మనం ఇక్కడి దాకా ఎలా చేరుకున్నాం. ఈ చేరుకు దారితీసిన భౌగోళిన, భౌతిక పరిస్థితులకు ఉన్న కార్యాకారణ సంబంధమేమిటి? నూత్న భారతదేశ నిర్మాణంలో భాగమయిన శ్రామికవర్గ సంస్కృతిని ధ్వంసం చేసి మతరాజ్యంగా భారత సమాజం నిర్మిత మవుతున్న చారిత్రక దశను, ఈ కాలంలో జరిగిన, అనేక చారిత్రక అంశాలను, ముఖ్యంగా మతరాజకీయాులను బహు పార్య్వాలలో ఆకార్ పటేల్ రచన మన ‘హైందవరాజ్యం పరిచయం చేసింది. ఒక కాలానికి, భారత పాలకవర్గాల మతసంస్కృతికి, సంబంధించిన విషయం మాత్రమే కాదు. భారత ప్రజాస్వామ్యం మతాంతీకరణ వైపు అడుగులు వేయడానికి బీజాలు పడుతున్నాయనే విషయం తేటతెల్లమవుతున్నప్పుడు, ఇప్పుడున్న భారతదేశంలోని అల్ప్బసంఖ్యాకుల జీవనభద్రత ప్రమాదంలో పడిందనేది ఆకార్పటేల్ బలమైన వాదన.
నూరేళ్ళ భారతదేశం, శాస్త్ర, సాంకేతిక రంగాలలో అది కనబర్చిన వికాసదశ, అదే సమయంలో వలస పాలన, వలసపాలనానంతర కాలంలో భిన్నమతాల కూడలి అయిన భారత సమాజం సారాంశంలో రెండు మత ప్రమేయాల రాజ్యంగా చీలిపోవడం మొదటి దశ. కాలం మనుషుల్ని మరింతగా ప్రజాస్వామీకీరణ చేస్తున్న దశలో, భారత చరిత్రలో ఏఏ దశలలో మతం కారణంగా జరిగిన విధ్వంసాన్ని ఘర్షణను నమోదు చేసిన దాటిన తర్వాత వికాసయుగంలో జీవిస్తున్న లేదా మార్పు చెందుతున్న ప్రపంచంలో జీవిస్తున్న కాలంలో ఈ మతంపై ఆధారపడిన ఒక సమాజపు ఘర్షణ ఏమిటి? ఇది ఇవాళ చర్చనీయమైన అంశం. చరిత్రలో భారత ఉపఖండంలో భిన్న కులాల మధ్య ఘర్షణ వాతావరణం ఉండవచ్చు.\
ఆనాటి భౌగోళిక నేపథ్యం, అనేక ఘర్షణలకు, మనుషుల నిర్మూలనకు దారితీయవచ్చు. ఆనాటి మనుషులు జీవిస్తున్న కాలం మొరటు మనుషుల కాలం కావచ్చు. ఇది వికాసయుగం. మానవుడు రూపొందించుకుంటున్న కాలం. ప్రపంచంలో నూతన ఆవిష్కరణలు ఫలవంతంగా మారుతున్న దశ. నూతన మానవుడు రూపొందుతున్న క్రమం. నూరేళ్ళ కాలాన్ని పరిమితం చేసుకుంటే లేదా ఒక చిన్న శృతిలో మాట్లాడుకుంటే రెండు భిన్న ప్రపంచాల వెలుగు – చీకటి బహిర్గతమవుతుంది. పెనుగులాట నుండి భారతదేశం (శ్రామిక సంస్కృతిపై నిర్మితమయ్యే క్రమంలో మత విన్యాసాలు వ్యక్తిగతమైన విషయంగా ఉండాల్సిన రాజకీయ యవనికపై పునాది అంశంగా ఉండటం అంతిమంగా అధికారపు నిచ్చెనమెట్లు ఎక్కేందుకు మతం హక్కు కావడం ఇవాల్టి భారతదేశపు స్థితి.
