ఆర్ధికం

సెబీలో ‘హిండెన్ బర్గ్’ తుఫాన్

 18 నెలల క్రితం అదానీ గ్రూప్ ఏకపక్ష సామ్రాజ్యాన్ని పునాదులతో కుదిపేసిన అమెరికాకు చెందిన ఫోరెన్సిక్ పరిశోధన సంస్థ హిండెన్ బర్గ్ మరోసారి 'సమ్ థింగ్ బిగ్ న్యూస్ ఇండియా' అంటూ 'ఎక్స్'లో ఆగష్టు 10న పేర్కొన్న గంటల వ్యవధిలోనే బాంబు పేల్చింది. అదానీ గ్రూప్ అక్రమంగా నిధులు మళ్లింపునకు ఉపయోగించిన విదేశీ ఫండ్స్, షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్  ఫండ్స్ లో, బెర్ముడా (బ్రిటిష్), సింగపూర్లో లో గౌతమి ఆదానీ అన్న వినోద్ అదానీ నెలకొల్పిన కంపెనీలో 'సెబి చైర్ పర్సన్' మాధవి పూరి బుచ్' తో పాటు ఆమె భర్త 'ధవళ్ బుచ్'
వ్యాసాలు

స్టాలిన్-  ఫాసిస్టు వ్యతిరేక అవగాహన

ఫాసిజం అనే పదం దాదాపు వంద సంవత్సరాల చరిత్ర కలిగి వున్నది. ఈ పార్టీని మొదటగా ముసోలిని ఇటలీలో ప్రారంభించాడు. హిట్లర్ జర్మనీలో ప్రారంభించాడు. వీరిద్దరూ కలిసి మొత్తం మానవాళి మనుగడకే ప్రమాదకారిగా పరిణమించిన రెండవ ప్రపంచ యుద్ధాన్ని ప్రారంభించారు. వీరి కూటమిని ఓడించేందుకు ప్రపంచమంతా ఒకటయింది , ఆ మహా కూటమిలో ప్రత్యర్థి వ్యవస్థలైన సోవియెట్ వ్యవస్థ,పెట్టుబడిదారీ వ్యవస్థ తాత్కాలికంగానైనా ఒక్కటయినాయి. ఆ ఐక్యసంఘటన ఏర్పడకపోతే ప్రపంచం ఏమైపోయేదో ఆలోచించలేము. పెట్టుబడిదారీ దేశాల వైపునుండి ఆలోచిస్తే ఆ కూటమే వారిని వినాశనం నుండి రక్షించింది. రెండవ ప్రపంచ యుద్ధంలో సోవియెట్ ప్రజలదే అసమాన త్యాగం. ప్రారంభంలో హిట్లర్
సంపాదకీయం

అదాని-ఆర్‌ఎస్‌ఎస్‌: భారత ఆర్థిక వ్యవస్థ

మత, ఆర్థిక వ్యవస్థల సంబంధం మీద చాలా మందికి సందేహాలు ఉంటాయి. ఏ సందేహం లేనిది ఆర్‌ఎస్‌ఎస్‌కే. “గురూజీ” చెప్పినట్లు తమది సాంస్కృతిక సంస్థ కదా..పిందూ మతాన్ని ఉద్ధరించే సంస్థ కదా.. అదాని గొడవ మనకెందుకులే అని ఆర్‌ఎస్‌ఎస్‌ అనుకోలేదు. ఈ దేశంలోని పేదల గురించి, వాళ్ల కష్ట నష్టాల గురించి ఏనాడూ పట్టించుకోని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రపంచ సంపన్నుల్లో మూడో స్థానంలో ఉన్న అదాని ఆర్థికంగా 'నష్ట* పోతున్నాడని, ఆయన తరపున వకాల్తా తీసుకున్నది. అదాని గ్రూప్‌ ఆర్థిక సామ్రాజ్యం నేరాల పుట్ట అని అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ అనే సంస్థ బైట పెట్టడగానే ఆర్‌ఎస్‌ఎస్‌ ముందుకు వచ్చింది.
వ్యాసాలు

