బిర్సా ముండా ఊరు ఉలిహతు (ఖుంటి) నుంచి ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2023 నవంబర్ 15న ప్రారంభించారు.  ఇది ప్రభుత్వ విజయాల ప్రచారం కోసం అని చెబుతున్నారు కానీ వాస్తవానికి ఇది 2024 పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ యాత్ర. కార్యక్రమానికి బీజేపీ రంగు పులిమేందుకు ప్రభుత్వ అధికారులకు రథ బాధ్యులు అని పెట్టిన పేరును, ప్రజల నిరసనతో నోడల్ అధికారిగా మార్చారు.

మోడీ ప్రతిష్టను మెరిపించడానికి చేస్తున్న ఈ యాత్ర డబ్బు వృధా తప్ప మరొకటి కాదని, ప్రభుత్వ కార్యకలాపాలకు ఆటంకంగా ఉందని జార్ఖండ్‌లోని అనేక ప్రజా సంస్థలు, సామాజిక కార్యకర్తలు అంటున్నారు. మోడీ ప్రభుత్వం ‘ప్రచారం’లో ప్రపంచ రికార్డులు బద్దలుకొడుతూనే వుంటుంది.

ఆదివాసీ వీరుడు బిర్సా ముండా జన్మస్థలం నుంచి యాత్రను దురుద్దేశంతో ప్రారంభిస్తున్నారని ఆదివాసీ సమాజాన్ని హెచ్చరిస్తూ  ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలు, ‘సేవ్ డెమోక్రసీ క్యాంపెయిన్ 2024’ కింద ‘అబువా జార్ఖండ్, అబువా రాజ్’ (మా జార్ఖండ్, మా రాజ్యం) ప్రచారాన్ని ప్రారంభించి తమ నిరసనను నమోదు చేశారు.

ఆదివాసీలను తిరిగి తమ వైపుకు ఆకర్షించడానికి ఆ మహానాయకుడి పట్ల  ఆడంబరమైన గౌరవాన్ని చూపించి కొత్త ఉపాయాన్ని పన్నుతున్నాడు. ఈ యాత్ర ద్వారా జార్ఖండ్‌లో అత్యధిక పార్లమెంటు స్థానాలను గెలుచుకుని మూడోసారి ప్రధాని కావాలనుకుంటున్నాడు.

ఆదివాసీల స్వతంత్ర అస్తిత్వాన్ని గుర్తించరు. స్వతంత్ర ఆదివాసీల  ధర్మాన్ని, సంస్కృతిని సనాతన ధర్మంలో చేర్చి మట్టుపెట్టాలనుకుంటున్నారు. ఆదివాసీల ఐక్యతను, శక్తిని తగ్గించి, కుల వ్యవస్థపై ఆధారపడిన బ్రాహ్మణవాద ఆధిపత్యాన్ని స్థాపించాలనుకుంటున్నారు.

ఉలిహాటు నుంచి ఈ యాత్రను ప్రారంభించే నైతిక హక్కు ప్రధాని నరేంద్ర మోదీకి, బీజేపీకి లేదు. మోడీ ప్రభుత్వం రాజ్య మద్దతుతో మణిపూర్‌లో ఆదివాసీలపై మారణహోమానికి అనుమతించింది. మణిపూర్‌ను ఉదాహరణగా చూపి జార్ఖండ్‌లోని బిజెపి నాయకులు సాముదాయిక, మతపర ద్వేష వ్యాప్తికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ  “జన్‌జాతి గౌరవ్ దివస్” పేరుతో శుష్క వాగ్దానాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు.

2019 ఖుంటీ లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపులో చేయించిన అవకతవకల కారణంగా బిజెపి విజయం సాధించింది అనేది ప్రజాభిప్రాయం.

