కన్నడ మేధావులు 522 మంది విడుదల చేసిన ప్రకటన మేము, భారతదేశ శాస్త్రవే త్తలం, అధ్యాపకులం ”ఇండియా:ది మోదీ క్వశ్చన్” బిబిసి డాక్యుమెంటరీ రెండు భాగాల ప్రసార నిలుపుదల పట్ల తీవ్ర విషాదానికి గురయ్యాం. ఆ డాక్యుమెంటరీ “భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రత” కు భంగకరమనే సాకుతో దాన్ని సామాజిక మాధ్యమాల నుండి తొలగించారు. ఈ సమర్థన పరిశీలనకు నిలబడదు. మీ తొలగింపు , మన సమాజానికి, ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యసమాచారాన్ని దేశ ప్రజల తెలుసుకొనే హక్కును కాలరాస్తుoది. దేశంలోని చాలా విశ్వవిద్యాలయాలు ఆ డాక్యుమెంటరీ ప్రదర్శనను అడ్డుకొనే ప్రయత్నం జేసాయి. ఇది అకడమిక్ స్వేచ్ఛను ఉల్లంఘించడమే అవుతుంది. విశ్వవిద్యాలయాలు