భారతదేశంలో అధికార బదిలీకి ముందు, తర్వాత ప్రైవేట్‌ బ్యాంకుల చరిత్ర అంతా అక్రమాలతో, మోసాలతో ముడిపడి ఉంది. వలసపాలన కాలంలో దేశంలో ఏర్పడిన ప్రైవేట్‌ బ్యాంకులు ప్రజల వద్ద నుండి వసూలు చేసిన డిపాజిట్లను తమ స్వప్రయోజనాలకు వినియోగించుకున్నాయి. ఆనాటికి ఉన్న 600 బ్యాంకులు పెద్ద పరిశ్రమలకు, వాణిజ్య వర్గాలకు పరిశ్రమల నిర్మాణం, వర్కింగ్‌ కాపిటల్‌, ఇతర అవసరాలకు రుణాలు ఇస్తుండేవి. చిన్న వృత్తులు, వ్యాపారాలు, చిన్న పరిశ్రమలు తదితరాలకు రుణాలు అందేవి కాదు. తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించకపోవటం, వసూలుపై బ్యాంకులు తగినంత శద్ధ పెట్టకపోవటం, రుణాలు తీసుకున్న సంస్థలు చేసే మోసాలలో బ్యాంకులు కూడా భాగస్వాములు కావటం తదితర కారణాల వలన డిపాజిట్‌ దారులకు సకాలంలో చెల్లింపులు చేయకపోవటంతో బ్యాంకులపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లింది. అనేక బ్యాంకులు ప్రజల ధనాన్ని దిగమింగి, దివాళాలు ప్రకటించేవి. ఫలితంగా బ్యాంకులలో డిపాజిట్లు చేసినవారు తీవ్రంగా నష్టపోయారు. ప్రైవేటు బ్యాంకులు తమ ఆశ్రితులకే రుణాలివ్వం, ప్రజల డబ్బును తమ స్వలాభాలకు వినియోగించుకోవటం జరిగింది.

వలస పాలన కాలంలో ప్రపథమంగా వాణిజ్య బ్యాంకింగ్‌ వ్యవస్థ 1809లో “బ్యాంక్‌ ఆఫ్‌ బెంగాల్‌తో ప్రారంభమైంది. ఆ తర్వాత 1840లో “బ్యాంక్‌ ఆఫ్‌ బాంబే, 1848లో “బ్యాంక్‌ ఆఫ్‌ మద్రాస్‌” ప్రారంభమయ్యాయి. తదనంతరం ఈ మూడు బ్యాంకులు విలీనమై 1921 జనవరి 27న “ఇంపీరియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా”గా ఏర్పడింది. బ్యాంకింగ్‌ వ్యవస్థ నియంత్రణకు, కేంద్ర ప్రభుత్వ కరెన్సీ కొరకు 1935లో కలకత్తాలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను ఏర్పాటు చేశారు. 1949 జనవరి 1న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను జాతీయం చేశారు. ఆర్‌బిఐకి బ్యాంకుల పర్యవేక్షణ అధికారాన్ని అప్పగించారు. అలాగే ఇంపీరియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను 1955 జూలై 1న జాతీయం చేసి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాగా పేరు మార్చారు. ఎస్‌బిఐని ఏర్పాటు చేసినప్పటికీ చిన్న పరిశ్రమలు, వ్యాపారాలకు రుణాలు దొరకటం కష్టంగానే ఉండేది. 1935-47 మధ్య 900 బ్యాంకు కుంభకోణాలు జరగగా, స్వపాలనలో 1947-69 మధ్య 665 కుంభకోణాలు జరిగాయి.