గత తొమ్మిదేళ్లలో అభివృద్ధి చెందిన జార్ఖండ్‌గానో, అభివృద్ధి చెందిన భారత్‌గానో కాకుండా.. భారత్‌ను, ముఖ్యంగా జార్ఖండ్‌ను విధ్వంసం దిశగా మోదీ నెట్టారని ప్రచారంలో పాల్గొంటున్న కార్యకర్తలు అంటున్నారు. కార్మిక, రైతాంగ, అణగారిన వర్గాల హక్కులు నీరుకారిపోయాయి. మన్‌రేగా, పెన్షన్, అంగన్‌వాడీ మొదలైన జీవనావసర సంక్షేమ పథకాల బడ్జెట్‌లో భారీ కోత పెట్టారు. సంపద అభివృద్ధి పెట్టుబడిదారులదే, మరీ ముఖ్యంగా అంబానీ-అదానీలదే జరిగింది. బీజేపీ సంపద భారీగా పెరిగింది. మరోవైపు, తొమ్మిదేళ్లలో గ్రామీణ కార్మికుల వేతన రేటులో పెరుగుదల లేకపోగా అసమానతలు మరింతగా పెరిగిపోయాయి. అలాగే, సామాజిక-మతపరమైన అంశాలు కూడా చిన్నాభిన్నమైపోయాయి.

‘వికాస్ భారత్ సంకల్ప్ యాత్ర’ ప్రారంభించే ముందు, ‘సేవ్ డెమోక్రసీ 2024’ క్యాంపెయిన్ గత తొమ్మిదేళ్లలో జార్ఖండ్ ప్రజలపై ప్రత్యక్షంగా ప్రతికూల ప్రభావాన్ని చూపిన తొమ్మిది ప్రజా వ్యతిరేక చర్యలను ప్రధాని మోడీకి గుర్తు చేయాలనుకుంటోంది.

9 సంవత్సరాలలో ప్రధాని మోడీ చేసిన 9 ప్రజా వ్యతిరేక చర్యల జాబితా:

ఈ తొమ్మిదేళ్లలో మోదీ కేవలం నీరు, అడవి, భూమి, ఖనిజాల దోపిడీ, నిర్వాసితులైన జార్ఖండ్ ప్రజలను నిర్వాసితులను చేయడం మాత్రమే చేసారు. ఇటీవల, అటవీ సంరక్షణ చట్టాన్ని సవరించడం వల్ల  గ్రామసభ, గ్రామస్థుల సమ్మతి తీసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. అంటే ఇప్పుడు మోడీ ప్రభుత్వం జార్ఖండ్ అడవులను అటవీయేతర పనులు, కార్పొరేట్ ప్రాజెక్టుల కోసం గ్రామసభల సమ్మతి లేకున్నా కూడా ఉపయోగించుకోవచ్చు.

కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు, భూ యాజమాన్య పథకాన్ని ప్రయోగాత్మకంగా పైలట్‌ను ఖుంటిలో ప్రారంభించడంతో, సిఎన్‌టి చట్టం, ఖుంటికట్టి వ్యవస్థలు రద్దు అయ్యాయి.      జార్ఖండ్‌లోని ఆదివాసి ప్రజలు నీరు, అడవి, భూమి, ఖనిజాలపై తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. మోడీ ప్రభుత్వం ఈ హక్కులను కాలరాచివేస్తోంది. 2013లో భూసేకరణ చట్టాన్ని మోదీ ప్రభుత్వం పాక్షికంగా కూడా ఆమోదించలేదు. ఆ చట్టాన్ని అంతం చేసేందుకు, ప్రజా వ్యతిరేకత ఉన్నప్పటికీ పదే పదే ఏకపక్ష భూసేకరణ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. అటవీ సంరక్షణ చట్టానికి సవరణలు చేసి, అటవీ హక్కుల చట్టం కింద సేకరించిన అటవీ భూమి, వనరులపై గ్రామసభ హక్కులను లాక్కొని అడవులను పెట్టుబడిదారులకు అప్పగించాలని నిర్ణయించింది.

