కథలు

నా కథల్లో నేనుంటాను

తెలంగాణ నేల  మీద నేను పుట్టి అడుగులు వేసే సమయానికి ఈ మట్టి మీద  ఎన్నో ఉద్యమాలు జరుగుతున్నాయి. రైతుకూలి ఉద్యమాలు, కమ్యూనిష్టు పోరాటాలు, నక్సలైట్ ఉద్యమం, బతుకుదెరువులేక ఎడారి దేశాలకు, ముంబై, షోలాపూర్, సూరత్, బీవండి వంటి వస్త్ర పరిశ్రమ కేంద్రాలకు నేత కార్మికుల వలసలు ఇలా తెలంగాణ నేలంతా తనలో తాను తొక్కులాడుకుంటున్న కాలం. అలాంటి గడ్డుకాలంలో జన్మించి సర్కారు బడిలో చేరి ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ ఉన్నత చదువులు చదువుకొని ఇన్నాళ్ళకు నావైన కథలేవో కొన్ని రాసుకొని వాటిని ‘పుంజీతం’ పేర ఒక పుస్తకంగా తీసుకు వచ్చాను. ఈ ప్రయాణమంతా ఎన్నో గతుకులతో కూడినది.
సాహిత్యం కథలు అల‌నాటి క‌థ‌

గుమ్మ‌న్ ఎగ్లాప్పూర్ గ్రామ‌స్థుడు

ఉద‌యం లేచింది మొదలు లింగన్న మనసంతా కకావికలమైపోతోంది. వర్షాకాలం, అడవి పచ్చగా వుంది, రాత్రి కురిసిన వర్షానికి నేలంతా బురదబురదగా వుంది. కురిసి కురిసి లింగన్న గుడిసె చెమ్మగా వుంది. ఏడేళ్ళ కూతురు ఆకలితో ఏడుస్తోంది. పదేళ్ళ కొడుకు ఆకలిగా మూలుగుతున్నాడు. లింగన్న భార్య లచ్చిమి బాలింత జ్వరం యింకా తగ్గినట్టులేదు. లింగన్న తల్లి ఎల్లవ్వ కాలుకున్న మానని గాయంతో వెక్కి వెక్కి ఏడుస్తోంది. పొయ్యిమీద అంబలి కుండ ఎక్కించడానికెవరూ లేనట్టుగా వుంది. అందరూ నిస్సత్తువగా వున్నారు. లింగన్న లేవడంతోనే కన్పించిన దృశ్యాలివి. ఇక ఎక్కువసేపు ఆ గుడిసెలో వుండలేకపోయాడు. అలవాటుగా బయటకు నడిచాడు. మబ్బులచాటునుండి సూర్యుడిరకా బయట
సాహిత్యం కథలు

స్వామి

అది వేదిక కాదు. ఒక ఆడిటోరియం కాదు. అక్కడున్న వాళ్ళందరు సమాజం నుండి బహిష్కరణకు గురైన వారే.  వారి పూర్వీకుల నుంచి ఇప్పటి వరకు  కూడా పేదరికంలో జీవిస్తూనే వున్నారు. వృద్ధుల సమూహంతో కూడిన ఒక పెద్ద గుంపు అక్కడ చేరింది. సాధారణ ప్రజలు అస్యహించుకునే బంకాటి కుష్ట్ కాలనీ అదే. ధన్బాద్ నుండి 8 కిమీ దూరంలో ఆ కాలనీ ఉంటుంది. ఫాదర్ స్టాన్ స్వస్థలమైన రాంచీ నుండి 145 కి.మీ దూరంలో వుంది. జెసూట్ పూజారి  ఫ్రేమ్డ్ పోర్ట్రెయిట్ ఒక మేకు నుండి చెట్టు కాండం పైన వేలాడదీయబడింది. దాని చుట్టూ ఉన్న బంతి పువ్వుల దండ  నిర్వాహకుల నిధుల
సాహిత్యం కథలు

అమ్మను చూడాలి

" ఏమిటండీ? అలా ఉన్నారు? ఒంట్లో బాగానే ఉంది కదా!" జానకి అడిగింది కోర్టు నుండి వచ్చినప్పట్నుంచి ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఏదో ఆలోచిస్తూ కూర్చున్న భర్తను. " ఇవాళ కోర్టులో ఒక వింత కేసు వచ్చింది ...""సరిపోయింది. కోర్టు పిచ్చి.. ఇంటి దాకా తెచ్చుకున్నారా? నేను ఇంకా  ఏమిటోనని భయపడ్డా !లేవండి భోజనానికి."           జానకి కోటయ్య మాటలు పూర్తిగా వినకుండానే వెళ్ళిపోయింది .జానకి ఎప్పుడూ అంతే. తను చెప్పదలుచుకున్నది చెప్పడమే గానీ తన మాట  విన్నది ఎపుడని?  అందుకే తను మాట్లాడడమే మానేసాడు అవసరమైతే తప్ప. అప్పుడైనా తన మాట నెగ్గదు. అయినా జానకి నోటి దురుసు కు జంకి 
కథలు అల‌నాటి క‌థ‌