మోడీ+ అదానీ = భారత దేశం

దేశంలో క్రమశిక్షణారాహిత్యం పెచ్చరిల్లిపోతోంది. హిందూ ప్రభువు విధానాలను శంకిoచేవారూ, అనుమానాలను రేకిత్తించేవారూ ఎక్కువవుతున్నారు. అర్బన్ నక్సల్స్, ఖలిస్తాన్ వాదులు, పాకిస్తాన్, చైనా ఏజెంట్లు సరేసరి. చిన్నాచితకా వ్యాపారస్తులు, పొలానికెళ్ళి దుక్కి దున్ని నాలుగు చినుకులు పడగానే విత్తు విత్తి ఆ తర్వాత వానకై ఆకాశం వైపు జూస్తూ పంట చేతికొచ్చాక నాలుగురాళ్ళు చేతికందుతాయని ఆశగా జీవనం గడిపే అమాయక రైతన్నలు, నిత్యం దేశభక్తిని ఆహారంగా పొందుతూ, అది వారి ప్రాణ వాయువై , జీవిత సమస్యలను పట్టించుకోకుండా మసీదు-మందిరం తగువులాటల్లో ప్రాణాలు కోల్పోవడానికీ సిద్ధం కావాల్సిన యువకులు కూడా సామ్రాట్ మోదీ విధానాలను అపార్థం జేసుకుoటున్నారంటే ఇది కలికాలం
వ్యాసాలు

ఆదాన ప్రదానాల్లో భారత్

అయినా మన పిచ్చిగానీ , ఎంత అమెరికన్ సెoట్లతో ముంచినా, ఎంత దేశభక్తి, జాతీయతా వాదంతో ముంచెత్తినా, కుళ్ళిన శవం కంపుగొట్టకుండా ఉంటుందా?  ఐదేండ్లకొకసారి, శవపేటిక నుండి బయటకు లాగి, ఎన్నికల ప్రజాస్వామ్య శవాన్ని జీవమున్న దానిగా ప్రదర్శిస్తే మాత్రం, ప్రతి ఏడాది, అత్తరుతో స్నానం చేయించి గులాబీ, మల్లెలతో అలంకరించి వీధుల వెంట  “భారత్ మాతాకు” జై,   “జై శ్రీరాం ” నినాదాలతో హోరెత్తిస్తూ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసినంత  మాత్రాన లేని జీవం ఎక్కడ నుండి వస్తుంది. ఈ కుళ్ళు వ్యవస్థను  సమూలంగా ధ్వంసం చేయకుండా, అది హర్షద్ మెహతా కావొచ్చు, లేక కేతన్ పరిక్ కావొచ్చు..
కాలమ్స్ ఆర్ధికం

అదానీ గుట్టు విప్పిన హిండెన్‌బర్గ్‌

ప్రధాని నరేంద్ర మోడీకి ఎంతో సన్నిహితుడు గుజరాత్‌ వ్యాపారి గౌతమ్‌ అదానీ ఇప్పుడు ఆయన  సిరుల శిఖరాల వెనుక అతి పెద్ద కుట్ర దాగి ఉన్నదని అమెరికాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక పెట్టుబడుల పరిశోధన సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ అనే అంతర్జాతీయ సంస్థ జనవరి 24న వెల్లడించిన  సమాచారం సంచలనం సృష్టించింది. ప్రపంచంలోనే మూడవ అత్యంత ధనవంతునిగా ఖ్యాతికెక్కిన గౌతమ్‌ అదానీ వ్యాపార మోసాల పుట్ట పగిలింది. ఇంతకాలం ఆయన చక్కబెట్టిన అవినీతి, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. అదానీ నెరపిన మార్కెట్‌ కుంభకోణాలను దాంతో డబ్బు సంపాదనా పరులకు ఆదర్శంగా నిలిచిన అదానీ ఆర్థిక ఎదుగుదల వెనుక గల