ఖుంటీలోనే ప్రయోగాత్మకంగా రూపొందించిన భూ యాజమాన్య కార్డు పథకం ద్వారా గ్రామంలోని ప్రభుత్వ భూమిని గ్రామస్తుల అధీనం నుంచి లాక్కోవాలని, సిఎన్‌టి-ఎస్‌పిటి (ఛోటా నాగ్‌పూర్ టెనన్సీ – సంథాల్ పరగణా టెనన్సీ- ఛోటా నాగ్‌పూర్ కౌలుదారీ చట్టం-1908 ) జార్ఖండ్‌లోని ఆదివాసీ జనాభా భూమి హక్కులను పరిరక్షించడానికి బ్రిటిష్ వారి సహాయంతో రూపొందిన భూమి హక్కుల చట్టం. ఈ చట్టం భూమిపై వారి యాజమాన్యాన్ని నిర్ధారించడానికి, ఆదివాసేతరులకు భూమిబదిలీని నిషేధించడాన్ని గమనించాలి.

సంథాల్ పరగణాల కౌలుదారీ చట్టం- 1949 బెంగాల్‌తో వున్న జార్ఖండ్ సరిహద్దుతో పాటు సంథాల్ పరగణా ప్రాంతంలో ఆదివాసీ భూమిని ఆదివాసీయేతరులకు విక్రయించడాన్ని నిషేధించింది. ఇది సంథాల్‌లో క్రోడీకరించబడిన మొదటి కౌలుదారీ చట్టం. ప్రాథమికంగా ఈ చట్టం జార్ఖండ్‌లోని సంథాల్ తెగ భూమి హక్కులను పరిరక్షిస్తుంది.] చట్టాన్ని, ఖుంట్‌కట్టి వ్యవస్థను (ముండా ఆదివాసీల భూమిని ఖుంట్‌కట్టి భూమి అని అంటారు. ఆ భూమిని తమదిగా గుర్తించడానికి  కొయ్య చీలలను పాతేస్తారు కాబట్టి ఆ పేరు వచ్చింది) రద్దు చేసేందుకు కుట్ర పన్నారు. బిజెపి డబుల్ ఇంజన్ ప్రభుత్వం సిఎన్‌టి-ఎస్‌పిటి చట్ట సవరణను వ్యతిరేకించిన వారిని కూడా దౌర్జన్యంగా అణచివేసింది. ఈ 9 సంవత్సరాలలో, రాష్ట్రంలోని సిఎన్‌టి-ఎస్‌పిటి చట్టాన్ని నీరుకార్చడానికి బిజెపి నిరంతరం ప్రయత్నించింది.

నరేంద్ర మోడీకి ఇష్టమైన గౌతమ్ అదానీ అనుచరుడు, గొడ్డా పార్లమెంట్ సభ్యుడు నిషికాంత్ దూబే ఐదవ షెడ్యూల్‌ను, CNT-SPT చట్టాన్ని రద్దు చేయాలనే తన సంకల్పాన్ని ప్రకటించాడు.

2017-18లో ఖుంటిలోని బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం పథల్‌గడి పోరాటంలో (జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లాలోని ఆదివాసీలు భూమిపై సార్వభౌమాధికార హక్కుతో సహా తమ హక్కులను సాధించుకోవడానికి జరిగిన పథల్‌గడి (పథల్‌గడి అంటే ‘చెక్కిన రాయిని నిలబెట్టడం’ అని అర్థం) ఉద్యమంలో పాల్గొన్న వేలాది మంది ఆదివాసీలను దేశద్రోహులుగా ప్రకటించి, జైళ్లలో నిర్బంధించి ఉద్యమాన్ని అణచివేసింది.

వాణిజ్యపర బొగ్గుగని త్రవ్వకాల విధానాన్ని అమలు చేయడం ద్వారా మోడీ ప్రభుత్వం రాష్ట్రంలోని బొగ్గుపై కార్పొరేట్ దోపిడీకి తలుపులు తెరిచింది. అదానీకి యిచ్చిన బొగ్గు తవ్వకాలపై  నిరసనగా నెలల తరబడి గోండుల్‌పురా ఆదివాసీలు ఆందోళనలు చేస్తున్నా, మోడీ ప్రభుత్వం మాత్రం అదానీ మోజులో కూరుకుపోయింది.