పోలీసు దాడి

పొలుమారు మీద కూలీకి పోయినోళ్ళు అడుగుల్లో అడుగులేస్తూ ఇల్లకు జేరుతున్నరు. ఊల్లే సాగల్లు తిరుగుతున్నరు. లచ్చవ్వ ఆయిల్ల గాసం కోసం పొయికింద కయితే ముండ్లకంప ఏరుకచ్చింది. పొయిమీద సంగతి యాదికచ్చేటాల్లకు గుండెల్ల రాయి పడ్డట్టయింది. పొద్దున్నే సోలెడు గట్కకోసం మాదిగిండ్లన్నీ తిరిగింది యాదికచ్చేటాల్లకు ఉన్న పాణం తుస్సు మన్నది. ‘‘కూలీకి పోయినకాడ పటేలు కూలిత్త డనుకుంటే నాలుగురోజులు ఆగల్నన్నడు, కూలోల్ల ఇండ్లల్ల మనులు మాన్యాలున్నట్టు. పూటగాసపోల్లం కూలియ్యమని పట్టుపడితే కావురాలచ్చినయని ఎగిరెగిరిపడ్డడు. మొన్నటిదాక సంఘం మాటని సెప్పినట్టిన్నరు. ఇప్పుడు పోలీసోళ్ళ బిప్రి జూసుకుని మల్ల సాగిచ్చుకుంటాండు’’ తనలోనే అనుకుంటా కాళ్ళు కడుక్కొని ఇంట్లకు వోయింది లచ్చవ్వ. ‘‘ఈ దిక్కుమాల్ల
సాహిత్యం కథలు

చంద్రిక‌

చంద్ర‌ ఆమెను కలిసినప్పుడు చంద్రికకు ఎనిమిది సంవత్సరాలు.  అప్పుడు కూడా, అతనికి ఎప్పుడూ చూడని అందమైన అమ్మాయిగా తను  కనిపించింది. అతని తండ్రికి నగరం వెలుపల  సిమెంట్ తయారు చేసే ఫ్యాక్టరీలో కొత్త ఉద్యోగం వచ్చింది.  తన అమ్మ,  నాన్నలతో కలిసి ఇళ్లు మారాడు. ఇల్లు ఒక అడవి అంచున కూర్చుంది. అది అతని చిన్నతనంలో అమ్మమ్మ చెప్పిన కథల్లో మాదిరి అనిపించింది.  గుబురు చెట్లు, ప్రకాశవంతమైన ఎరుపు,  ఆకాశపు నీలిరంగు స్పర్శతో సాయంకాలం చెట్లకు అసహజ రంగులు వచ్చేవి. ఇది దాదాపు మాయాజాలం అనిపించే రకమైన అడవిగా అతను భావించే వాడు. చంద్ర తన ఇంటి నుండి
సాహిత్యం కథలు

కవుడు అనునొక కాపటి

"దుర్గాకుమార్ హఠాన్మరణం" లెక్చరర్ ఫోరమ్ వాట్సాప్ గ్రూప్ మెసేజ్. "మా వాడేనా" ... లోపల....ఆందోళన.... అవునంటూ అరనిముషంలో .. మరో మెసేజ్ "మాథమాటిక్స్ లెక్చరర్ దుర్గాకుమార్ ఆర్.ఐ.పి"  ఉదయపు నిద్ర మత్తువదిలింది. ఏమై వుంటుంది? నెమ్మదిగా వాడి ఆలోచనలు కుప్పగూడుతున్నాయి నాకంటే పదిహేనేళ్లు చిన్నవాడు. యిప్పుడు నలభైఏళ్లు దాటివుండవు. ఫోటో...లు ..కూడా పెట్టారు లెక్చరర్స్ అసోసియేషన్ గ్రూపులో పిక్చర్ జూమ్ చేసి దగ్గరగా చూసాను.... అంబులెన్స్ లోపల నోరుతెరుచుకుని...పడుకున్న శవం… శరీరాన్ని కప్పుతూ స్ట్రేచర్ పై సగం వరకు దుప్పటి నా కంటి కొలకుల్లో దాగిన రెండే రెండు… బొట్లు టప్... టప్ ... మొబైల్ స్క్రీన్ పై
సాహిత్యం కథలు

