూసి రాసిన విద్యార్థులు పొంగిపోయారు! “దేశ సరిహద్దులు మారిపోతాయా?” ఆశ్చర్యపోతూ
సాహిత్యం వ్యాసాలు

మయన్మార్‌లో సైనికకుట్ర – తదనంతర పరిణామాలు

ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయడానికి కొద్ది గంటల ముందు మిలిటరీ తిరుగుబాటు చేసి అధికారాన్ని జనవరి 31న తెల్లవారుజామున హస్తగతం చేసుకుంది. ఆగ్నేసియాలోని నిరుపేద దేశమైన మయన్మార్‌ మరోసారి సైనిక పాలనలోకి పోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత సైన్యాధిపతి మిన్‌ అంగ్‌ హేలింగ్‌ అధికారం చేపట్టాడు. అయిదు కోట్ల జనాభా కలిగిన మయన్మార్‌లో సైనిక కుట్రలు కొత్తేమీ కాదు. 1948లో స్వాతంత్ర్యం సాధించిన తరువాత మొదటి పద్నాలుగేళ్లు ప్రజాస్వామ్య పాలన కింద ఉన్న మయన్మార్‌లో 1962లో సైన్యం ఒక్కసారిగా తిరుగుబాటు చేసి అధికారం చేజిక్కించుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అధికారం తమ చేతుల్లోంచి
సాహిత్యం కవిత్వం

స్వప్నకథనం

శూన్యగోళంలో తిరుగాడే పిట్టజీవావరణంలో ఇమడలేకగహన గగనం చేరలేకమన బాల్కానీ ఊచల మీద టపటపమన తలుపుల మీద టకటకమన గుండెలకు దగ్గరగా గునగునగుండే గువ్వై ఎగిరిపోన... కల అయిపోలేదుతూటాల మీదుగా పూలతుంట్లు తుంచిపాపల బుగ్గల నుంచి లేత గులాబీలు తెంచిమొర చాపిన లేగ ముట్టెకు ముద్దిచ్చిముట్టించి, ముట్టడించి,దట్టించి, దహించిరివ్వున. కెవ్వన... ఎగిరిపోన.. కలఅయిపోలేదుకనలి కనలికదిలి కదిలిఉప్పటి కన్నుల మీదుగా జారిచప్పటి పెదవుల మీదకు చేరిచప్పున తోలేలోపే ఎగిరిపోన..
సాహిత్యం కవిత్వం

సబ్జెక్ట్‌ కరెక్షన్‌

బిర్యానీ తినిపించి బంగ్లా రాయించేసుకొన్నాకకత్తి చేతికందించి మెడ తెంచుకుపోయాక మత్తు దిగేక అస్తుబిస్తుగా మిగిలేక ఓ మనిషీ ఓ మనీషి ఓ మహర్షీ మాయమయ్యాక కలి ఉలి ఆగిందిశిలకు ఆకలి మొదలైంది...