2016లో నోట్ల రద్దు కారణంగా జార్ఖండ్‌తో సహా మొత్తం దేశంలో రైతులు, చేతివృత్తులవారు, చిన్న వ్యాపారులు, సామాన్య ప్రజల పరిస్థితి చాలా దారుణంగా ఉంది, వారు ఇప్పటికీ దయనీయ స్థితిలో ఉన్నారు. ఏకపక్ష నిర్ణయంతో వందలాది మంది బ్యాంకు లైన్లలో నిలబడలేక, డబ్బులు లేక మృత్యువాత పడ్డారు. పప్పులు, నూనె, కూరగాయలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్లు, మందులు, రైలు ఛార్జీలు మొదలైన సామాన్యులు ఉపయోగించే వస్తువులపై విస్తృతంగా ద్రవ్యోల్బణ ప్రభావం ఉంది. ఒకవైపు దేశాన్ని రూ.5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చి, మరోవైపు 9 ఏళ్లలో గ్రామీణ కూలీల కూలీ రేట్లు పెంచలేదు. అసమానత ఎంతగా పెరిగిందంటే, నిజానికి దేశంలో 5%గా వున్న సంపన్నుల దగ్గర దేశ ఆదాయంలో 60% ఉంటే, 50%గా వున్న నిరుపేదల దగ్గర కేవలం 3% మాత్రమే ఉంది.

మన్‌రేగా, సామాజిక భద్రతా పెన్షన్, మధ్యాహ్న భోజనం, అంగన్‌వాడీ సేవ, ప్రసూతి భత్యం సహా అనేక సంక్షేమ పథకాల బడ్జెట్‌లో భారీ కోత పెట్టారు. 9 ఏళ్ల నుంచి వృద్ధులకు కేంద్ర ప్రభుత్వం రూ.200 మాత్రమే నెలనెలా పింఛను ఇస్తోంది. 2014 నుంచి ఇప్పటి వరకు మధ్యాహ్న భోజనం, అంగన్‌వాడీ సేవలకు దాదాపు 40% బడ్జెట్‌ తగ్గించారు. జార్ఖండ్‌లో ఐదేళ్లలోపు పిల్లల్లో 40% మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. గత 9 ఏళ్లలో చిన్నారులు, మహిళల పౌష్టికాహారాన్ని మెరుగుపరిచేందుకు మోదీ ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఏ మాత్రం లెక్కలోకి రావు. 2013లో ఆమోదించబడిన జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తూ మోడీ ప్రభుత్వం 2011 జనాభా లెక్కల ఆధారంగా ఇప్పటికీ రేషన్ కోటాను కేటాయిస్తుండడంతో, జార్ఖండ్‌లోని 25 లక్షల మందికి పైగా ప్రజలకు ఇప్పటికీ ప్రజా పంపిణీ వ్యవస్థ అందుబాటులో లేదు.

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని మోదీ ప్రభుత్వం ఏళ్ల తరబడి నినాదాలు ఇస్తోంది. ఆదాయాన్ని పెంచడం మాట అటుంచి, వ్యవసాయం చేయడమే కష్టమైపోతోంది. మోడీ ప్రభుత్వం ఎరువులపై సబ్సిడీని (యూరియా, డిఎపి మొదలైనవి) నిరంతరం తగ్గించడం వల్ల వాటి ధరలు పెరిగిపోయాయి. ఇప్పటి వరకు చాలా పంటలకు కనీస మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించలేదు. అదే సమయంలో రైతు వ్యతిరేక చట్టాలను ఆమోదించడంతో కార్పొరేట్ సంస్థలు, కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకు పూర్తి స్థాయిలో సన్నాహాలు జరిగాయి. మోదీ విధానం వల్ల జార్ఖండ్‌లో రైతుల భూములను కాంట్రాక్ట్‌పై కంపెనీలకు ఇవ్వడం మరింత సులభతరం కానుంది.