ఆర్‌బిఐ 1959లో జరిపిన పరిశీలనలో 566 బ్యాంకులలో 474 బ్యాంకులు ఆర్‌బిఐ నిబంధనలకు అనుగుణంగా కార్యకలాపాలు నిర్వహించటం లేదని స్పష్టమైంది. ప్రభుత్వ చర్యలు ప్రైవేట్‌ బ్యాంకుల కుంభకోణాలను నిరోధించలేక పోయాయి. ప్రైవేటు బ్యాంకులు విఫలమౌతూ డిపాజిట్‌దారులు నష్టపోతున్న పరిస్థితులలో డిపాజిట్‌దారుల డబ్బుకు రక్షణ కల్పించటం కోసం 1962లో డిపాజిట్‌ ఇన్స్యూరెన్స్‌ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధమైన భద్రతా సంస్థను ప్రభుత్వం రూపొందించినా ఆర్థికాభివృద్ధి ప్రాధాన్యతా క్రమంలో 19 జూలై, 1969లో 50 కోట్ల రూపాయలకు మించి డిపాజిట్లు ఉన్న 14 ప్రధాన ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేసి, ప్రభుత్వ యాజమాన్యంలోకి తీసుకొచ్చారు. 200 కోట్ల రూపాయల డిపాజిట్లు దాటిన మరో 6 బ్యాంకులను 1980లో జాతీయం చేశారు.

బ్యాంకుల జాతీయీకరణ ఫలితంగా మద్యతరగతి వర్గాలు ప్రభుత్వం బ్యాంకుల వద్ద తన సొమ్ము భద్రంగా ఉంటుందనే ఆశతో తాము కష్టించి సంపాదించిన డబ్బునంతా జాతీయ బ్యాంకులలో నిల్వచేస్తే భారత బడా బూర్జువా వర్షం ఈ పొదుపు మొత్తాలన్నింటిపై అదుపు సాధించగలిగింది. ఈ పొదుపు మొత్తాలన్నీ పారిశ్రామిక, వాణిజ్య రంగాలలోనే కాక జూదతరహా వ్యాపారాలలో బడా బూర్జువా వర్గం పెట్టుబడిగా వినియోగిస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు తాము కేటాయించుకునే మొత్తం రుణాలలో 18 శాతాన్ని ప్రాధాన్యతా రంగాలకు ఇవ్వాలనే ప్రభుత్వాదేశాలు 1980లలో వచ్చేంతవరకు, ప్రభుత్వరంగ బ్యాంకులు వ్యవసాయ రంగం వైపే చూడలేదు. జాతీయీకరణ తర్వాత ఒకవైపు బ్యాంకింగ్‌ రంగం అసాధారణంగా విస్తరించటం, మరోవైపు చట్టబద్ధంగాను, అక్రమంగా బ్యాంకులో నిల్వలను బడా పెట్టుబడిదారులు కైంకర్యం చేయటం కూడా అసాధారణంగా పెరిగిపోయింది.

ప్రభుత్వ రంగ బ్యాంకుల డైరెక్టర్ల బోర్డులలో బడా బూర్జువా వర్గ ప్రతినిధులు ఉంటారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా యొక్క నిర్ణాయక బోర్జులోనూ వారు తగిన స్థానం కలిగి ఉంటారు. స్వతంత్ర డైరెక్టర్లుగా చెప్పబడేవారంతా బడా బూర్జువా వర్గపు ప్రతినిధులే. ప్రభుత్వరంగ బ్యాంకుల కార్యకలాపాల నిర్వహణను పర్యవేక్షించే ఉన్నతస్థాయి అధికారులకు కావలసిన లబ్ధి చేకూర్చి దళారీ బడా బూర్జువా వర్గం వారిని లోబరచుకొంటుంది. ఈ విధంగా ప్రజాధనం తరలిపోవటానికి ఒక మార్గం ఏర్పడింది. దళారీ బడా బూర్జువా వర్గం ఏదో ఒక కారణంతో తాము తీసుకున్న రుణాలను చెల్లించకపోతే వారందరికి ఇచ్చిన అప్పును నిరర్ధక ఆస్తులు(ఎన్‌పిఏ)గా పరిగణించి, తదనంతర కాలంలో ఆ అప్పును రద్దు చేయటమో లేదా బ్యాంకులకు పునఃపెట్టుబడి కల్పించే పేరుతో ప్రభుత్వమే వారికి బడ్జెట్‌ వనరులనుండే నిధులను సమకూర్చటమో చేస్తోంది. 1980ల మద్యకాలంలో, ప్రభుత్వరంగ బ్యాంకుల ఎన్‌పిఏలు పదిలక్షల కోట్ల రూ॥ల పైకి ఎగబాకాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులకు ‘పునః పెట్టుబడి” పేరిట బడ్జెట్‌ నిధులను ప్రభుత్వం సమకూర్చుతోంది మినహా అప్పు ఎగవేసిన వారిపై ఎలాంటి చర్య తీసుకోలేదు.

