సుదీర్ఘ కాలంగా  జైలు జీవితం అనుభవిస్తున్న కామ్రేడ్ నర్మద క్యాన్సర్ వ్యాధితో మరణించడం భారత విప్లవోద్యమానికి ఒక లోటు. ఆమె కఠినమైన విప్లవకర జీవితాన్ని ఎంచుకోవడం, జీవిత కాలమంతా దానితో మమేకం కావడం, అనారోగ్య సమస్య వున్నా నిమగ్నమై పని చేయడం, తాను పని చేస్తున్న క్రమంలో కేవలం కార్యకర్త గానే కాకుండా తాను పని చేస్తున్న కార్య క్షేత్రంలో జరుగు తున్న అనేక నిర్మాణ రూపాలను,  పాలక వర్గాల అణిచివేత చర్యలను ఆదివాసీ జీవితాల్లోని పితృ స్వామ్య సంబంధాలను పురుషుని ఆధిక్యతను ,పెత్తనాన్ని, అందులో వ‌స్తున్న మార్పుల‌ను  నర్మద హృదయ గతం చేసుకున్నారు.

భారత విప్లవోద్యమంలో   ఆమె అనేక రంగాల్లో  పనిచేసారు. ఇవాళ దండకారణ్యంలో ఏం జరుగుతుంది? హింస, ప్రతి హింసలు చట్రంలో విప్లవాన్ని అంచనా వేస్తున్న రాజ్యం లేదా మేధావుల  ఆలోచనల నుండి దండకారణ్యంను అర్థం చేసుకోవ‌డం కుద‌ర‌దు.   రాజ్య నిర్భంధం, విధ్వంసం  మధ్య నిర్మాణ మవుతున్న విప్లవోద్యమాన్ని, ప్ర‌త్యామ్నాయ అభివృద్ధిని కేవలం కార్యకర్త గానే కాదు, రచయితగా కూడా అర్థం చేసుకున్నారు. అందులో తన సృజనాత్మక బాధ్యతను నిర్వహించారు..

ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతున్న పోరాట క్రమాన్ని, ఆదివాసీ జీవితాల్లోని సౌంస్కృతిక అంశాలను నిత్య కధలుగా రాసారు. గడిచిన కల్లోల దశాబ్దంలో సల్వా జుడుం , గ్రీన్ హంట్ రూపంలో ఆదివాసీ ప్రాంతాల్లో  చాలా విధ్వంసం  జ‌రిగింది. ఆదివాసుల  చేతులతో నిర్మాణమ‌వుతున్న నూత‌న అభివృద్ధి నమూనా ధ్వంసం కావడం,  జనతన సర్కారు బీజరూపంలో నిర్మాణం కావడం మొద‌లైన‌వాట‌న్నిటినీ ఆమె త‌న  కధావరణలో నిక్షిప్తం చేసారు.

నిత్య కధకురాలిగా  ఆదివాసీ పరిభాషలో మాట్లాడారు. నిత్య కధల్లో ప్రధానంగా రెండు అంశాలు ఉన్నాయి. యుద్ధం,  సాంస్కృతిక విషయాలు ఆమె క‌థా వ‌స్తువులు. వాటిని ఆమె దయిన కంఠ స్వరంతో  నమోదు చేసారు. అత్యంత సున్నితమైన భావాలు యుద్ధ రంగం నుంచి వినిపించారు. ఆమె  కధలను విప్లవీక రించడం మాత్రమే కాదు.  జీవితంలోని విప్ల‌వ ర‌క్ర‌మాన్ని రాశారు. ముఖ్యంగా ఆదివాసీ సమాజపు సాంస్కృతిక వ్యక్తీకరణను లోతుగా పరిశీలించారు. నిత్య  తక్కువ కధలే  రాయవచ్చు.అందులో కొన్ని కధలు విప్లవ కార్యాచరణ , అందులో భాగమయిన మనుషులు ప్రజల పక్షాన నిలబడే వారి క్రియా

శీలతను చిత్రించారు.  నూతన మానవుని కోసం సాగుతున్న  అన్వేషణ . మహిళల భాగస్వామ్యం  మీద ఆమె ఫోక‌స్ చేశారు. ఆమె ఇవ‌న్నీ యుద్ధ రంగం నుంచి మాట్లాడారు. ఆమెకు  రచన ఒక బాధ్యత.   విప్లవకారులు త‌మ సృజనాత్మకతను కధలుగా మలిచారు. అందులో నిత్య ఒక‌రు. 

నిత్య కధలలో దశాబ్దం క్రితం వచ్చిన చాయగ్లాస్ కధ   పురుషత్వ భావజాలం  చిన్న పిల్లల్లో సైతం  ఎలా ఉంటుందో చిత్రించింది.  అనాదిగా మగవాని వైపు నుంచి సమాజపు సంప్రదాయ అలవాట్లు,  పని విభజన,  వాటి వ్యక్తీకరణను ఈ క‌థ చిత్రించింది.  మహిళలు చేసే పనులు, మగవాళ్ళు చేసే పనులు అనే విభజన గీతను పురుషాధిక్యత సమాజమే ఏర్పరచినది. 