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి, జార్ఖండ్‌తో సహా మొత్తం దేశంలో చాలా మంది ఆదివాసీలు, దళితులు, ముస్లింలను మతం, గోమాతల పేరుతో మతోన్మాద మూకలు  చంపాయి. సి‌ఎఎ(CAA)  –ఎన్‌ఆర్‌సి (NRC) ని అమలు చేయడం ద్వారా, రాజ్యాంగానికి విరుద్ధంగా మత ఆధారిత పౌరసత్వం అనే భావనను రూపొందించి, దేశంలోని ముస్లింలను రెండవ తరగతి పౌరులుగా చేయడానికి సన్నాహాలు చేశారు. దేశాన్ని హిందూ దేశంగా మార్చాలని బీజేపీ నేతలు నిత్యం మాట్లాడుతున్నారు. మోడీ ప్రభుత్వం దేవాలయాలను నిర్మించడం, ప్రభుత్వ వ్యవస్థలో మతాన్ని ప్రవేశపెట్టడంపై ఎక్కువ దృష్టి పెడుతోంది. జార్ఖండ్‌లో, క్రైస్తవ-సర్నా ఆదివాసీలు ఆదివాసీ-కుడ్‌మీ సమస్యలపై జార్ఖండ్ సమాజాన్ని బిజెపి నిరంతరం విభజిస్తోంది. మోడీ ప్రభుత్వం మణిపూర్‌లో ఆదివాసీలపై రాజ్య మద్దతుతో మారణహోమానికి అనుమతించింది. మణిపూర్‌ను ఉదాహరణగా చూపడం ద్వారా జార్ఖండ్‌లోని బిజెపి నాయకులు సాముదాయిక, మతపరమైన ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు.

ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు/ఉపాధి కల్పిస్తామన్న ప్రధాని వాగ్దానం కేవలం ప్రకటన మాత్రమేనని తేలిపోయింది. అగ్నివీర్ యోజనను అమలు చేయడం ద్వారా, భారత సైన్యంలో దీర్ఘకాలిక సేవను రద్దు చేసి  4 సంవత్సరాల కాంట్రాక్ట్ ఆధారిత వ్యవస్థను అమలులోకి తెచ్చారు. జార్ఖండ్ యువతకు ఇది పెద్ద ద్రోహం, వీరికి సైన్యం ప్రధాన ఉపాధి వనరుగా ఉంది. ఆదివాసీలు, దళితులు, వెనుకబడిన తరగతులకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్‌ హక్కును నిరంతరంగా నీరు కారుస్తున్నారు. జనాభా వాటా ప్రకారం రిజర్వేషన్లు పెంచకుండా, ఆర్థిక ప్రాతిపదికన అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు అమలు చేసి బహుజన రిజర్వేషన్ల పద్ధతిని బలహీనపరిచారు. రైల్వేతో సహా ప్రతి ప్రభుత్వ విషయంలోనూ రిజర్వేషన్ ఆధారిత పర్మినెంట్ ఉద్యోగాలను రద్దు చేసి కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు.

కొత్త విద్యా విధానాన్ని అమలు, తద్వారా జరుగుతున్న ప్రైవేటీకరణ, మార్కెటీకరణ వల్ల విద్యా వ్యవస్థ నిరంతరం ఖరీదైనదిగా మారుతోంది. అల్పాదాయ ఆదివాసీలు, దళితులు, వెనుకబడిన తరగతుల వారికి పాఠశాల, కళాశాల విద్య అసాధ్యంగా మారుతోంది. ఈ విద్యా విధానంలో తిరిగి కుల ఆధారిత పనిని ప్రోత్సహిస్తున్నారు. విశ్వకర్మ ప్రణాళిక వంటి పథకాలు అమలు చేస్తున్నారు. ఇది పిల్లలను కూలీలుగా మార్చే విధానం. అదే సమయంలో ఆదివాసీలు, దళితులు, వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించాలనే రాజ్యాంగ హక్కు విద్యారంగంలో నిరంతరం బలహీనమైపోతోంది.