నిన్న ఈవేళ

(ఈ క‌థ ఆంధ్ర‌ప్ర‌భ స‌చిత్ర‌వార ప‌త్రిక 10.4.74 సంచిక‌లో అచ్చ‌యింది. విర‌సం ప్ర‌చురించిన చెర‌బండ‌రాజు సాహిత్య స‌ర్వ‌స్వంలోని క‌థా సంపుటంలో ఇది చోటు చేసుకోలేదు. మిత్రుడు వంగ‌ల సంప‌త్‌రెడ్డి చెర‌బండ‌రాజు సాహిత్యంపై త‌న ప‌రిశోధ‌న‌లో భాగంగా దీన్ని గుర్తించారు. శ్రీ‌కాకుళం క‌థా నిలం నిర్వాహ‌కులు దీన్ని పంపించారు. సంప‌త్‌రెడ్డికి, క‌థానిల‌యం నిర్వాహ‌కుల‌కు ధ‌న్య‌వాదాలు.- వ‌సంత‌మేఘం టీ) చేను చచ్చిపోయింది. కాలువ ఎండిపోయింది. చెరువు ఇంకిపోయింది. ఊళ్ళో కూలి జనం నాలుకల మీది తడి ఆరిపోయింది. వాళ్ళ ఎముకల్లో గలగల. కళ్ళలో గరగర. విరగ్గొట్టిన వేపకొమ్మల్లా ఎండిపోయి, కాలు పెడితే పటపటా విరిగిపోయే దశలో ఎవరి గూళ్ళలో కాళ్ళు, ఎవరి
సాహిత్యం కథలు

అధిపతి

అక్కడి వాతావరణం గంభీరంగా ఉంది. స్టూడియోలో అందరూ ఉత్కంఠతతో ఊపిరి బిగపట్టి ఎవరి పనులు వాళ్ళు నిశ్శబ్దంగా చేస్తున్నారు. యాంకర్ గొంతు సవరించుకుని మాట్లాడటం ప్రారంభించాడు. స్టూడియో లో ప్రకాశవంతమైన లైట్లు వెలిగాయు. యాంకర్ ఎదురుగా వున్న కుర్చీలో ఒక తెల్లని వెలుగు ప్రశాంతంగా కూర్చుని వుంది. దేశ వ్యాప్తంగా ప్రజలు టీవీ లకు అతుక్కుపోయారు. కర్ఫ్యూ విధించకనే దేశంలోని విధులన్నీ నిర్మానుష్యం ఆయుపోయాయి. "మొదట, ఈ ప్రశ్నలను మిమ్మల్ని అడగడానికి నన్ను అనుమతించినందుకు నేను మీకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. మిమ్మల్ని ఎలా సంభోదించాలో నాకు తెలియదు" యాంకర్ మొదలుపెట్టాడు."మిమ్మల్ని ఎవరైనా ఇష్టపడతారు. అనేక ప్రార్ధనల తర్వాత మా
సాహిత్యం కథలు

అమ్మ పాటల పుస్తకం

సాయంకాలం సిస్టం షెడౌన్‌ చేస్తూ ఆఫీసుకు అన్నం డబ్బా, నీళ్ల బాటిల్‌ తీసుకొని  లేచాను. గ్రిల్‌ తలుపు ఒకటి తీశాను. ఓరగానే. ఇంకాపూర్తిగా తెరవలేదు. బైటి గేటు తీసుకొని వచ్చి వాళ్లు  జొరబడ్డారు. గ్రిల్‌ రెండు తలుపులు బార్లా తీసుకొని వచ్చేశారు. పదిహేను మంది ఉంటారేమో.    వాళ్లలో ఒకాయన తాము ఎవరో చెప్పుకున్నాడు. ఇంకో ఆయన మెడలోని  రాజముద్ర చూపుకున్నాడు. నేను కంగారు పడుతున్నాననుకొని ‘మీరు కూచోండి.. కూచోండి’ అని సిస్టం ముందున్న కుర్చీని ఇటు తిప్పారు.    నేను ఫ్యాన్‌ స్విచ్‌ వేస్తూ ‘మీరు వస్తారని అనుకుంటూనే ఉన్నా’ అన్నాను.    ఒకాయన ఒకింత చిన్నగా నవ్వాడు.    ‘ఎలా అనుకున్నారు?