కథలు హస్బెండ్ స్టిచ్ - 3

ఇరవై నాలుగు గంటలు – పది మైళ్ళు

ఆ స్త్రీలు యుగాలుగా నడుస్తున్నారు..నడుస్తూనే ఉన్నారు…యుగాలుగా వంటింట్లో... అమ్మమ్మ.. నానమ్మ.. ముత్తమ్మ  .. అమ్మ.,పిన్ని, అక్క, అత్త.. కోడళ్లు ,భార్యలు  , కూతుర్లు ., ఇంకా చాలా మంది  గుస గుస లాడుతూ.. మూల్గుతూ .. కొన్నిసార్లు ఒకరితో ఒకరు  కొట్లాడుతూ,,అరుచుకుంటూ   బట్టలు నాని పోయేంతగా చెమటలు కక్కుతూ ! కత్తులూ .. ఫోర్కులూ .. గరిటెలు.. ఉడుకుడుకి పోతూ ఆవిర్లు కక్కుతూ అరిచరిచి  ఆగిపోయే కుక్కర్లు .. బజ్జీలతో కాగి కాగి ., మసలి మసలి పోయే బాండళ్ళు..        కప్పులూ.. సాసర్లు .. వణికే వేళ్ళతో పట్టుకుంటూ .. జారవిడుస్తూ ! ఆ స్రీల 
కథలు

మనసుడికి పోతే…

రిక్షా అప్పన్న కూతురు పెళ్లంట. ఆడి పెద్ద కూతురు మల్లీశ్వరికి పద్నాలుగేళ్లుంటాయి. ముగ్గురు కూతుళ్ల తరువాత ఒక్కడే మొగ్గుంటడు పుట్టాడు అప్పన్నకి. అప్పన్నకి తాను తోలే రిక్షా కాకుండా పన్నెండు బళ్లు అద్దెకు తిరుగుతాయి. చెయ్యెత్తు మనిషైనా అప్పన్నకి ఒక కాలు బోదకాలు అవ్వడం చేత ఎక్కువగా రిక్షా తొక్కడు. బళ్ల అద్దెలు వసూలు చేసుకుంటాడు. అతని అన్నదమ్ములందరిదీ ఒకటే వాసని పెంకుటిళ్లు. చూడముచ్చటగా ఉంటాయి. ఎలమంచిల్లోని మాలపల్లంతటికీ అప్పన్నే మోతుబరి. అప్పన్న అక్క ఒకావిడ రంగం ఎల్లి బోల్డు బంగారం, డబ్బు తెచ్చిందనీ, అన్నదమ్ములకి ఒక కాపు కాసిందనీ చెప్పుకుంటారు. రంగవప్పయ్యమ్మకి ఈ ఊర్లో ఒక మొగుడున్నాడు.
సాహిత్యం కథలు హస్బెండ్ స్టిచ్ - 3

అనగనగనగా… ఒక మంచం!

‘నానమ్మా ఇప్పుడే చెప్తున్నాను ఈసారి వచ్చినప్పుడు పందిరి మంచం తీస్కెళ్ళిపోతాను నువ్విక ఆపలేవు నన్ను. పెళ్ళై మూడు సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడిస్తావు నానమ్మా... నువ్వూ పడుకోవు, అమ్మనీ పడుకోనీవు. నాకూ ఇవ్వవు. స్టోర్‌ రూమ్‌లో ఆ నల్ల దుప్పటితో కప్పెట్టేస్తావు అదేదో పురావస్తు గ్నాపకంలా... షాజహాన్‌ ముంతాజ్‌ కోసం కట్టిన తాజ్‌మహల్లా... ఏంటది నానమ్మా అర్థం ఉండాలి. వస్తువులు, మనుషులు అందరికీ ఉపయోగపడాలి అంటావుగా నువ్వు. అంత పెద్ద అందమైన పందిరి మంచం, చూస్తేనే నిద్రొచ్చేలా ఉండే పందిరి మంచం, జోలపాడుతూ అమ్మ ఒడిలా కమ్మగా జోల పాడుతూ నిద్రపుచ్చే పందిరి మంచం... కమ్మటి కలల్నిచ్చే పందిరి మంచం
కథలు హస్బెండ్ స్టిచ్ - 3

భ్రమాన్వితుడా…!

