కాలంతో పాటు కవితా రచన ప్రయాణం చేస్తున్నదా, లేదా కవిత్వం మానవ వ్యక్తీకరణను నమోదు చేయడంలో తడబడుతున్నదా. నిజానికి కవులు అక్షరాస్యులేనా? వర్తమానంలో నిలబడి కవిత్వం రాస్తున్నవారు పునాది అంశాలను తడుముతున్నారా? ఇవన్నీ కవితా రచనను లోతుగా గమనిస్తున్న వారికి ఎదురయ్యే సందేహాలు. కాలంతో పాటు మానవ జీవితంలో అనేక సంక్లిష్టతలు వచ్చి చేరాయి.పాలక వర్గం ప్రచారం చేస్తున్నట్లు నూత్న అభివృద్ధి నమూనాలో మానవుడి పరిమితులు విశాలత్వం మధ్య సంఘర్షణ వున్నది. అందివచ్చిన అవకాశాలు జీవితంలో వుండే సుఖలాలస కవితా సృజనలో వ్యక్తమవుతుంది. సృజనాత్మక తలంపై కవి జీవితంలోని ఘర్షణను అనువదించుకోకపోతే కళాత్మక వ్యక్తీకరణకు పరిమితి ఏర్పడుతుంది.రచనకు , రచయితకు మధ్య ఖాళీ ప్రవేశిస్తుంది. ఇటీవల వస్తున్న కవిత్వ వ్యక్తీకరణలో నూతన దృష్టి వుంది. అదే సమయంలో అభివ్యక్తిలో మూసధోరణి ప్రచలితమవుతుంది. కొత్తగా కవితావరణలోకి వస్తున్న వారు పాతకాలపు కవిత్వ పరికరాలతోనే కవితా రచనలోకి ప్రవేశిస్తున్నారు.

తెలుగు కవిత్వం స్పష్టమైన భావజాల పునాదిపై నిలబడి వుంది.అనేక అంశాలు తెలుగు కవిత్వాన్ని విశాలం చేసాయి. విస్తృతి, వైవిధ్యం పరిణితి కవి నిజాయితీ విస్మరించ లేనిది. అయితే కవి సృజనను తూచే తూనిక రాళ్ళు ఎక్కడ వున్నా యి.అనేది ప్రశ్న. కవితా రచనకు సంబంధించిన పరిభాష కవి అస్తిత్వం నుండి రూపొందు తుంది. పరిశీలన, అధ్యయనం బలమైన వ్యక్తికరణ కలిగిన కవిగా రూపొందడానికి పునాది ఏర్పడుతుంది.నిజానికి కవులుగా రూపొందే క్రమం నిర్దిష్టంగా మాట్లాడుకుంటే స్వీ య అభ్యాసం, నేర్చుకోవాలనే తపన నుండి ప్రారంభ మవుతుంది. అనుభూతి ప్రధాన అంశమవుతుంది. అయితే అనుభూతి మాత్రమే సరిపోదు. అనుభూతి కేంద్ర మైన కవితా రీతులు కాలం గీసిన గీత పై నిలబడవు. భౌతిక పునాది ముఖ్యమైన అంశంగా వున్నప్పుడు అనుభూతి ప్రధానమైన విషయం వెనుక బడుతుంది.అను భూతి , రాజకీయ సామాజిక ఆర్థిక సాంస్కృతిక విషయాలు కవిని ప్రభావితం చేసే అంశాలుగా
ముందుకు వస్తాయి. కవితా రచన వైయుక్తక అనుభవాన్ని దాటి సామాజిక అనుభవంలోకి దారి చేసుకుంది.ఈ పరిణామానికి కాలం, మానవుడు కేంద్ర బిందువు అయినాయి. జీవితం సమున్నతము ,ఆనందమయం అనే గీటురాయిగా వచ్చిన కవిత్వం లేదా అసమానతల , సంఘర్షణ తో నిండినది . దీనిని సరి చేయాలని వచ్చిన కవిత్వం దశ వేరు. ఇవాళ వస్తున్న కవితా రీతులు ఏమిటి? కవిత్వం కు పునాది అంశం ఏమిటి కవి హృదయానికి చేరుతున్న సామాజిక చలనం ఏమిటి వర్తమానంపై నిలబడి ఏ అంశాలకు కవి ప్రభావితం అవుతున్నాడు . కవి దారి ఎటు.కవికి చేరుతున్న పరికరాలు ఏమిటి ఇవాళ కవిత్వానిక చోదక శక్తి అసమానతల సమాజమే.సకల ఉద్యమాలు సంఘటితం అవుతున్న క్రమంలో ఉద్యమ ప్రతి పలనాన్ని ఎత్తి పడుతున్న దశ. తాజాగా జనాభా లెక్కల పట్టిక తదనంతర రైతు మూడు వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ జరుగు తున్న పోరాటం వర్తమానంలో కవిని ప్రభావితం చేస్తున్న అంశాలు.