1990ల నుంచి ప్రారంభమైన సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానంలో భాగంగా ఆర్థిక సరళీకరణ విధానాల అమలు ప్రారంభం అయిన తర్వాత ప్రభుత్వం ద్రవ్య నిర్వహణా విధానంలో మార్పులు తీసుకొచ్చింది. ‘పైవేటు బ్యాంకులను ఏర్పాటు చేసుకోవటానికి, విదేశీ బ్యాంకుల ప్రవేశానికి అవకాశం కల్పించింది. దేశంలోకి విదేశీ పెట్టుబడుల ప్రవేశంపై ఉన్న ఆంక్షలను సడలించింది. ప్రభుత్వం అమలు చేయాల్సిన కార్యక్రమాలలో, ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పన రంగంలో పబ్లిక్‌ ప్రైవేటు పార్టనర్‌ షిప్‌(పిపిపి) విధానాన్ని ప్రారంభించి, జాతీయబ్యాంకుల నుండి పెట్టుబడిదారులకు పెద్దమొత్తంలో రుణాలిప్పించారు. సరళీకరణ విధానాలలో ప్రధానాంశమైన ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం కారణంగా పెట్టుబడిదారులు, బుర్జువా రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కు కావటంతో పెట్టుబడిదారులు బ్యాంకుల నుండి తమ తాహతకు మించి, యధేచ్చగా రుణాలు పొందారు. తిరిగి చెల్లించాల్సి వచ్చేసరికి రుణాలు తీసుకున్న వారిలో కొందరు తిరిగి చెల్లించలేకపోయారు. చెల్లించగలిగిన వారు కూడా అక్రమ పద్ధతిలో తమ లాభాలను పెంచుకోవటం కోసం రుణాలను ఎగవేశారు. ఆ విధంగా బ్యాంకులలో నిరర్ధక ఆస్తులు(ఎన్‌పిఎ) పెరగటం ప్రారంభమైంది. అందువల్లనేమో మనదేశంలో పరిశ్రమలు ఖాయిలా పడతాయి కానీ పారిశ్రామిక వేత్తలు దివాళా ఒక నానుడి ఉంది.


ఇవాళ దేశంలో బ్యాంకులను మొండి బాకీలకు సంబంధించిన సమస్యలు వేధిస్తున్నాయి. పారుబాకీల ముప్పుముందెన్నడు లేనంతగా నేడు బ్యాంకులను వెన్నాడుతోంది. రాని బాకీలు, లేదా పారు బాకీలు లేదా మొండిబాకీలు- వీటిని బ్యాంకింగ్‌ పరిభాషలో నిరర్ధక ఆస్తులు (నాన్‌ పెర్ఫార్మింగ్‌ అసెట్స్‌) అంటారు. ఈ రుణాల మీద రుణ గ్రహితలు తాను తీసుకున్న రుణం మీద వడ్డీని గానీ రుణ వాయిదాలను గానీ లేదా రెండింటిని గడువు తేది నుంచి 90 రోజుల్లోగా చెల్లించలేనట్లయితే ఆ రుణం నిరర్ధక ఆస్థి అవుతుంది. వీటిని స్టూల నిరర్ధక ఆస్తులు (జిఎన్‌పిఎ), నికర నిరర్ధక ఆస్తులు (ఎన్‌ఎన్‌పిఎ) అని రెండు గ్రూపులుగా లెక్కిస్తారు. బ్యాంకుల మొత్తం ఆస్తుల్లో వాటి మొత్తం ఎంత శాతం ఉన్నది జిఎన్‌పిఎలు వెల్లడిస్తాయి. వీటి ప్రమాదాన్ని డిపాజిటర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని బ్యాంకులు కొంత నిధిని ప్రత్యేకంగా కేటాయించి పక్కన పెడుతాయి. ఇలా కేటాయించిన ప్రత్యేక నిధి నుంచి జిఎన్‌పిఎను తీసివేస్తే మిగిలింది ఎన్‌ఎన్‌పిఎలుగా భావిస్తారు.


