అన్నం పెట్టినోల్లని ..
పలమనేరులో ఆరేడు కళ్యాణమండపాలున్నాయి.అన్నీ కొత్త పేటలోనే వున్నాయి. పాతపేటలో ఒకప్పుడు ఒక చిన్న సత్రం వుండేది, కానీ ఏవో గొడవలు, కోర్టు కేసుల వల్ల అది మూతబడింది. ఇప్పుడిక ఎవరిదైనా పెండ్లి అంటే కొత్తపేటకు వెళ్లాల్సిందే. నాలుగో నెంబరు జాతీయ రహదారి దాటాల్సిందే. వంటమాస్టర్ ఎరుకల కపాలిని కలవాలంటే మాత్రం ఎవరైనా పాతపేటలోని ఎస్టీ కాలనీకి రావాల్సిందే.! కపాలి వుండేది ఎస్టీ కాలనీలోనే. ఆ మనిషి కోసం పెద్ద పెద్దోళ్ళు రోడ్డు దాటి, వీధులు దాటి ఎస్టీ కాలనీలోకి వస్తారు. మేం ఒకప్పుడు వాళ్ళ ఇండ్లల్లోకి పోలేని వాళ్ళమే అయినా, ఇప్పుడు మా జాతోడు చేసే వంటలు అందరూ