ఇంకొక వైపు సంఘటన కవిత్వం అంటే ప్రపంచంలో జరిగే ప్రతి అలజడికి స్పందించండం దానికొక తాజా ఉదాహరణ కరోనా .మానవ ప్రపంచాన్ని ఒంటరి గుహరం లోకి నెట్టి వేయబడిన స్థితిలో కవి స్పందన చాలా విలువైన ది. ఇంతవరకు బాగానే ఉంది. శిల్ప పరమైన వ్యక్తీకరణ ఎలా వున్నది. శిల్ప చర్చ కాదు గాని వస్తువును కళాత్మకంగా చెప్పడంలో కవి చూపే శ్రద్ధ గమనించ వలసిందే.సామాజిక వ్యక్తీకరణకు కళాత్మక రూపం ఎలాంటి గుణాత్మక పరిణామం చెందుతుంది అనేది ముఖ్యం.ఇవాళ వెలువడుతున్న కవిత్వం వస్తు, శిల్ప చర్చ ను ఏవిధంగా అంచనా వేయాలి.కవి దగ్గర వున్న పరిభాష, లేదా కవి పరిశీలన అధ్యయనం ద్వారా కవితా రచనకు సంబంధించిన మెళుకువలు ఇవి మాత్రమే సరి పోతుందా.కవి అస్తిత్వం కూడా ప్రధాన భూమిక వహిస్తుందా అనేది ప్రధాన అంశం.

కవిత్వం భావవ్యక్తీకరణ మాత్రమేనా ? దాని ప్రయోజనం సామాజిక చలనంలో ఇమిడి వుందా అనేది చారిత్రక పరిణామంలో రుజువైన అంశం. కవిత్వం సకల ఉద్యమాలను ఎత్తి పట్టింది.ఈ నేపధ్యంలో సకల వాదాలకు వెలుగు నిచ్చింది. అయితే కవిత్వం నిర్వహించే భూమిక మానవ ఆకాంక్షలను ఎలా రికార్డు చేసింది? మొత్తంగా కవితా రచన ప్రజలు మౌలిక భావనలను మార్చడానికి లేదా వారిలో పోరాట పటిమను నింపడానికి తెలుగు కవిత్వం స్పష్టమైన భావజాల ప్రభావం వేయగలిగిందా ? బహుశా ఆ కర్తవ్యాన్ని ఎంతో కొంతమేర నిర్వహించ గలిగింది.

కవులు అక్షరాస్యులేనా అనే విమర్శ కొంతకాలం గా వినబడుతుంది. కవితా రచన వ్యక్తీకరణలో నిజాయితీ , కొత్తగా రాసే కవులు నేర్చుకోవాలి అనే తపన ఇటీవల కాలంలో వ్యక్తమవుతుంది. ఆశావహ దృక్పథంతో విభిన్నమైన వస్తువును , రాజకీయ సామాజిక ఆర్థిక సాంస్కృతిక విధానాల ను లోతుగా నమోదు చేస్తున్నారు.ఇది మాత్రమే చాలదు. కవి విశాలం కావాలి.ఇవాళ దేశం ఒక పెద్ద దేశ ద్రోహుల జాబితా తయారు చేసుకుంది. బ్రాహ్మణీయ హిందుత్వ భావజాలం దాని పునాది మరింతగా బలిష్టం చేయాలని ప్రయత్నం చేస్తున్నది. వర్తమాన కాలం మరింత సంక్లిష్టంగా, సంక్షుభితంగా మారుతున్న సందర్భం లో కవి దగ్గర వున్న పరికరాలేమిటి. ఇది ఇవాల్టి ప్రశ్న.సామాజిక తలంలో వర్గ దృక్పథం కాన్వాస్ పై దీనికి పరిష్కారం వెతకాలి.అహగాహన క్షేత్ర స్థాయి దృష్టి అధ్యయనం మరింతా కవితా సృజన లో వ్యక్తం కావాలి

కవిత్వం ధాన్యపు కంకులవలె, నక్షత్రాలవలె అందమైనది. శాశ్వతమైనది. జీవితం కోసం, ప్రజల సేవ కోసం అది సృష్టించ బడుతుంది.మానవుడు తాను బాగున్నానంటాడు. కవిత్వం నేను నీతో వున్నానంటుంది.మానవుడు నేను బాధ పడుతున్నానని మూలుగుతాడు కవిత్వం నేను నీతో వున్నా నని చెపుతుంది. కవిత్వం గురించి పాశ్చాత్య విమర్శకుడి భాషణ. ఎల్ల కాలాల్లో కవితా రచన ఈ పని చేసింది. నూతన మానవుణ్ణి ఆవిష్కరించ గలిగింది.

Leave a Reply