Tag: new book
రాయలసీమ ‘సాధన’ నవల
రాయలసీమకు జరిగిన విద్రోహానికి నవలా రూపం సాధన. తెలుగు నవలా ప్రస్థానంలో సాధన నవల ఒక మలుపు. ఈ నవలా రచయిత అనంతపురం జిల్లాలోని శాంతి నారాయణ. ఇది వరకు చారిత్రక నవలలు, మనో వైజ్ఞానిక నవలలు, సాంఘిక రాజకీయ ఉద్యమ అస్తిత్వ నవలలు శాంతి నారాయణ రాశారు. సాధన నవల అస్తిత్వవాద నవల. రాయలసీమకు అనాదిగా జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి పట్టిన నవల. అందుకేనేమో ఈ నవలకు గాయపడిన నేల అనే ట్యాగ్ ఉంచారు. కోస్తా ప్రాంతం వారి వివక్ష వల్లనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నీళ్లు, ఉద్యోగాలు తదితర అనేక విషయాలలో రాయలసీమకు
విప్లవ చారిత్రక నవల
‘‘తమ తిరుగుబాటు ఒక జార్‌ని దించేసి మరో జార్‌ని, లేదా మరో పాలకుడ్ని సింహాసనం మీద కూర్చోబెట్టడం కాదు. ఒక మహాలక్ష్యం కోసం ఉద్దేశించినది’’సెర్గీమాట The secret of beauty is the secret of life. The beauty of life is the beauty of struggle. (Y. Borev : Aesthetics, p.44& 46)(జీవిత రహస్యమే సౌందర్య రహస్యం. సంఘర్షణ సౌందర్యమే జీవిత సౌందర్యం) జీవితం, సంఘర్షణ, సౌందర్యం - ఇవి ఒక విడదీయరాని త్రయం. రచయిత నాగభూషణ్ రచించిన బృహన్నవల ‘‘డిసెంబరిస్టు ఖైదీ’’ ఒక చారిత్రక నవల. ఒక ఉద్యమ చరిత్రను ప్రతిబింబించిన
కొత్త పాఠం
50 ఏళ్ల విరసం మహాసభల్లో కలిసిన ఒక ట్రాన్స్ సామాజిక కార్యకర్తతో ఒక రాత్రంతా జరిపిన సంభాషణ, అంతకు ముందే జరిగిన హైదరాబాద్ ప్రైడ్ మార్చ్, అడపాదడపా బిట్టూతో పంచుకున్న విషయాలు కొత్త లోకంలోకి తలుపులు తెరిచాయి. అమ్మాయి ఇలా ఉండాలి, అబ్బాయి ఇలా ఉండాలని నిర్దేశించే సామాజిక నీతి పట్ల చికాకు, జెండర్ స్టీరియోటైప్‌కు భిన్నంగా ఉండే వ్యక్తుల పట్ల ఆసక్తి నా రాజకీయ అవగాహనతో సంబంధం లేకుండా మొదటి నుండీ ఉండేవి. మార్క్సిజం పరిచయమయ్యాక మానవ సంబంధాలను అర్థం చేసుకునే తీరు తెలిసింది. ఒక ఆలోచనా దృక్పథం ఉన్నంత మాత్రాన అన్నీ సులువుగా అర్థం కావు.
జీవితానుభవాన్ని ఎర్రజెండాలా ఎగరేసిన కవిత్వం
రాజకీయ కవితలు రాయడం చాలా కష్టం. అందులోనూ కమ్యూనిజం లేదా ఇప్పుడు పాలకులు పదేపదే ఉఛ్ఛరిస్తున్న అర్బన్ నక్సల్ అవగాహనతో కవిత్వం రాయడం ఇంకా కష్టం. ఇలాంటి కవిత్వం లో రెండు అంశాలు ప్రధానంగా కనబడతాయి. నేరుగా ప్రజాపోరాటాలతో, జనజీవితంతో సంబంధం ఉండడమూ, వాటి రూప సారాలను మార్క్సిజం ఆధారంగా అర్థం చేసుకునే చారిత్రక అవగాహన కలిగి ఉండడమూ. నేను చూసిన, పరిచయమున్న ఇలాంటి పెద్దలలో అరుణ్ సార్ ఒకరు. తాను నమ్మిన విప్లవ పంధా నుంచి, ఈ సుదీర్ఘ జీవన ప్రయాణంలో ఇసుమంత కూడా పక్కకు ఒరగని నేపధ్యం నుంచి ఎలాంటి కవిత్వం ఆశించగలమో అలాంటి