సాహిత్యం కొత్త పుస్తకం

లందల్ల ఎగసిన రగల్‌ జెండా… సలంద్ర

అతడు యిందూరు లందల్లో ఉదయించిన తొలిపొద్దు. వెలి బతుకుల్ని ప్రేమించిన ఎన్నెల కోన. దోపిడీ, పీడన, అణచివేత, వివక్షల నుంచి విముక్తి దారిని కలగన్న స్వాప్నికుడు. నిప్పుల పాటల డప్పై మోగిన ధిక్కార గీతం. మతోన్మాద ఆగడాలపై కాగడాలా రగిలిన రాడికల్‌ రగల్‌ జెండా. అతడు ఉస్మానియా శిగన మెరిసిన మోదుగు పూవు. అక్షరాల్ని ప్రేమించి అగ్నిపర్వతాల్ని రాజేసిన తుడుం మోతల యుద్ధగీతం. హోరెత్తే రేరేలా పాటల్లో ఆదిమ గానం. అతడు విప్లవ కవి సలంద్ర. కవి, రచయిత, జర్నలిస్టు, విప్లవకారుడు. ఎక్కడి యిందూరు!. ఎక్కడి హైదరాబాద్‌!. దారి పొడవునా నెర్రెలు వారిన బీళ్లను గుండెలకు హత్తుకున్నాడు. గుక్కెడు