సాహిత్యం కొత్త పుస్తకం

పిల్లల కలల ప్రపంచం

పిల్లల సినిమాలని వాటి సమీక్షలని విశ్లేషించే ముందు మనం మన బాల్యంలోకి తొంగి చూడాలి. మనల్ని ఆకట్టుకున్న సినిమాలు, మనపై ప్రభావం చూపిన సినిమాలు గుర్తొస్తాయి. అవి ఎందుకు ప్రభావం చూపించాయో ఇప్పుడు వయసుపెరిగాక మరో కోణంలో అర్థమవుతుంది. వాటిని పిల్లల కోసం తీసిన సినిమాలుగా, పిల్లల గురించి పెద్దల కోసం తీసిన సినిమాలుగా విభజించవచ్చు. పిల్లల కోసం తీసిన సినిమాలు ఏ వయసు వారి కోసం తీశారో కూడా చూడాలి. ఎందుకంటే, వారి వారి వయసుని బట్టి జ్ఞాన సముపార్జన, అవగాహన వుంటాయి. వారి మానసిక ఎదుగుదలకి అనుగుణంగా మనం వారికి విజ్ఞానాన్ని అందించగల్గితే వారు ఎంతో