చాయ్ గ్లాసు కధను ఎలా చూడాలి అనే ప‌రిశీల‌నా ప‌ద్ధ‌తే చాలా ముఖ్యం. దాని మీదే చ‌ర్చ జ‌ర‌గ‌వ‌ల‌సి ఉన్న‌ది. . ఆదివాసీ సమాజం విప్లవీకరణ చెందే క్రమంలో స్త్రీ, పురుష సమానత్వం చాలా ప్రధానమైన అంశమైంది. విప్లవీకరణ వెలుగులో మనుషులు రూపొందే క్రమం సమానత్వాన్ని సాధించాల్సి ఉన్న‌ది. ఇది నిజంగానే అక్క‌డ ఎలా జ‌రుగుతున్న‌దో నిత్య గ‌మ‌నించింది.  .ఈ కధను రాయడం వెనుక స్త్రీ హృదయం మాత్రమే సరిపోదు. స్త్రీకోణం కూడా స‌రిపోదు. మ‌నుషుల‌లోని పితృస్వామ్యం ర‌ద్ద‌యి కొత్త జీవితం లో భాగం కావ‌డానికి చాలా సంఘ‌ర్ష‌ణ కావాలి. చాలా శిక్ష‌ణ‌ కావాలి. ఇది కేవ‌లం   ఎనభైవ దశాబ్దంలో స్త్రీవాదం రేపిన అనేక ప్రశ్నలకు, ధిక్కారానికి ప్రతిబింబం కాదు. 

మగవారిని వైపు  నుంచి నిర్మాణ‌మైన సమాజపు    మూలం ఏమిటి? బుడతడు తాను తినే కంచం,  తాను తాగే చాయ్ గ్లాసు తనే కడుక్కోవడానికి అడ్డు పడే సాంస్కృతిక విషయం ఏమిటి? తను పెద్దవాడవుతున్న క్రమంలో విప్లవోద్యమంలో భాగమయనాక తాను మారిన విధానం వెనుక పని చేసిన ప్రధాన అంశం విప్లవోద్యమం. ఈకధ వెనుక వున్న ఈ తాత్వికత అర్ధం కాకుంటే పురుష, ఆధిపత్య సంస్కృతికి నిదర్శనంగా ఇంకేదో మిగులు తుంది. స్త్రీ వాద దృక్పథానికి వర్గ పోరాటం ఇరుసు కానంత వ‌ర‌కు  సమాజపు చలనాన్ని మార్చే విష‌యం గందరగోళం కు కారణమవుతుంది.

నిత్య చాయ్ గ్లాసు కధ ఒక   పురుషాధిక్యతను ఎక్కడ పట్టు కోవాలో అక్కడ ప‌ట్టుకుంది. అక్క‌డి నుంచి సాహిత్యావరణను సిద్ధం చేసుకున్నారు.ఈ కధ ఆదివాసీ సమాజపు సాంస్కృతిక వ్యక్తీకరణ. పురుషుని దృక్కోణం ప్రజాస్వామీకరణ చెందడానికి  విప్లవోద్యమం నిర్వహించిన భూమిక ఆధారం.  నిరంతర

మానవ సంబంధాల్లో మార్పులు  ఒక గుణాత్మక మార్పుకు వ‌ర్గ‌పోరాటం దోహద కారి అవుతుంద‌ని చెప్ప‌డం ఈ క‌థ ఉద్దేశం.  పితృ స్వామ్య భావజాలం ఈ చిన్నారులలో ప్రభావం వేయడానికి  సమాజంలోని  పని విభజన ఆధారం.  చాలా స్పష్టంగా ఈపని విభజన మార్పు చెందితే స్త్రీ, పురుష సమానత్వం సాధ్యమే.

    అమ్మ పొలం దున్నుతుంది

    నాన్న ఊయల ఊపుతాడు

     చందు అన్నం వండుతాడు.

     రామె అన్నం వడ్డిస్తుంది

     పెదనాన్న బియ్యం చెరుగుతాడు.

నిత్య తన పరిశీలనలో అనాదిగా వస్తున్న ఈ భావజాలం మారాలంటే  చాలా ముఖ్యమైన అంశం పని విభజన మారాలి.  అది కూడా తరగతి గది నుంచి మొదలు కావాలి.చాయ్ గ్లాసు కేవలం కధ గానే అంచనా వేసి ప్రయోజనం లేదు. ప‌ని విభ‌జ‌న మారాలి. దాని చ‌ట్రం మారాలి. భావ‌జాలం మారాలి. మొత్తంగా ఉత్పత్తి సంబంధాలు మారితేనే సమానత్వం సాధ్యం. ఆ సమానత్వం ఆర్ధిక పరమైనది లేదా సాంస్కృతిక పరమైనది కావొచ్చు. ఈఎరుకను విప్లవోద్యమంలో భాగంగా నిత్య స్వీకరించారు.

నర్మద నిత్య పేరుతో  రాసిన కధలు చాలావిలువైనవి.నిజానికి ఆదివాసీ పరిభాషను ఆమె సహజంగా పలికించారు. విప్లవ నాయకురాలుగా రచయితగా తను జీవించిన కాలాన్ని సుసంపన్నం చేశారు.

Leave a Reply