మరణించిన మనురామ్ నూరేటి ‘మావోయిస్టు’ అన్న పోలీసులు ఆ తర్వాత కాదన్నారు .
2022 జనవరి 23న ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలోవున్న భరందా గ్రామంలో జరిగిన ఎన్కౌంటర్లో మనురామ్ నూరేటి అనే యువకుడు చనిపోయాడని పోలీసుల కథనం.
“ఎన్కౌంటర్ ప్రారంభమైనప్పుడు జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG) బృందం ఏరియా డామినేషన్ ఎక్సర్సైజ్ లో ఉంది. అర్ధరాత్రి 1 గంటలకు, మావోయిస్టులు డిఆర్‌జిపై కాల్పులు జరపడంతో ఎన్కౌంటర్ ప్రారంభమైంది. ఎన్కౌంటర్ 20 నిమిషాల పాటు కొనసాగింది. ఆగిపోయిన తరువాత, సంఘటన స్థలం నుండి ఒక మావోయిస్టు మృతదేహాన్ని, మజిల్ లోడింగ్ గన్ (ఎమ్‌ఎల్‌జి)ను స్వాధీనం చేసుకున్నది, ”అని నారాయణపూర్ పోలీసు సూపరింటెండెంట్ గిరిజా శంకర్ జైస్వాల్ చెప్పారు, ఎన్కౌంటర్ స్థలం నుండి మావోయిస్టులకు సంబంధించిన వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు.
“రాత్రి 10 గంటల ప్రాంతంలో, నా భర్త పక్షులను వేటాడేందుకు స్లింగ్‌షాట్‌తో బయటికి వెళ్లాడు. అతను స్వెటర్ సాధారణ చెప్పులు వేసుకున్నాడు, కానీ పోలీసులు చూపించిన మృత దేహానికి యూనిఫాం వుంది, రైఫిల్ ఉంది” అని మృతుడి భార్య మాన్వతి చెప్పారు.
కాగా, పోలీసులు ఆరోపణలను ఖండించారు. “ఎన్కౌంటర్ బూటకమని వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి. సోమవారం రాత్రి, డిఆర్జి బృందాన్ని ఏరియా డామినేషన్ ఎక్సర్సైజ్ కోసం పంపారు. అర్ధరాత్రి 1 గంటలకు, మావోయిస్టులు డిఆర్‌జిపై కాల్పులు జరపడంతో ఎన్కౌంటర్ ప్రారంభమైంది. సోమవారం ఉదయం, భాను రామ్ నూరేటి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాము. ఘటనా స్థలం నుంచి ఒక ఆయుధాన్ని, మావోయిస్టులకు సంబంధించిన వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నాం’’ అని మీడియా ప్రశ్నలకు అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నీరజ్ చంద్రకర్ సమాధానమిచ్చారు.
ఈ ఘటన గురించి, “జనవరి 24న తెల్లవారుజామున 1:30 గంటలకు, DRG ఫోర్స్ బెటాలియన్ భరండా గ్రామంలో సర్చ్ ఆపరేషన్‌కు బయలుదేరింది. నారాయణపూర్ జిల్లాలోని భరండాకు దక్షిణంగా 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న వంతెనపై పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ప్రధాన రహదారి కల్వర్టు దగ్గర 10 నుంచి 15 మంది నక్సలైట్లు సెర్చ్ టీమ్‌పై కాల్పులు జరిపారు. దాదాపు పది నుంచి పదిహేను నిమిషాల పాటు జరిగిన కాల్పులకు ప్రతిస్పందనగా, DRG బృందం కూడా కాల్పులు జరిపింది. కాల్పులు ఆగిపోయిన తర్వాత, తెల్లవారుజామున ఆ ప్రాంతంలో జరిపిన శోధనలో మూడు కిలోల కుక్కర్ బాంబు, వైర్లు, నక్సలైట్ సాహిత్యంతో సహా లోడ్ చేయబడిన తుపాకీ, నక్సలైట్ సామాగ్రితో పాటు ఒక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కొన్ని బ్యానర్లు, పోస్టర్లు కూడా దొరికాయి” అని నారాయణపూర్ అదనపు ఎస్పీ నీరజ్ చంద్రకర్ వివరించారు. జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) గిరిజాశంకర్ జైస్వాల్ ఎన్‌కౌంటర్‌ను ధృవీకరించారు.
అయితే ఎన్కౌంటర్లో మరణించిన అనుమానిత మావోయిస్టు కుటుంబ సభ్యులు ఎన్‌కౌంటర్‌పై ప్రశ్నలు లేవనెత్తారు, మరణించిన వ్యక్తి మావోయిస్టు కాదని పేర్కొన్నారు.
