కవిత్వం

ఎంపిక

నేనేమీసుడిగాలుల పిడి గుద్దులకుతుఫానుల రౌడీతనానికీచలించిపోయే గోడను కానుభూమి లోలోపలి పొరల్లోపాతుకు పోయిన రాయినీ కానుగుచ్చుకొన్న దుఃఖపుసూదుల చురుక్కుమనే పోట్లకుపట్టించుకోని తనపు నిర్లక్ష్యపు కత్తిగాట్లకువిలవిలలాడే సున్నితత్వాన్నిగుడ్డులో నుంచి అప్పుడే రెక్కలు విప్పుకొంటున్న సౌకుమార్యాన్నిప్రతి చిన్నదానికీ కరిగి కురిసే చినుకునునా రెక్కల్ని ముక్కల్ని చేసేహక్కు నీకెవరిచ్చారుఅమ్మ గర్భాంతరంలోఉమ్మనీటి తటాకం నుంచిబాహ్య ప్రపంచంలోకి రాగానేఅలా ఉండు ఇలా ఉండకుఈ విధి నిషేధ సూత్రాలే కదానా బ్రతుకు వ్యాకరణం నిండాఈ ప్రపంచపు సూర్యకిరణాల వర్షంలో తడవకుండానా దేహ పుష్పానికీ గాలిసోక కుండాకప్పేసిన ఈ నల్లని ముసుగేమిటి?అసలు నా కట్టుబొట్టుపైపరాయి పెత్తనమేమిటి?నా ఊపిరి మీద నా బట్టల మీదఒకరి ఆజ్ఞ లేమిటిన్యాయమూర్తులైనా పాలకులైనామీ నిర్ణయాలతో పనేమిటిఇక
కిటికీ పక్కన సీటు
కవిత్వం

కిటికీ పక్కన సీటు

ప్రపంచాన్ని కిటికీలో నుండి చూడడం మీకు అనుభవమేనా.. చల్లని గాలి తనువును తాకుతుంటే జ్ఞాపకాలు మనసును తాకుతుంటాయి పరిసరాలు వెనక్కు పోతుంటే పాత గుర్తులన్ని ముందుకొస్తుంటాయి.  బస్సుతో పాటు టైరు ఆడుతూ  బస్ వెనకాలే పరిగెత్తే పసివాడు మళ్ళీ మన పసితనాన్ని గుర్తు చేస్తాడు బస్ కోసం పరిగెత్తుతూ  వస్తున్న తల్లెంట  వెనకాలే ఏడుస్తూ వస్తున్న చిన్నోడు మన బాల్యాన్ని  బావిలోనుండి నీళ్ళు తోడినట్లుగా తొడుతుంటాడు. ఐదో తరగతి చదివే పిల్లవాడి తల్లిని కండక్టర్ టికెట్ అని అడిగితే మావోడు ఒకటో తరగతే అని అమ్మ చెబితే.. అమ్మ అమాయకత్వ ఆన్సర్ కి  బస్ ఎక్కినప్పుడల్లా మన చదువు