అమ్మ పాటల పుస్తకం
సాయంకాలం సిస్టం షెడౌన్ చేస్తూ ఆఫీసుకు అన్నం డబ్బా, నీళ్ల బాటిల్ తీసుకొని లేచాను. గ్రిల్ తలుపు ఒకటి తీశాను. ఓరగానే. ఇంకాపూర్తిగా తెరవలేదు. బైటి గేటు తీసుకొని వచ్చి వాళ్లు జొరబడ్డారు. గ్రిల్ రెండు తలుపులు బార్లా తీసుకొని వచ్చేశారు. పదిహేను మంది ఉంటారేమో. వాళ్లలో ఒకాయన తాము ఎవరో చెప్పుకున్నాడు. ఇంకో ఆయన మెడలోని రాజముద్ర చూపుకున్నాడు. నేను కంగారు పడుతున్నాననుకొని ‘మీరు కూచోండి.. కూచోండి’ అని సిస్టం ముందున్న కుర్చీని ఇటు తిప్పారు. నేను ఫ్యాన్ స్విచ్ వేస్తూ ‘మీరు వస్తారని అనుకుంటూనే ఉన్నా’ అన్నాను. ఒకాయన ఒకింత చిన్నగా నవ్వాడు. ‘ఎలా అనుకున్నారు?