ఈ మోహన్రావున్నాడు చూడండీ..!
అవును... మీరందరూ వినాలి. నేనెలా చనిపోయానో నేను మీకందరికీ చెప్పి తీరాలి. నా కథ మీకు వింతగా కనిపించవచ్చు పోనీ ఒఠ్ఠి చోద్యంగానూ అనిపించవచ్చు. నాలాంటి స్త్రీల కథలు ఎవరు రాస్తారో తెలీదు కానీ ఒకవేళ రాస్తే మాటుకు రాసిన వాళ్ళని కూడా మీరు తెగడతారు. ఒఠ్ఠి బలుపు... బూతూ రాస్తుందీవిడ అని ఆమెను పాపం మనస్తాపానికి గురి కూడా చేయవచ్చును మీరంతటి వాళ్లే సుమా! ఇంతకీ నేనెలా పోయానో మీకు చెప్పాలి. ఈవిడేదో మళ్ళా ఒక పురుషుడ్నో... అంటే భర్తని విలన్‌గా నిలబెడ్తుందని మీరనవచ్చు కానీ నా కథలో ఇది నిజమే. అవును మరి నిండు నూరేళ్లు