బిజెపి ప్రభుత్వం ఎన్నికల బాండ్ పథకం ఒక గుడ్డి, అంతులేని రాజకీయ అవినీతి గుహ. పార్టీలకు ఏ సంస్థ నుంచి లేదా ఏ వ్యక్తి నుంచి విరాళాలు వస్తున్నాయో తెలుసుకునే హక్కు ఓటర్లకు లేదని ప్రభుత్వ న్యాయవాదులు ఈ పథకానికి అనుకూలంగా వాదిస్తున్నారు. బాండ్ స్కీమ్ కింద ఇప్పటివరకు వచ్చిన రూ.13,500 కోట్ల విరాళాల్లో ఎక్కువ భాగం బీజేపీకి అందాయి. లోకాయుక్త వ్యవస్థను నీరుకార్చేశారు. దేశం మొత్తం లాగానే జార్ఖండ్‌లో కూడా  సంపదను అదానీకి కారుచౌకగా ఇస్తున్నారు. రాష్ట్రంలోని లక్షలాది మంది డిపాజిట్లు కలిగిన రూ.40,000 కోట్లు ఉన్న ఎల్‌ఐసీని అదానీ గ్రూపుకు ఇచ్చారు. అలాగే, మోదీ ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని సవరించడం ద్వారా ప్రభుత్వం నుండి జవాబుదారీతనం, పారదర్శకతల డిమాండ్‌ను అరికట్టింది.

2017-18లో ఇదే జిల్లాలో పథల్‌గడి ఉద్యమం చేస్తున్న వేలాది మంది అదివాసీలను ద్రోహులుగా ప్రకటించి, జైల్లో పెట్టి ఆ ఉద్యమాన్ని అణచివేసింది బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం అని గుర్తుపెట్టుకోవాలి. 2019లో ఖుంటి లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ విజయం సందేహాస్పదంగా ఉంది,   అనేక అంశాలతో కూడుకొని వుండి. UAPA చట్టాన్ని సవరించడం ద్వారా, మోడీ ప్రభుత్వం జార్ఖండ్‌తో సహా దేశవ్యాప్తంగా అనేక మంది సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు, న్యాయవాదులు, మేధావులను బూటకపు కేసులలో ఇరికించి, విచారణ లేకుండా సంవత్సరాల తరబడి జైల్లో ఉంచింది. సామాజిక కార్యకర్త ఫాదర్ స్టాన్ స్వామి కనీస సౌకర్యాలు, చికిత్స లేకపోవడంతో జైలులో మరణించారు.

అలాగే, జార్ఖండ్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి నిరంతరం ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీజేపీయేతర ప్రభుత్వాలను వేధించడానికి, భయపెట్టడానికి, పడగొట్టడానికి మోదీ ప్రభుత్వం గవర్నర్, ఈడీ, సీబీఐ, ఐటీ, ఎన్ఐఏలను అస్త్రాలుగా మార్చుకుంది. ప్రతి అవినీతిపరుడు, నేరస్థుడు బీజేపీలో చేరిన వెంటనే నిర్దోషి అవుతాడు. జార్ఖండ్‌లో కూడా, ప్రతిరోజూ బిజెపి నాయకులు హేమంత్ ప్రభుత్వాన్ని పడగొట్టినట్లు సిగ్గు లేకుండా ప్రకటిస్తున్నారు. 2014 నుండి ED, CBI చర్యలు తీసుకున్న ప్రధాన రాజకీయ నాయకులలో 95% మంది ప్రతిపక్ష (బిజెపియేతర) పార్టీలకు చెందినవారు. సేవ్ డెమోక్రసీ 2024 క్యాంపెయిన్‌లో మోడీకి కొంచెమైనా సిగ్గు అనేది  మిగిలి ఉంటే ప్రజల ముందుకు రాకూడదు.

Leave a Reply