పోలీసులు చెప్పేది అబద్ధమని, తన భర్త వేటకు వెళ్లి హత్యకు గురయ్యాడని మృతుడి భార్య రేణురామ్ నూరేటి ఆరోపించారు.
“నా సోదరుడు మావోయిస్ట్ కాదు… అతను ఇటీవలే పోలీస్ ఫోర్స్ లో రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు… ‘బస్తర్ ఫైటర్స్’లో (బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం బస్తర్ ఫైటర్స్. ఇది ఎక్కువగా స్థానిక యువతను రిక్రూట్ చేయడంపై దృష్టి పెడుతుంది. బస్తర్ డివిజన్లో ఏడు జిల్లాల నుంచి మొత్తం 2,800 మంది జవాన్లను రిక్రూట్ చేసుకోనున్నారు) చేరడానికి పోలీసు రిక్రూట్మెంట్ ఫారమ్‌ను నింపాడు. మా కుటుంబం మావోయిస్టులకు మద్దతు యిచ్చేది అయితే, మేము పోలీసులలో ఎందుకు చేరాము? నా సోదరుడు కూడా పోలీసులలో చేరేందుకు రాత్రింబగళ్లు కష్టపడుతున్నాడు. మావోయిస్ట్ గా పోలీసులు చంపిన నా సోదరుడు అమాయకుడు….. నా సోదరుడికి మావోయిస్టు యూనిఫాం ధరించి, అతని శరీరంపై తుపాకీని అమర్చడం ద్వారా పోలీసులు అతన్ని ‘తెలియని మావోయిస్టు’గా ప్రకటించారు. నిజానికి మా కుటుంబం మావోయిస్టు తీవ్రవాద బాధితురాలు’’ అని రేణురామ్ చెప్పారు. అతను లొంగిపోయిన మావోయిస్టు.
DRG జవాన్ రేణురామ్ నురేటి కుటుంబం వాస్తవానికి దుర్గ్ జిల్లాలోని ఘోటియాకు చెందినది. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతం నుంచి తప్పించుకునేందుకు రేణురామ్ 2014లో తన కుటుంబంతో కలిసి భరండాకు వెళ్లారు. అదే సంవత్సరం “గోప్నియా సైనిక్” అనే రహస్య సైనికుడిగా పోలీసు బలగంలో చేరాడు. 2021 జనవరిలో, DRG సిబ్బందిగా పదోన్నతి పొందాడు. ప్రస్తుతం కడమెట ప్రాంతంలో విధులు నిర్వహిస్తూ భార్య, కుమార్తెతో కలిసి గుద్రిపారాలో నివసిస్తున్నాడు. రేణురామ్ రేణురామ్ భార్య, కూతురు ఇద్దరూ భరందాలో ఇటుక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. మనురామ్ తన భార్య మనోరతో కలిసి భరండాలో ఉంటూ వ్యవసాయం చేస్తున్నాడు.
“జనవరి 21న సాయంత్రం పక్షుల వేటకు మను అడవికి వెళ్తున్నానని, రాత్రి 10 గంటలకు తిరిగి వస్తానని చెప్పాడు. అయితే రాత్రి వరకు తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులం చుట్టుపక్కల వెతికాం. అడవిలో పోలీసులు-మావోయిస్ట్ ల మధ్య ఎన్కౌంటర్ జరిగిందని ఉదయం ఎవరో మాకు సమాచారం అందించారు. అప్పుడే నా భర్త ఎన్కౌంటర్లో చనిపోయాడని, మావోయిస్టుగా ముద్రపడ్డాడని మాకు తెలిసింది. అతను కేవలం స్లింగ్షాట్(గులేర్)తో పక్షులను వేటాడేందుకు వెళ్లాడని మనురామ్ స్వెటర్, సాధారణ చెప్పులు ధరించాడని, కాని పోలీసులు చూపిస్తున్న మృతదేహంపై యూనిఫాంతో పాటు పక్కన రైఫిల్ ఉంది ..” అని మృతుడి భార్య మనోరా నూరేటి అన్నారు.
మొదట్లో అతన్ని మావోయిస్టుగా ముద్ర వేసిన పోలీసులు తర్వాత, ఫిబ్రవరి 1న ఉపసంహరించుకున్నారు. వాస్తవానికి నూరేటి తన స్నేహితులతో వేటకు వెళ్ళిన సాధారణ గ్రామస్థుడని చెప్పారు.
ʹనూరేటి తన ముగ్గురు స్నేహితులతో కలిసి జనవరి 23 రాత్రి వన్యప్రాణుల వేట కోసం అడవిలోకి వెళ్లినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. వారి దగ్గర మూడు నాటు తుపాకులు, బాణాలు ఉన్నాయి. జనవరి 24న తెల్లవారుజామున 1:30 గంటలకు పెట్రోలింగ్ విధుల్లో ఉన్న డీఆర్జీ బృందానికి, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి, ఇందులో నూరేటి బహుశా క్రాస్ ఫైరింగ్‌లో హతమయ్యారు, ʹఅని ఐజి బస్తర్, సుందర్రాజ్ పి చెప్పారు. నిషేధిత సీపీఐ (మావోయిస్ట్)తో అతనికి ఎలాంటి అనుబంధం లేదని ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.
మార్చి 12న మీడియాతో మాట్లాడిన మాన్వతి, “మేం మేజిస్ట్రేట్ విచారణలో ఇచ్చిన వాంగ్మూలాలను మార్చుకోవాలని నారాయణపూర్‌లోని పోలీసులు ఇప్పుడు మాపై ఒత్తిడి తెస్తున్నారు. ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని కూడా మమ్మల్ని అడుగుతున్నారు.
“నా భర్త మావోయిస్టు కాదని పోలీసులు అంగీకరించిన తర్వాత, నా భర్తను చంపిన పోలీసులపై ఎఫ్ఐఆర్ని నమోదు చేయాలని కోరుతూ ఫిబ్రవరి 15న పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాను కానీ ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. పోలీసులు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్) నమోదు చేయడంలో జాప్యం చేస్తున్నారు, తమకు న్యాయం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రికి లేఖ రాసాను” అని మన్వతి చెప్పారు.
“నా భర్త మావోయిస్టు కాదని పోలీసులు అంగీకరించిన తర్వాత, నా భర్తను చంపిన పోలీసులపై ఎఫ్ఐఆర్ని నమోదు చేయాలని కోరుతూ ఫిబ్రవరి 15న పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాను కానీ ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు.” అని మనురం నూరేటి భార్య మన్వతి ఆరోపించారు.
అయితే, పోలీసులపై మాన్వతి ఇటీవల చేసిన ఆరోపణలను తోసిపుచ్చుతూ, బస్తర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ పి సుందర్రాజ్, “మొదట్లో అతనికి మావోయిస్టులతో సంబంధం ఉన్నట్లు మేమే అంగీకరించాము, కాని దర్యాప్తు కొనసాగడంతో వివిధ ఆధారాలు, వాంగ్మూలాలూ. మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో చిక్కుకున్న సామాన్య గిరిజనుడు మనురామ్ అని సూచించాయి. ఈ విషయాన్ని మీడియాతో కూడా పంచుకున్నాం.
ఇప్పటికే ఒక ఎఫ్ఐఆర్ ఉంది, పోలీసులు విచారణ జరిపారు. ఎన్‌కౌంటర్‌తో సంబంధం లేని అధికారి ద్వారా మెజిస్ట్రియల్ విచారణ జరుపుతున్నారు. మేము నియమాలు, న్యాయస్థానాలు నిర్దేశించిన అన్ని మార్గదర్శకాలను పాటిస్తున్నాము.”
నిజనిర్ధారణ బృందం మను నిర్దోషిత్వాన్ని పునరుద్ఘాటించింది, బస్తర్‌లో సైనిక మోహరింపును ఉపసంహరించాలని సలహా ఇచ్చింది
న్యాయవాది, ఆదివాసీ హక్కుల కార్యకర్త బేలా భాటియాతో సహా ముగ్గురు సభ్యుల నిజనిర్ధారణ బృందం ఈ సంఘటనపై విడుదల చేసిన నివేదికలో ఈ క్రింది అంశాలను చెప్పింది.
“మనురామ్ నూరేటి పోలీసులు, భద్రతా బలగాల తూటాలచే హతమయ్యాడని, ఏ ఎన్కౌంటర్ లేదా ఎదురుకాల్పుల్లో మరణించలేదని స్పష్టంగా తెలుస్తోంది”.
“రెండవది, పోలీసులు అబద్ధపు కేసు నమోదు చేసారు, ఈ కేసులో జప్తు చేసిన వస్తువులను కూడా చూపించారు, ఇది తీవ్రమైన నేరం.”
“మూడవది, తద్వారా వారు, మనురామ్ మరణానికి పోలీసులను నిందించవద్దని మౌనంగా ఉండాలని స్థానిక పోలీసులు మృతుని కుటుంబంపై ఒత్తిడి తెస్తున్నారు.”
అనువాదం : కె. పద్మ
సోర్స్ : క్వింట్