చుట్టూ గోడలపై వున్న
అక్షరాలన్నీ ఏకమై
మరో కొత్త యుద్ధాన్ని
ప్రకటించినట్లు
మూలకున్న ముసలవ్వలా
ఆ పాత గొంగడి ఎర్రగుడ్డ
నా భుజాన్ని తట్టి
ముందుకు నడిపినట్లు
నాలోని కటిక చీకటికి
ఎడిసన్ బల్బులు
ప్రపంచాన్ని వెలిగించమని
సైగ చేసినట్లు
కాలువలై పారుతున్న
నా కన్నీళ్ళను తుడవడానికి
ఆ పాత పుస్తకాలే కదా!
మరో కొత్త మార్గాన్ని
చూపించే సన్నిహితులు.
మరి ఇంకెందుకు ఆలస్యం?
దేశమంతా మతపిచ్చితో
మారణహోమంలో
మునిగిపోతుంటే
మరెంత కాలం....
ఆ నాలుగు గోడల మధ్య
స్వప్నపు కాంతులంటూ
కలలు కంటావ్?
లే.......!
ఆ చీకటి ప్రపంచంలో నుండి
బయటికి రా....
ఇక్కడ ఎవరూ
ఏ యుద్ధాన్ని ప్రకటించరు!
ఎక్కడైతే అన్యాయం
జరుగుతుందో
ఎక్కడైతే అణిచివేతకు
గురవుతున్నారో
అక్కడి నుంచే
నిజానికి...
అక్కడి నుంచే
నీకు నువ్వు ఓ యుద్ధాన్ని
ప్రకటించుకొని ముందుకు
కదులు.....
మిత్రమా..!
నువ్వు చేసే ప్రతి యుద్ధం వెనుక
ఓ స్వేచ్ఛ కాంతులను వెదజల్లుతూ
రగిలే అగ్ని జ్వాలలా
స్ఫూర్తిని రగిలిస్తూ
ముందుకు సాగిపో...
కాలిపోతున్న పేజీలను చూసినప్పుడు
నాలో ఇంకిపోయిన కన్నీళ్లు
మరోమారు ప్రాణం పోసుకుని
నా చెంపలను తాకుతూ
మళ్లీ మట్టిలో కలిసిపోతున్నాయి.
కాలిపోతున్న ఆ కవితలను చూస్తూ
బరువెక్కిన హృదయంతో
మాటలు రాని మౌనంలో
నేరం చేసిన అపరాధిలా
నిలబడిపోయాను.
ఎగసిపడే నిప్పుల హోరును
చూసినప్పుడు, అవి ఆకలికి
న్యాయం జరిపే సాక్ష్యాలుగా
గాలిలో శూన్య సంతకాల సెగ
ఆ నిప్పుల కుంపటి నుండి
కవిత్వాన్ని నా అక్కున చేర్చుకున్న
నా చేతులు నేడు మరో కవిత్వానికి
పునాదులు వేస్తున్నాయి.
అయినా
కాలిపోయిన కాగితాలకు
జారిపోయిన కన్నీళ్ళకు
కంటతడి పెట్టిన కవికో
మరణం ఉంటుంది..కానీ
కవిత్వానికి మరణం ఎక్కడిది?
అవును!!!
నేను..
ఎన్నిసార్లు పిలిచినా
విసుగురాని పదం అమ్మ!
ఎందుకంటే..
మా అమ్మ అందరి అమ్మలా
టీవీ ముందు కూర్చుని
వంట ప్రోగ్రామో
కామెడీ ప్రోగ్రామో చూసే అమ్మ కాదు..మా అమ్మ!
నైస్ గా ఇంగ్లీషులో మాట్లాడే అమ్మ కాదు..మా అమ్మ !
రోజుకో టిఫిన్ చేసి పెట్టే అమ్మ కాదు.. మా అమ్మ!
మరి
మా అమ్మ ఎలాంటి అమ్మ ?
ఈ భూమి మీద
అరొక్క పంటకి పురుడు పోసే అమ్మ.. మా అమ్మ!
ఎర్రని సూర్యున్ని తన వీపు మీద మోస్తూ
పంటకి కలుపు తీసే అమ్మ... మా అమ్మ !
ఆకాశమంత దుఃఖం
అవనికి ఉన్నంత ఓర్పు
మా అమ్మ సొంతం
తన చెమట చుక్కల్ని
తన కన్నీటి గుక్కల్ని
తాగిన ఈ భూమి
మా అమ్మకి ఎప్పుడు రుణపడి ఉంటుంది
అందుకేనేమో..
నేను మా అమ్మ గురించి
రాద్దాం అనుకున్న ప్రతిసారీ
అలా తెల్లకాగితం వైపు చూసినప్పుడు
అక్షరాలు రాని మూగవాన్ని అయిపోతాను
ఎందుకంటే
అమ్మ అనుభవం రాయాలంటే
అక్షరాల కంటే ముందు
నాకు
దుఃఖం, కన్నీళ్లే వస్తాయి
అయినా..
అమ్మకి సరితూగే పదాలను
నేను ఎక్కడి నుంచి తేగలను
ఒకవేళ తెచ్చినా,
రాయడానికి ఒక జీవితం సరిపోతుందా!!
ముగింపు మరిచిపోయిన
కవిత ఏదైనా ఉంది అంటే
అది ఒక అమ్మ కవిత మాత్రమే
చుక్కానికి కూడా దొరకని
సిరా చుక్కలతో నేను రాసిన కవిత
మా అమ్మ కవిత.
1యుద్ధంలో మరణాలెప్పుడూ దొంగలెక్క ఆయుధాలు గింజల్ని పండించలేవు మరణాల్ని భిక్ష వేస్తాయి పిల్లలు లేక బొమ్మలు దిగాలు పడ్డాయి వాటికి తెలియదు యుధ్ధం చంపిందని రాజ్యహింసలో ప్రజల దుఃఖం మైళ్ళు మైళ్ళు మేఘావృతం యుధ్ధం
బంగారు డేగ వర్ణంలోనే బంగారంవనరులున్నా ఉన్మాదం కోరల్లో విలవిలతన భూభాగం కోసమే తాను శ్రమిస్తూ ఆశ్రయం కోసం ఎంతో దూరం వెళ్తుంటేఊసురోమని నీరసిస్తుంటేకాసింత ఊరట కోసం జానెడు చోటు కోసంవెంపర్లాడుతుంటే ఉసూరమనిపిస్తుంది జామ్ మీనార్
ఉదయ్ బాగా రాస్తున్నారు. మరింత సానపడుతూ సాధన చేస్తూ రాయాలని కోరుకుంటూ అభినందనలు.