మోడీ 2014లో అధికారం చేపట్టిన నాటి నుండి బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తులు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి.బ్యాంకింగ్‌ రంగంలో సంక్షోభం స్వయం కృతాపరాదం. రుణ(గ్రహీతల వ్యాపారాలు నూతన పద్ధతిలో ఉంటున్నాయా. పూచీగా సరియైన ఆస్తులు (కోల్లేటరల్స్‌) ఉన్నాయా అనే వాటితో నిమిత్తం లేకుండా, సరైన వసూళ్ల పద్ధతి లేకుండా ఆభ్రితులకు పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వాలనే ఒత్తిడిని ప్రభుత్వ వర్షాల నుండి బ్యాంకులు ఎదుర్కొంటున్నాయి. 2014 నుంచి ఈ పారుబాకీలు పెరుగుతూ ఎంతటి స్థాయికి చేరుకున్నాయంటే ప్రభుత్వరంగ బ్యాంకుల ఉనికికే ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. పారుబాకీలలో 82 శాతం కార్చొరేట్‌ రుణాలకు చెందినవేననే వాస్తవం ఈ సంక్షోభానికి గల మౌళిక కారణాన్ని తెలియజేస్తుంది. రాజకీయ నాయకులు,ఉన్నతాధికారులు, బడా దళారీ పెట్టుబడిదారుల కుమ్మక్కుతో ఇదంతా జరుగుతుందన్నది యదార్థం.


గత దశాబ్ద కాలంగా దేశీయ బ్యాంకులను విదేశీ ద్రవ్య పెట్టుబడికి కట్టబెట్టేందుకు అనుగుణంగా వరుసగా అనేక పాలనా సంబంధమైన, చట్టపరమైన చర్యలను చేపడుతూ, రెడ్‌కార్చెట్‌ వేస్తూ వస్తున్నారు. దివాళా చట్టం, జాతీయ కంపెనీ చట్ట న్యాయస్థానం వంటి వానిలో చేబట్టిన చర్యలు దీనికి తార్మాణం. మరోవైపు ఈ చర్యలు ఎన్‌పిఏ భారాలకు కారణమైన భారత బడా దళారీ బూర్జువా వర్గానికి ఉపకరిస్తున్నాయి. ఫలితంగా ఇన్‌సాల్వేన్సీ అండ్‌ బ్యాంక్రప్టసీ కోడ్‌ (ఐబిసి) క్రిందకు 75 శాతం బ్యాంకులు బలవంతంగా వెళ్ళవలసి వస్తుంది. భారత బడాబూర్జువా స్వభావానికి పెరుగుతున్న ఎన్‌పిఏలు ఒక స్పష్టమైన నిదర్శనం. దాని దళారీ నిరంకుశాధికారస్వభావంతోటి, అది చట్టబద్ధంగాను, చట్టవిరుద్ధంగాను ప్రజాధనాన్ని నిరంతరం స్వాహా చేస్తోన్నది. భారత బడా దళారీ బుర్జువా వర్గం ప్రజాధనాన్ని పీల్చి పిప్పి చేయకుండా మనుగడ సాగించలేదు. మితిమీరిన మొండి బాకీల వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులు నేడు సంక్షోభంలో కూరుకుపోతున్నాయి.