మన హైందవరాజ్యం రూపొందే క్రమంలో ఆకార్పటేల్ కృషి ఈ పుస్తక అవసరం వర్తమాన భారతదేశానికి అవసరమైనది. నిజానికి చరిత్రలో జరిగిన పొరపాట్ల నుండి, అణిచివేత నుండి మనమేమయినా నేర్చుకుంటామా? నేర్చుకోవాల్సిన, తప్పిదాలను సరిదిద్దుకోవాల్సిన పరిణతి ఉన్నదా? లేదా వాటినుండే ప్రేరణ పొంది వర్తమాన రాజకీయాలకు అన్వయింపు జేస్మాని మరింతగా మధ్యయుగంలోకి ప్రజాస్వామ్యాన్ని తీసుకుపోవడమా? ఈ దేశంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం పుట్టుక, దాని అనుబంధ సంస్థలు. ఈ కాలానికి ముందు ముస్లింలీగ్ పుట్టుక ఈ రెండు భారత ప్రజల పట్ల విభజన వైఖరికి కారణాలుగా వున్నాయి. జిన్నా ముస్లిం వాదం ఏర్పాటు వెనకాల ఈ దేశంలో అల్పసంఖ్యాక వర్షాల అభద్రత ఉన్నది. వలసకాలంలో అణిచివేతకు గురి అవుతున్న అల్ప్బసంఖ్యాకుల జీవనభద్రత పట్ల ఎరుక వున్నది. ముస్లిం లీగ్ అవసరాన్ని తర్వాత కాలం అనేక రూపాలలో రుజువు చేసింది. జిన్నా ముందు చూపు, భారత విభజన ముస్లింల ఊచకోత పాకిస్థాన్ ఏర్పడటం ఇదంతా రక్తగాయాల చరిత్ర. తదననంతరకాలంలో పాకిస్థాన్ ఒకదేశంగా రూపొందడం.
ఇస్లామిక్ దేశాన్ని దానికొక రాజ్యాంగం ఉపఖండంలో జగిరిన పెద్దకుదుపు. ముస్లింలీగ్ – ఆర్.ఎస్.ఎస్. రూపంలో ఒక్కటిగా కనబడినా సారాంశంలో భారత సమాజాన్ని అంచనా వేసినప్పుడు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నిర్వహించిన భూమిక, రెండు వేదికలు వాటి వ్యక్తీకరణలు మనముందు వున్నాయి. ముస్లింలీగ్ ప్రమేయం విభజన తర్వాత భారత సమాజానికి అవసరమైనదిగా, ప్రభావవంతం చేసేదిగాల లేదు. ఈ దేశంలో ముస్లిం సంతతికి దాని అవసరం రాజకీయ, వ్యక్తిగత పరంపరలో కనబడలేదు. అదే సమయంలో ఆర్. ఎస్. ఎస్ బహుముఖాలుగా విస్తరించిన కాలం ఇవాళ కొనసాగుతున్న ఆ సంస్థ తాజా స్థితి. ఇది గమనించదగిన అంశం.
భారత రాజకీయాలు మరీ ముఖ్యంగా పాలక పార్టీల ఎదుగుదల తీరును అర్ధం చేసుకోకుండా, మతం నిర్వహిస్తున్నపాత్ర అవగతం కాదు. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు వారి అజెండా వెనక దాగిన విభజిత రాజకీయాలను అర్ధం చేసుకోవడం మాత్రమే కాదు. కేవలం అధికారం కోసం ఈ రెండు రాజకీయ పార్టీల దీర్ధకాలపు కొనసాగింపును అంచనా వేయాలి. అప్పుడు మాత్రమే భారత రాజకీయాలలో ఆధిపత్య మతం యొక్క ప్రజాస్వామిక వైఖరిలో ఎంత వాస్తవమున్నది అవగతమవుతుంది. భారత ప్రజాస్వామ్యం తొలిదశలో, ముఖ్యంగా మతప్రస్తావన లేని కాలంలో అసంఖ్యాక ప్రజలకు, వారి జీవన భద్రతను, వారి వ్యక్తిగత మతవిశ్వాసాలకు, సారాంశంలో భరోసా ఇవ్వగలిగింది. అధికార మార్చిడి అనంతర భారతదేశం స్వేచ్భాపూరిత ఆవరణలో మతం దాని యొక్క ముద్రలు ఓటుబ్యాంకు రాజకీయ చట్రంలో రాలేదు. ఆనాటి భారత సమాజం మొత్తంగానే కనీస జీవన అవసరాలకు పెనుగులాడింది. భారతదేశ భవిష్యత్తు ప్రజల జీవన వైవిధ్యంపై ఆధారపడి వుందని ఆనాటి పాలకవర్గం భావించి ఉండవచ్చు. నెహ్రూ పాలనా వైఫల్యం ఆర్థికపరమైన నిర్ణయాలు భారతదేశ పేదరికం ఇదంతా పరావర్తనం. ఇక్కడ మతం తనదయిన ఆధిక్యతను చాటుకోవడానికి, మతం ఓటుబ్యాంకుగాను చోదకశక్తిగా ఉంటుందని ఆలోచన చేయని కాలం.
