గనిలో వారం
చీకటిలో
దీపాల వెలుతురు లో
నల్ల బంగారం వెలికి తీత
రెక్కలు ముక్కలు చేసుకుంటూ
జనానికి వెలుతురు నివ్వడానికి

వారం బడలిక
సడలించుకుంటూ
కుటుంబాలతో గడపాలనే ఆనందంతో
ఆశతో ఊసులతో ఊహలతో కలలతో బయల్దేరాం

పాటలు పాడుకుంటూ
ఎప్పటిలాగే
లేగదూడల్లా ఎగురుతూ
అదే బండి అదే తోవ అదే సమయం ఏళ్ళుగా

మాయదారి చట్టం
చేతుల్లో పెట్టుకున్న
రక్షక దళం
విరుచుకు పడింది
కాల్పుల మోత
గుండెల్లో రుధిరం చిమ్మింది
దేహాలను చిదిమింది
బతుకు బుగ్గి చీకటిలోనే

అయ్యో విచారం వ్యక్తం
పోయిన ప్రాణం ఖరీదు కట్టే
చట్టం మాత్రం అలాగే
ఎన్ని నిరాహార దీక్షలు చేస్తేనేం
దున్నపోతు పై వాన కురిసినట్టే గా

ఆపరేషన్ అవగాహన లోపం
ఎవడు జవాబుదారీ
చంపూ డబ్బులు ఇయ్యి
కథా కమామిషు
ప్రశ్న నీ చంపూ లేదా
జైళ్లలో నింపు
కర్కశ రాజ్యం
మత్తు లో జోగుతున్న జనం
మీ వంతూ వచ్చే దాకా గాఢ నిద్ర నటించు
ఆ నటన లోనే మీ ఆఖరి ఫాయిదా జరూర్

Leave a Reply