నాలుగేండ్ల కాలవ్యవధి దాటిన ఎన్‌పిఎలను బ్యాంకులు రద్దు(రైటాప్‌) చేసి బ్యాంకుల బ్యాలెన్స్‌ షీట్‌ల నుంచి తీసి వేస్తాయి. యూపీఏ హయాంలో 2008-2009 నుంచి 2013-14 వరకు ఆరు ఆర్థిక సంవత్సరాలలో ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల నిరర్ధక ఆస్తులు(జిఎన్‌పిఎ) రూ॥5,04,021 కోట్లుగా నమోదు కాగా, రూ॥ 32,109 కోట్ల రూపాయలను యూపిఎ ప్రభుత్వం మొండి బకాయిల క్రింద రద్దు(రైటాప్‌) చేసింది. 2014లో బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆరేండ్లలో అనూహ్యంగా మొండి బకాయిలు(ఎన్‌పిఎలు) పెరిగిపోయాయి. 2014-15లో రూ॥ 1,77,860 కోట్ల నుంచి 2019-20 నాటికి మొత్తం రూ॥ 18,28,584 కోట్లకు ఎన్‌పిఎలు పెరగాయి. వాటిలో రూ॥ 6,83,388 కోట్లు ఇప్పటికే రద్దు చేశారు. ఇదంతా ప్రజాధనమే. యుపిఎ హయాంలో రద్దు చేసిన మొండిబాకీలతో పోల్చితే మోడీ పాలన కాలంలో రద్దు చేసిన మొండి బాకీలు 21 రెట్లు పెరగడంతో కార్పారేట్లపై మోడీకి ఎంతప్రేమ ఉందో తెలియజేస్తుంది.’

మోడీ పాలనలో ఎన్‌పిఎలు – రద్దుచేసిన ఎన్‌పిఎలు:

సంవత్సరం జిఎన్‌పిఎలు రద్దు చేసిన ఎన్‌పిఎలు:
2019-2020     238,464            178,305
2018-2019      210,531            183,168
2017-2018      4,88,175            129,503
2016-2017      3,27,593            81,99
2015-2016      3,85,961            59,444
2014-2015      177860              50,978
మొత్తం            18,28,584          6,83,388

జనవరి 11న ఆర్బీఐ విడుదల చేసిన ద్వైవార్సిక ఆర్థిక స్థిరత్వ నివేదిక వచ్చే సెప్టెంబర్‌ నాటికి బ్యాంకుల స్థూల నిరర్ధక ఆస్తులు (జిఎన్‌పిఎ) 13.5 శాతానికి చేరవచ్చని అంచనా వేసింది. ఇది 22 ఏళ్ల గరిష్ట స్థాయి. 1998-99లో జిఎన్‌పిఎలు 147 శాతానికి చేరాయి. మన దేశ స్థూల, ఆర్థిక వాతావరణం మరింత అధ్వాన్నంగా మారి, తీవ్ర వత్తిడికి లోనైయితే సెప్టెంబర్‌ నాటికి నిరర్ధక ఆస్తుల నిష్పత్తి 148 శాతానికి చేరవచ్చని ఆర్బీఐ తన ద్వైవార్షిక నివేదిక(ఎఫ్‌ఎస్‌ఆర్‌)లో ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల జిఎన్‌పిఎల నిష్పత్తి వచ్చే సెప్టెంబర్‌ నాటికి 16.2 శాతానికి పెరుగవచ్చు. అలాగే ప్రైవేట్‌ రంగ బ్యాంకుల జిఎన్‌పిఎల నిష్పత్తి 4.6 శాతానికి, విదేశీ బ్యాంకుల జిఎన్‌పిఎల నిష్పత్తి 7.9 శాతానికి ‘పెరుగవచ్చని నివేదిక పేర్కొంది. భవిష్యత్తులో బ్యాంకులకుమూలధన సమస్య రావచ్చని కూడ ఆర్‌బిఐ పేర్కొంది. కాబట్టి మరింత ద్రవ్య లభ్యతకు (లిక్విడిటీ) వీలు కల్పిస్తూ రెపో చర్యలకు ఆర్‌బిఐ పూనుకుంటుందని, త్వరలో రూ. 2 లక్షల కోట్ల రివర్స్‌ రెపో లావాదేవీల ద్వారా నిధులు విడుదల చేయనున్నట్లు ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తి కాంత దాస్‌ తెలిపారు.