ఏమంది సునయన? ‘యూ హావ్‌ టు వర్క్‌ హార్డ్‌... రేపట్నించీ ఇంకో రెండు ఎక్సర్‌సైజెస్‌ ఆడ్‌  చేస్తాను, అండ్‌ డైట్‌లో కార్బ్స్‌ ఇంకా తగ్గించేయాలి. ప్రొటీన్స్‌ ఆడ్‌ చేయండి.. ఓకే, రేపు హిప్‌ లిఫ్ట్స్‌? ఫ్లిట్టర్‌ కిక్స్‌, సిసర్‌ కిక్స్‌, వి`సిట్స్‌, అప్స్‌ ఆడ్‌ చేస్తాను. డోంట్‌ వర్రీ... మీ పొట్ట తగ్గి బాడీ మంచి షేప్‌లోకి వచ్చేస్తుంది. యువర్‌ హస్బెండ్‌ స్టార్ట్స్‌ లవింగ్‌ యూ మోర్‌... శారదగారూ, జిమ్‌ కోచ్‌ సునయన కన్ను కొడ్తూ చిలిపిగా నవ్వింది. శారదా నవ్వింది. కానీ నీరసంగా, ఇబ్బందిగా. దేహ కొలతలు సంతృప్తిగా ఉంటేనే ఎక్కువ ప్రేమించే భర్త ఎందుకు? తన
సాహిత్యం కథలు హస్బెండ్ స్టిచ్ - 3

మాట్లాడు!!

నువ్వు నాతో మాట్లాడు ఈ ప్రపంచాన్నంతా పక్కన నెట్టేసి వింటాను నువ్వు నాతో మాట్లాడుతూనే ఉండు ఈ ప్రపంచాన్నంతా నీలోనే చూసుకుంటాను మాట్లాడు... మాట్లాడు స్నేహితుడిలా... ప్రేమికుడిలా... సహచరుడిలా రోజూ నన్ను పలకరించే తోటలోని గువ్వలా... మాట్లాడు... మాట్లాడు - స్వర “ఏమిటీ మెస్సేజీలు చెత్త కాకపోతే... ఏం మాట్లాడాలి నీతో? పని చేస్కోనీవా...?” కోపపు ఎమోజీ ఎర్రగా... చిరాగ్గా కార్తీక్ నుంచి. స్వర కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఏమీ లేవా తమ మధ్య మాటలు...? పంచుకోవాల్సినవి, తెలుసుకోవాల్సినవి తెలపాల్సినవి... రోజూ చూసుకునే ఇద్దరి మనుషుల మధ్య... సహచరుల మధ్య? ఈ సంభాషణ లేని జీవితం ఏమిటి? ఈ
కథలు హస్బెండ్ స్టిచ్ - 3

 బ్రెస్ట్ టాక్…

'హస్బెండ్ స్టిచ్' 3 చిన్నారి తల్లీ... నన్ను క్షమించు. ఇక ఇవన్నీ వీడ్కోలు దినాలేనా ఇక మనిద్దరికీ? నిన్నూ... నన్నూ బలవంతంగా విడదీస్తున్నారు. అదీ అసహజంగా... ఇవి నీకు పాలు మాన్పిస్తున్న సమయాలు... నీ నోటి నుంచి ఆహారం గుంజుకుంటున్న కాలాలు! ఎంత దౌర్భాగ్యం ఈ అమ్మకు... ఎంత దురదృష్టం నీకు...? పసి బిడ్డ పొట్టగొట్టి మరీ వాంఛ తీర్చుకునేవాడు మరెవరో కాదు తల్లీ... మీ నాన్న! అవును మీ నాన్నే... బాధగా వుందా పాపా? నా రొమ్ములు చిన్నగా ముడుచుకు పోతాయట నువ్వు పాలు తాగితే... నిజానికి నా హృదయం ముడుచుకు పోతుందని మీ నాన్నకు తెలీదు!
కథలు

