నేను గౌరీలంకేశ్నని చందుతులసి ప్రకటించిందో లేదో
నాకు తెలియదుకానీ చందుతులసి బతికుండాలి

చెడ్డీస్ చీడపురుగులు పంట్లాములలోకి పాకి
ట్రోల్ల పుళ్లుపడిన నోళ్లు కాషాయ విషాలు చిమ్ముతూ
చేతులు కర్రలే కాదు కత్తులూ త్రిశూలాలైన వేళ
గౌరీలంకేశ్ స్వప్నసాకారం కోసం
చందుతులసి బతికుండాలి

ఆయుబ్రాణా వలె శత్రువు బొడ్లో వేలుపెట్టి
సత్యం పలికించే సాహసాలకు
దుర్గం ఇపుడు దుర్భేద్యమైంది కావచ్చు
పరివార్ భావజాల పునాదులను పెకిలించే
పరిశోధన కోసం ఇపుడామె బతికుండాలి

అమెరికా ఇండియా పాలకుల డిఎన్ఎలో
ప్రజాస్వామ్యం కాదు ఫాసిజం ప్రవహిస్తుందని
ఫోరెన్సిక్ రిపోర్టు ఇవ్వడానికామె బతికుండాలి

ఆ ఆవేదన, ఆరాటం, ఆక్రోశంగా ప్రకటించే
ఆ అమాయక రుజువర్తనం కోసం ఆమె బతికుండాలి
అంత బెరుకుగా నిజాయితీగా
మనకు ఆగ్రహం తెప్పించే స్వరశైలి కోసం ఆమె బతికుండాలి
రాజదండానికెదురుగా భావప్రకటనా స్వేచ్ఛాపిచ్చుకుల నెగరేస్తూ
అధికారం ముందు సత్యం మాట్లాడే
పసిపిల్ల మనసు కనుక ఆమె బతికుండాలి
ఆమె తన పిల్లల్ని, తల్లిని ప్రేమించినంతగా
ప్రజలను ప్రేమిస్తున్నది గనుక ఆమె బతికుండాలి

(గౌరీలంకేశ్ ‘స్వయంసేవకులను’ చడ్డీస్ అని పిలిచేది)

2 thoughts on “ఆమె బతికుండాలి

  1. No comparison between gowri lankesh and Chandu Tulsai—-tulasi episode is too much publicity -too much hype —-and buzz —
    Matham —matham— too much importance — writings
    Men cannot live with out god and religion

Leave a Reply