రివర్స్‌ రెపో రేట్‌ అంటే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా దేశంలోని వాణిజ్య బ్యాంకుల నుండి తీసుకునే రుణాల వడ్డీ రేట్‌. ఆర్బీఐ బ్యాంకుల దగ్గర డబ్బును అప్పుగా తీసుకుంటుంది. దానికి అధిక వడ్డీ చెల్లిస్తుంది. ఆ వడ్డీనే రివర్స్‌ రెపో రేట్‌ అంటారు. ఇది (ద్రవ్య విధాన నియంత్రణ విధానం. (ద్రవ్య చలామణిని నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. తద్వారా మార్కెట్లో డబ్బు సరఫరా తగ్గుతుంది.

వ్యాపార అవసరాలు తీర్చడానికి వాణిజ్య బ్యాంకులకు ఆర్‌బిఐ డబ్బు ఇస్తుంది. అయితే వాణిజ్య బ్యాంకులు తమ సెక్యూరిటీలను రిజర్వ్‌ బ్యాంకుకు అమ్మడం ద్వారా డబ్బును అప్పుగా తీసుకుంటాయి. ద్రవ్య సరఫరాను మార్కెట్లో పెంచడానికి ఇది తోడ్పడుతుంది. దీనినే పునర్‌ కొనుగోలు ఒప్పందం అంటారు. రెపో రేట్‌ తగ్గితే ఆర్బీఐ దగ్గర బ్యాంకులు ఎక్కువగా అప్పులు చేస్తాయి. వాటిని ప్రజలకు రుణాలుగా ఇస్తాయి. బ్యాంకులు కూడా సామాన్యులకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లు తగ్గిస్తాయి.

బడా బాబులు లక్షల కోట్ల రూపాయలు ఎగవేస్తుంటే, వారిని వదిలేసి మోడీ ప్రభుత్వం, బ్యాంక్‌ అధికారులు వేలల్లో బాకీ ఉన్న రైతులను, చిన్నవ్యాపారులను, చిన్న పరిశ్రమదారులను ఎన్‌పిఏల పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారు. రద్దుచేయబడుతున్న మొండి బాకీల భారం, బేయిల్‌ అవుట్‌ పేరుతో బ్యాంకులకు ప్రభుత్వం అందించే పెట్టుబడి భారమంతా కష్టంగా బతుకుతున్న ప్రజలపై మోపబడుతోంది. మితిమీరిన మొండి బాకీల వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులు నేడు సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. బ్యాంకులు దివాళ తీశాయన్న సాకుతో ప్రైవేట్‌ రంగంలో బ్యాంకుల ఏర్పాటుకు ప్రభుత్వ చర్యలు తీసుకుంటుంది. నష్టాల్లో ఉన్న బ్యాంకులను దివాళ తీయకుండా లాభాలతో నడుస్తున్న పెద్ద బ్యాంకుల్లో విలీనం చేస్తోంది. ఫలితంగా 31 ప్రభుత్వ రంగ బ్యాంకులు12కి తగ్గాయి.

దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులలో మొండి బాకీలకు కారణమైన వ్యక్తుల, సంస్థల పేర్లతో నమోదైన మొత్తాలను, రైటాప్‌ చేయబడిన రుణాలకు సంబంధించిన బడా కంపెనీలు, పారిశ్రామిక వేత్తల వివరాలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పౌర సమాజం ముందు బహిర్గతం చేయాలి. వాస్తవంగా వివిధ కంపెనీలు లాభాలు సాధిస్తున్నప్పటికీ దివాళా తీసినట్టు తమ ఖాతా పుస్తకాలలో చూపి బ్యాంకులకు రుణాలు ఎగవేస్తూ, మరల కొత్త కంపెనీల పేరుతో వందల కోట్ల రూపాయలను బ్యాంకుల నుంచి రుణాలు పొందుతున్నాయి. ఇలాంటి సంస్థలపై, వ్యక్తులపై కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. మోడీ ప్రభుత్వం బ్యాంకులలో మోసాలకు పాల్చడుతున్న మొండి బకాయి దారులను, సంస్థలను గుర్తించి వారు తీసుకున్న రుణాలను తిరిగి రికవరీ చేసినప్పుడే బ్యాంకులు పరిపుష్టమై సామాన్య ప్రజలు బ్యాంకులలో దాచుకున్న సొమ్ముకు భద్రత చేకూరుతుంది. అయితే ప్రభుత్వం ప్రభుత్వ బ్యాంకుల ప్రయివేటీకరణే పరిష్కారం అంటుంది.

పది లక్షల కోట్ల రూపాయలకు చేరిపోయిన దేశంలోని ప్రభుత్వ ప్రైవేటు రంగ బ్యాంకుల ఎగవేత రుణాల, మొండి బకాయిల సమస్య పరిష్కారానికి బ్యాడ్‌ బ్యాంకు అనే ప్రత్యేక వసూళ్ల బ్యాంకును నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నదని బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థికమంత్రి ప్రకటించారు. ఆస్తుల పునర్నిర్మాణ సంస్థ (ఏఆర్‌సీ) లేదా ఆస్తుల నిర్వహణ సంస్థ (ఏఎంసీను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు బడ్జెట్‌ ప్రకటన సందర్భంగా నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. బ్యాంకుల బ్యాలెన్స్‌ షీట్లలో పేరుకుపోయిన మొండి బకాయిలు ప్రక్షాళన వ్యూహంలో భాగంగా ఓ బ్యాడ్‌ బ్యాంక్‌గా ఏఆర్‌సీ లేదా ఏఎంసి తేవాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఇవి బ్యాంకుల నుంచి నిరర్ధక ఆస్థుల (ఎన్‌పిఎ)ను కొనుగోలు చేస్తాయని చెప్పారు.


నిజానికి మొండిబకాయిలు వసూలు కాకపోవడానికి ఎగవేతదారులకు రాజకీయ పలుకుబడి, ప్రాపకం ఉండటమే కారణం. రుణ గ్రహీతల నిజాయితీ, ఆర్థిక స్థోమత, వ్యాపార పటిష్టత మున్నగు వాటిని బట్టి కాకుండా రాజకీయ ఒత్తిడులకు లొంగి బ్యాంకులు అప్పులిస్తున్నందున అవి ఎప్పటికీ వసూలు కాకుండా పోతున్నాయి. విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోడీ, మొహుల్‌ చౌకీ వంటి సంపన్నులు కూడా బ్యాంకులను దోచుకొని మరింత శ్రీమంతులు కావడానికి వ్యాపారాల పేరిట భారీ రుణాలు తీసుకోడాన్ని చక్కని రాజమార్గంగా ఎంచుకున్నారు. ఈ సమస్య ఒక్క సంవత్సరంలోనో, ఒక కూటమి పాలనలోనో పుట్టింది కాదు. దశాబ్ధాలుగా కొనసాగుతూనే ఉంది. దీనిని పరష్మరించేందుకు ప్రభుత్వాలు శ్రద్ధ చూపలేదు. సంకీర్ణ ప్రభుత్వాల పాలనలో ఈ మొండి బకాయిలు ఎక్కువగా పెరిగాయి. అన్ని పార్టీలకూ ఎగవేతదారుల మద్దతు ఉంది. వీరు రాజకీయ పార్టీలన్నింటికీ పోషకులుగా వ్యవహరించిన వారే.