లోప‌లి ప్ర‌పంచం

          "ఏంబా ఇంకా క్యారేజ్ రెడీ చేయలేదా. కాని టైం అవుతోంది" ఆంజనేయులు అది మూడో సారి అరవడం మూడు రోజులకు సరిపడా చపాతీలు రెడీ చేయడం అంత తక్కువ సమయంలో సాధ్యం కాదు. అయినా ఆకలికి కడుపు మాడ్చు కుంటాడేమోనని పద్మ తయారు చేస్తోంది. "ఇంకెప్పుడు  నువ్వు మాములు డ్యూటీకి వచ్చేది. ఆ బేస్ క్యాంపు డ్యూటీ వేసుకోవద్దు అని చెప్పినా వినవా. ఆ కొండల్లోకి వెళితే సెల్లు పనిచేయదు. నీకు ఏమైందో తెలీక టెన్షన్ పడలేక చస్తున్నా " పద్మ కోపంగా అంది. "ఈ తిట్లకేం గాని  నువ్వు క్యారేజ్ ఇస్తే ఇయ్యి, లేపోతే పో"
కథలు

రాంకో

ఉదయం ఏడుగంటలు కావస్తున్నది. తనతో ఉన్న వారిలో నుండి ఇద్దరిని తీసుకుని ఊళ్లోకి బయలుదేరింది. అది నాలుగు గడపలున్న కుగ్రామం. పేరు మాకడిచూవ్వ.  గడ్చిరోలీ జిల్లా చాముర్షి తాలూకాలో ఉన్నది. రాయగఢ్‌ నుండి వలసవచ్చిన ఉరావ్‌ ఆదివాసులవి రెండు ఇళ్లు.  స్టానికులవి రెండు గడపలు. వర్షాలు జోరుగా కురుస్తూ వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగే కాలం. ఎడ్ల భుజాల మీదికి కాడిని ఎక్కించిన రైతులు పొలానికి పోవటానికి తయారవుతున్నారు. ఆడ‌వాళ్లు  వంటపని ముగించుకుని అన్నం డొప్పల్లోకి సర్దేశారు.  దానికి విడిగా ఆకు మూత వేసి గంపలో అన్ని డొప్పలనూ పెట్టుకున్నారు. పొలానికి పోవటానికి సిద్ధమవుతున్నారు.  రణితను దూరం నుండే
సాహిత్యం కథలు “మెట్రో జైలు” కథలు

డిటెన్యూ

 సాయంత్రం లాకప్ అయ్యే ముందు గిన్తీ కోసం అందరినీ వరుసలుగా కూర్చోబెట్టారు. సాయంత్రం డ్యూటీలో ఉన్న ఒక వార్డర్ వచ్చింది.  “డిటెన్యూ లు పక్కకు నిలబడండి” అన్నది. ఇద్దరు పక్కకు నిలబడ్డారు. ఆమె ఒకసారి తాను తెచ్చుకున్న కాగితాలు చూసుకొని “ఇంకొకరు ఉండాలే” అని తలెత్తి కమల వైపు చూసింది. “నువ్వు కూడా!” నేను కూడా అప్పుడే ఆమెను చూశాను. అందరినీ లెక్కబెట్టుకొని వార్డర్ బయటికి నడిచింది. ఆమెతో పాటుగా వచ్చిన ఖైదీల ఇంచార్జ్ (శిక్షపడిన వాళ్ళని నియమిస్తారు) తాళాలు వేసి వార్డరు వెనకనే వెళ్ళిపోయింది. నేను చేతిలోకి వార్తా పత్రిక తీసుకొని చదవడం మొదలుపెట్టాను. కమల నా
సాహిత్యం కథలు “మెట్రో జైలు” కథలు

మర్యాదస్తులు

“మెట్రో జైలు” కథలు: 1 “హజారీబాగ్ జైలు గాధలు” సంపుటి “ఏదినేరం”,  విరసం ప్రచురణగా పాఠకుల్లోకి వెళ్ళాక రెండవ భాగం ఎప్పుడు వస్తుంది అని చాలా మంది అడిగారు. మళ్ళీ అరెస్ట్ అయితే వస్తుంది అని సరదాగా అన్నాను. ఫాసిస్టు రాజ్యం ఆ మాటలని నిజం చేసింది. నిజానికి అలా అన్నాను కానీ భారతదేశంలో జైళ్ళన్నీ ఒకే లాగా ఉంటాయి కాబట్టి మళ్ళీ అరెస్టయినా కొత్త కథలు ఏం ఉంటాయి అని కూడా అనిపించింది. కానీ నేను రెండో సారి 2019 నవంబర్ లో అరెస్టయ్యి హైదరాబాదులోని చంచల్ గూడా జైలులో 8 నెలలు గడిపాక ఒక మెట్రోపాలిటన్