ఆగస్టు 16 న, విప్లవ చిత్రకారుడు కామ్రేడ్ పార్ట్స్ బగానీని ఫిలిప్పీన్స్ సైన్యం, పోలీసులు దారుణంగా హత్య చేశారు. కామ్రేడ్ పార్ట్స్ బగానీ న్యూ పీపుల్స్ ఆర్మీ (NPA) పోరాట యోధుడు. ఉద్యమంలో ప్రసిద్ధ కళాకారుడు, సామ్రాజ్యవాద, భూస్వామ్యవాద, పెట్టుబడిదారీ విధానాలకి వ్యతిరేకంగా జరుగుతున్న ఫిలిప్పీన్స్ ప్రజల పోరాటానికి తన జీవితాన్ని, ప్రతిభను అంకితం చేశాడు. ప్రజల రోజువారీ జీవితం, పోరాటాల నుండి అతను స్ఫూర్తిని పొందాడు. ప్రజాదరణ పొందిన అతని కళాకృతులు విప్లవకర ప్రచురణలు, పుస్తకాలు, సాహిత్య రచనలను అలంకరించాయి, విశాల ప్రజానీకానికి స్ఫూర్తినిస్తూ  పోరాట మార్గం వైపు ప్రోత్సహించాయి. ఫిలిప్పీన్స్ పాలకవర్గం ఆదేశాల మేరకు హత్యచేసి, ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడని చెప్తూ  కా” పార్ట్స్ బాగానీ హత్యను కప్పిపుచ్చడానికి రాజ్య అధికారులు చేసిన ప్రయత్నాన్ని ఖండిస్తున్నాం.

ఆగస్టు 20 న, NPA- ఫాసిస్ట్ సైనిక దళాల మధ్య జరిగిన ఘర్షణలో మరో విప్లవ కళాకారిణి, కామ్రేడ్ కెరిమా లోరెనా తారిమన్ (కామ్రేడ్ ఎల్ల) కూడా హత్యకు గురయ్యారు. ప్రఖ్యాత కవయిత్రి, రచయిత్రి నెగోస్ ద్వీపంలోని గ్రామీణ ప్రజల పోరాటాలలో చురుకుగా పాల్గొన్నారు, అందుకోసం ఆమె తన పని, జీవితం రెండింటినీ అంకితం చేశారు. ఆమె ప్రశంసలు పొందిన కవితలు, సాహిత్య రచనలు పేదలు, అణగారిన ప్రజల బాధలు, పోరాటాలను ప్రతిబింబిస్తాయి. తాను సేవ చేసిన గ్రామీణ ప్రజలతో మమేకమవడం ద్వారా ఆమె ఇలాంటి కళాకారిణిగా తయారైంది.

వరుసగా జరుగుతున్న విప్లవ కళాకారుల హత్యలు ఫిలిప్పీన్స్‌ లో విప్లవ, ప్రగతిశీల ఉద్యమాలను ఆగ్రహోద్వేగాలకు గురి చేస్తున్నాయి.  ఫిలిప్పీన్స్‌లో బూర్జువాజీ, సామ్రాజ్యవాదాలు తమ  రక్తసిక్త చేతులతో ఉద్యమకారులను కాల్చి చంపడాన్ని CPG (ML)ఖండిస్తూంది. ఫిలిప్పీన్స్ విప్లవోద్యమ నష్టసమయంలో సంఘీభావంగా నిలుస్తుంది. ఫిలిప్పీన్స్‌ ప్రజల పోరాటానికి, అమరులైన పోరాట యోధుల వీరోచిత త్యాగాల ద్వారా స్ఫూర్తి పొంది జరపబోయే నూతన పోరాటాలకు మరింత సంఘీభావంగా నిలుస్తుంది.

ఇంటర్నేషనల్ బ్యూరో

ఏథెన్స్ ఆగస్ట్ 2021

అడ్రస్: EmmanouilBenaki 43 Athens Greece

Postal Code: 10678

Leave a Reply