భారతదేశ బ్యాంకింగ్‌ రంగంలో ప్రైవేటు రంగ యాజమాన్యం, నియంత్రణ, కార్పొరేట్‌ నిర్మాణం వగైరాఅంశాలలో… ప్రస్తుతం అమలవుతున్న లైసెన్స్‌, నియంత్రణ విధానాలను పరిశీలించేందుకు…. రిజర్వుబ్యాంకు నియమించిన అంతర్గత కార్యనిర్వాహణ [గ్రూప్‌ 2020, నవంబర్‌ 20న ఒక నివేదికను సమర్పించింది. కార్పొరేట్లకు బ్యాంకులను ఏర్పాటు చేసుకోవటానికి అవకాశం ఇవ్వాలని నివేదికలో ప్రతిపాదించారు. 1949 బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టానికి కొన్ని సవరణలు చేసిన తరువాత బ్యాంకింగ్‌ రంగంలోకి ప్రవేశించేందుకు బడా కార్పారేట్‌/ పారిశ్రామిక సంస్థలను అనుమతించాలని ఆర్‌బిఐ వర్కింగ్‌ గ్రూప్  సిఫారసు చేసింది. ప్రభుత్వం దీనిని ఆమోదిస్తే బ్యాంకింగేతర ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న బడా కార్పొరేట్లను దొడ్డిదారిన బ్యాంకింగ్‌ రంగంలోకి అనుమతించినట్లు అవుతుంది. రెండు ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించబోతున్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి తెలిపారు.

బ్యాంకులపై కార్పొరేట్‌, పారిశ్రామిక సంన్ధల యాజమాన్యం ఏర్పడటం వలన ఆర్థిక కేంద్రీకరణ మరింతగా పెరుగుతుంది. దీంతో దేశీయ ఆర్థిక వ్యవస్థ, రాజకీయ రంగాలపై దుష్ప్రభావాలు పడతాయి. అవి అసమానతలను పెంచటమే కాక, కొందరి ప్రత్యేక ప్రయోజనాలకు అనుగుణంగా విధానాలను రూపొందించటానికి దారి తీస్తాయి. బడా కార్పొరేట్‌ సంస్థలు బ్యాంకుల యాజమాన్యాన్ని స్వాధీనం చేసుకొంటే వచ్చే ఇబ్బందులు ఆర్‌బిఐకి తెలియక కాదు. రుణాలు కేటాయించటంలో తప్పులు చేయటం, తాము లాభాలు పొందేవిధంగా విధానాలను అమలు చేయటం, పోటీని నీరుగార్బేలా వ్యవహరించటం, తమ గ్రూపుల మధ్యనే రుణాలిచ్చుకొనే విధానంలోని సమస్యలు, నైతికపరమైన అంశాలు తదితరాలను గురించి వర్కింగ్‌ గ్రూపు తన నివేదికలోనే పేర్కొంది. ఇటువంటి చిక్కులను పేర్కొంటూ కూడా వర్మింగ్‌ గ్రూపు బడా కార్పొరేట్లను బ్యాంకింగ్‌లోకి అనుమతించాలని సిఫార్స్‌ చేయడం ఆశ్చర్యకరం. బ్యాంకింగ్‌ నియంత్రణ ఆర్‌బిఐ పర్యవేక్షణలో ఉన్నా ఇన్ని అక్రమాలు ఎలా జరుగుతున్నాయో ప్రజలకు జవాబివ్వాలి. ద్రవ్య పెట్టుబడికి దాసోహం అంటే భారత ఆర్థికవ్యవస్థ చిక్కుల్లో పడడం ఖాయం. అందువల్ల ప్రైవేట్‌ రంగంలో బ్యాంకింగ్‌ వ్యవస్థను పౌర సమాజం వ్యతిరేకించాలి.

Leave a Reply