అదొక నిర్జన మైదానం

అప్పుడే గతమైన బాల్యం

కన్నీటి కడలి మాటున

చిట్టిపొట్ట కోసం

నెత్తికెత్తుకున్న పెద్దరికం

నీవు పుట్టిన ఈ నేలలో

విగ్రహాల నిర్మాణం అతి ముఖ్యం

కూల్చివేతా వాళ్లిష్టం

అయినా ఎందరికో ఊపిరి చిహ్నం

శ్వేదాశ్రువులతో వెలిసిన

నిండైన అంబేద్కర్‌ విగ్రహం

ఆ నీడలోకి కాసేపయినారా

మన బతుకు గాయానికి ఆయనే ఒక లేపనం.

Leave a Reply