కథలు

మిస్టర్ ఏ

విజయవంతమైన వ్యక్తి  జీవిత కథను మనం చదివినప్పుడు, వారు వారి జీవితంలోని సవాళ్లను ఎలా  అధిగమించారు అనే దాని గురించి మనకు చాలా అంతర్దృష్టిని అందిస్తుంది. ఈ పాఠాలు మన జీవితాలను నడపటానికి,  మన ప్రియమైనవారి కోసం మంచి భవిష్యత్తును ప్లాన్ చేయడంలోను  సహాయపడతాయి. నిజానికి మిస్టర్ ఏ  భారత ఆర్థిక వ్యవస్థ  ఆకాశంలో మెరిసే నక్షత్రం. మిస్టర్ ఏ, అంబానీల తర్వాత రెండవ సంపన్న కుటుంబం. కానీ ఇతర వ్యాపార దిగ్గజాల మాదిరిగా కాకుండా, మిస్టర్ ఏ తన తండ్రి నుండి అదృష్టాన్ని వారసత్వంగా పొందలేదు. బదులుగా, అతను తన విధిని మార్చడానికి చాలా కష్టపడ్డాడు. మిస్టర్ ఏ  విజయగాథను పరిశీలిస్తే,  అతని బలమైన
నివాళి

ప్రొ. కందాళ శోభారాణికి విరసం నివాళి

కాకతీయ విశ్వవిద్యాలయం అధ్యాపకురాలు ప్రొ. కందాళ శోభారాణి ఫిబ్రవరి 12న మరణించారు. గత కొన్నేళ్లుగా ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలోనే చదివి,  తెలుగు సాహిత్యంలో పరిశోధన చేసి అక్కడే ప్రొఫెసర్‌గా  చేరారు. సుదీర్ఘ ప్రజా పోరాటాల చరిత్ర ఉన్న వరంగల్‌లో సామాజిక చైతన్యంతో మేధో రంగంలోకి వచ్చిన ఈ తరం అధ్యాపకురాలు శోభారాణి. విద్యార్థిగా, పరిశోధకురాలిగా ఉన్న రోజుల్లోనే ఆమె తన చుట్టూ జరుగుతున్న ప్రజా పోరాటాలను శ్రద్ధగా గమనించేవారు. వాటిని అభిమానిస్తూ చేయూత ఇచ్చేవారు. అనేక నిర్బంధాలు చుట్టుముట్టి ఉండే వరంగల్‌లో బుర్రా రాములు వంటి వారితో కలిసి హక్కుల ఉద్యమంలో భాగమయ్యారు.  మానవ
కవిత్వం

వడ్డెబోయిన శ్రీనివాస్ కవితలు మూడు

1. మృతకాలం-అమృతకాలం అమృతకాలం వచ్చిందహో ఆవుకు ! ఆలోచించినా ఆశాభంగం కౌగిలించుకో కౌగిలించుకో ఆహా. మనిషికంటావా మృతకాలమే. ఆకలితో ఉపాధి లేమితో బాదలతో కన్నీళ్ళతో కరోనా కార్మికచావువో కారోనా ఆకలిచావువో పోపో చప్పట్లు కొట్టుకుంటో దీపాలు వెలిగించుకుంటో అమృతకాలం వచ్చింది ఆవును కొగిలించుకో పోసిటివ్ ఎనిర్జీ వస్తుంది ఆహా మనిషికంటావా మృతకాలమే. పరిశీలకునివో పరిశోధకునివో శాస్త్రీయ సామాజిక వ్యాఖ్యతవో డబోల్కరో గౌరీ లంకేశో చంపబడితేనేం కాల్చబడితేనేం పొండి పొండి సత్యం ఉచ్చరిస్తూనే అమృతకాలం వచ్చింది ఆవును కౌగిలించుకో పాజిటివ్ ఎనర్జి వస్తుంది. ఆహా మనిషి కంటావా మృతకాలమే అపవిత్రమనో దళితనో ఎదురొచ్చాడనో ఎదురునిల్చాడనో పండు కోశాడనో నీల్లుతాగాడనో మీసాలు
కథలు

మనసుడికి పోతే…

రిక్షా అప్పన్న కూతురు పెళ్లంట. ఆడి పెద్ద కూతురు మల్లీశ్వరికి పద్నాలుగేళ్లుంటాయి. ముగ్గురు కూతుళ్ల తరువాత ఒక్కడే మొగ్గుంటడు పుట్టాడు అప్పన్నకి. అప్పన్నకి తాను తోలే రిక్షా కాకుండా పన్నెండు బళ్లు అద్దెకు తిరుగుతాయి. చెయ్యెత్తు మనిషైనా అప్పన్నకి ఒక కాలు బోదకాలు అవ్వడం చేత ఎక్కువగా రిక్షా తొక్కడు. బళ్ల అద్దెలు వసూలు చేసుకుంటాడు. అతని అన్నదమ్ములందరిదీ ఒకటే వాసని పెంకుటిళ్లు. చూడముచ్చటగా ఉంటాయి. ఎలమంచిల్లోని మాలపల్లంతటికీ అప్పన్నే మోతుబరి. అప్పన్న అక్క ఒకావిడ రంగం ఎల్లి బోల్డు బంగారం, డబ్బు తెచ్చిందనీ, అన్నదమ్ములకి ఒక కాపు కాసిందనీ చెప్పుకుంటారు. రంగవప్పయ్యమ్మకి ఈ ఊర్లో ఒక మొగుడున్నాడు.
సంభాషణ నివేదిక

సాంస్కృతిక ప్రతివ్యూహపు కలనేత

విరసం సాహిత్య పాఠశాల నివేదిక విరసం 23వ సాహిత్య పాఠశాల జనవరి 7,8 తేదీల్లో  హైదరాబాదు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉత్తేజకరంగా జరిగింది. ఫాసిస్టు వ్యతిరేక పోరాటాల ప్రాంగణం, వాసం శివ హాలులో, నర్మద వేదికపైన రెండు రోజులు ‘ఫాసిజం ` సాంస్కృతిక ప్రతివ్యూహం’ అనే అంశంపై లోతైన చర్చ సాగింది. 7వ తేదీ శనివారం ఉదయం 11.00 గంటలకు సభా ప్రాంగణం ముందు పతాకావిష్కరణతో ప్రారంభమై ఆదివారం రాత్రి 9.00 గంటల దాకా సుమారు 16 గంటలపాటు నడిచిన సాహిత్య పాఠశాలలో వందలాది సాహిత్యాభిమానులు, సామాజిక కార్యకర్తలు, విప్లవాభిమానులు పూర్తి నిమగ్నతతో పాల్గొన్నారు.  విరసం సీనియర్‌ సభ్యులు