సాహిత్యం గల్పిక కథలు

సెగ సెకలు!

పెట్రోలు ధరలు పెరిగాయని మా ఆయన స్కూటరు వొదిలి సైకిలు యెక్కాడు. దారికాసిన పోలీసులు సైకిలు లాక్కున్నారు. మా ఆయన హెల్మెట్ లేదనేమోనని అనుమానించి, హెల్మెట్ తెచ్చుకుంటాను అన్నాడు. వినలేదు. బెల్లే హారన్ అని ట్రింగు ట్రింగుమని కొట్టి చూపించాడు. వినలేదు. లైట్ వేసి చూపించాడు. వినలేదు. టూవీలర్ ఫోర్వీలర్ లైసెన్స్ వుంది, సైకిలుకి లైసెన్స్ తీసుకుంటాను అన్నాడు. వినలేదు. మేం త్రిబుల్స్ వెళ్ళడం లేదు కదా అన్నాడు. అయినా వినలేదు. పోన్లే సైకిలు తీసుకుంటే తీసుకున్నారు. నడిచిపోతానని మా ఆయన బుద్ధిగా నడిచి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు పోలీసులు యెవరికో ఫోను చేశారు. వాళ్ళు వచ్చి మా ఆయన్ని
సాహిత్యం గల్పిక కథలు

జైలూ బెయిలూ!

“అబ్బా... వీవీకి బెయిలొచ్చింది, యేమైనా కోర్టుల వల్లే కాస్తో కూస్తో న్యాయం జరుగుతుంది” “రెండువేల పద్దెనిమిది నుంచి జైల్లో పెట్టి విచారణ జరపకుండానే తీర్పు యివ్వకుండానే శిక్షాకాలం అమలు చేస్తున్నారు కదా?” “ఔన్లే, యిప్పటిదాకా ఆయన మీద పెట్టిన యే కేసూ నిలబడలేదు” “ఇప్పుడూ బీమా కోరేగాం కేసూ నిలబడదు. ఆల్రెడీ ఆర్సెనాల్ ఫోరెన్సిక్ సంస్థ అమెరికా వాళ్ళు రిలీజ్ చేసిన రిపోర్టులో కూడా పోలీసులు పెట్టిన ఎలిగేషన్లు కల్పితాలని, నిందితుల కంప్యూటర్లలోకి సాక్షాలని అక్రమంగా లోడ్ చేశారని చెప్పింది” “ఎవరు యేమి చెప్పినా, మనం చెప్పిన రిజల్టు వస్తేనే మనం నమ్ముతాం, అదే నమ్మదగింది అవుతుంది” “అమెరికా
గల్పిక కథలు

దేశాంతరం!

కరోనా కాదుగాని బడీ లేక బయట ఆడుకోవడానికీ లేక పొద్దస్తమానమూ ఇంట్లో టీవీ చూస్తూ కాలం గడిపేస్తుంటే పరీక్షా కాలం కాస్తా వచ్చేసింది! “భారతదేశానికి సరిహద్దులు తెలపండి?” ప్రశ్నపత్రంలోని ప్రశ్న! “భారతదేశానికి తూర్పున బంగాళాఖాతము, పశ్చిమాన అరేబియా మహాసముద్రం, ఉత్తరాన హిమాలయా పర్వతాలు, దక్షిణాన హిందూ మహాసముద్రం ఉన్నాయి” జవాబు రాసిన విద్యార్థికి జీరో మార్కులు వేశారు మాస్టారు! చదివి రాసిన విద్యార్థి డంగైపోయాడు! “టిక్రి, సింఘు, గాజీబోర్డర్” అని జవాబు రాసిన మిగతా విద్యార్థులను మాస్టారు మెచ్చుకొని ఎన్నికి అన్ని మార్కులూ వేసేశారు! టీవీలూ పేపర్లూ చూసి రాసిన విద్యార్థులు పొంగిపోయారు! “దేశ సరిహద్దులు మారిపోతాయా?” ఆశ్చర్యపోతూ