జనసంఘ్ నుండి రూపం మార్చుకొని భారతీయ జనతాపార్టీగా మారిన దశ నుండి భారత రాజకీయాలలో హిందూత్వ ప్రభావాన్ని లేదా పార్లమెంటరీ రాజకీయాలలో తమదయిన బలాన్ని నిరూపించుకోవడానికి బిజెపి హిందూకార్జును బాహాటంగానే వాడుకుంది. ఈ నాలుగు దశాబ్దాల కాలంలో స్థూలంగా రాజకీయ చట్రాన్ని గమనిస్తే, భారతదేశపు పునాది ధ్వంసమై ఏ ఆదర్భాలను నిర్వచించిందో, వాటికి దూరమై హిందూత్వను కేంద్ర అంశంగా పార్లమెంటరీ రాజకీయాల ముందు నిలబెట్టింది. ముస్లింలను, దళితులను మెజారిటీ సమూహం నుండి వేరుచేసి జీవన సంస్కృతుల మధ్య తేడాలను పెద్దవి చేసి ప్రజల మధ్య ఉండాల్సిన సంఘాభావాన్ని విధ్వంసం చేసి, అనేక శిబిరాలుగా చీలిపోవడానికి హిందూత్వ రాజకీయ విశ్వాసాల, తదనంతరం అధికారం కోరుకునే వ్యక్తులు భారత సమాజాన్ని అనేక పాయలుగా చీల్చారు. వారి ఆలోచనా విధానం వలన వారి ఆకాంక్ష నెరవేరింది. ప్రజల రోజువారీ జీవితం వారి ఆర్థిక, మానసిక పురోగమనం బాధాకరమైన జీవితం ఒకింత స్వేచ్చ వీటిని తోసివేసి మతం యొక్క భావజాలాన్ని ముఖ్యంగా అనేక ఆశలతో వికసిస్తున్న యువతరాన్ని మానసికంగా తనవైపు ఉంచుకునే మార్గాన్ని వేయగలిగింది.
ఆకార్పటేల్ రచన *’మన హైందవరాజ్యం” భారత రాజకీయాలలో పాలనా వ్యవస్థలో హిందూత్వ ఎలా అంతర్లీనం కాగలిగింది. ఈ అంతర్లీనతకు ప్రజాస్వామిక శక్తులు భారతీయతను దానియొక్క ప్రజాస్వామిక, భావజాలాన్ని తమ చేతులతో, హృదయాలలో స్థిరంగా వుంచడానికి మత ప్రమేయం లేని రాజ్యాంగ చట్రాన్ని అదేస్థాయిలో వుంచేందుకు ఎలాంటి పెనుగులాట పడినారో మనముందు వుంచగలిగింది. భారత ప్రజల మానసిక ప్రపంచం నిజానికి మతంతో ముడిపడి లేదు. ఎవరి వ్యక్తిగత మత విశ్వాసాలు వుంటే వుండవచ్చు వ్యక్తులకు, కుటుంబాలకు మాత్రమే పరిమితి. వినాయక చవితి, దసరా,
వంటి పండుగలు ఆయా మతాల సామూహిక అంశంగా వుండవచ్చు. నిజానికి వాటికి కూడా అనేక పరిమితులున్నాయి. అవి రాజకీయ వేదికలుగా, బలప్రదర్శనలుగా మారలేదు. రాముడు రాజకీయుడు అయినాక అసలు సమస్య ప్రారంభమయ్యింది. రాముడు అధికారానికి చేరువచేసే బలమైన చోదకశక్తిగా మారాక భారత రాజకీయాల పునాది అంశం. వేగవంతంగా మారింది. బ్రాహ్మణీయ హిందూత్వ చెబుతున్నట్లుగా రాముడు భారతీయ ఆత్మకు ప్రతిబింబం కానేకాదు. నిజానికి రాముడు
ఆదర్శ్భనీయుడు కాదు. సంఘ్పరివార్ ఎన్నికల అస్త్రంలో రాముడు ఆదర్శనీయ వ్యక్తికాగలిగినాడు.
మొత్తంగా ఈ నాలుగు దశాబ్దాలు భారత ప్రజలకు చీకటిరోజులు. తమ ముందు ఏం జరుగుతుందో తెలిసేలోపు అనేక వేగవంతమైన పరిణామాలు జరిగాయి. ఒకదశలో భారతదేశ అల్పసంఖ్యాక వర్గాల భవిష్యత్ ఆందోళనకరంగా మారింది. హిందూత్వ శక్తుల రాజకీయ పునాది మాత్రమే వారి గొంతులలో ఆచరణలో భయపెట్టే వాతావరణం నెలకొంది. వీటన్ని మధ్య భారత సమాజం తన రోజువారీ జీవన రాపిడి నుండి తనదయిన ఆశావహ దృక్పథం వైపు పయనిస్తుంది. అన్ని ఆశలు, అన్ని ద్వారాలు మూసుకుపోయాక ప్రగతిశీల ఆలోచనాపరులు భారత సమాజంపై వారికున్న నిబద్ధత విభజన
రాజకీయాలను నిలువరించగలుగుతుంది.
చీకటి నుండి వెలుగు లోకి ప్రసరించే ప్రయత్నమే ఆకార్పటేల్ మన ‘హైందవరాజ్యం అనువాదం. దా. చెలికాని రామారావు మెమోరియల్ ట్రస్ట్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది.