ఓ రోగి
ఓ త్యాగి
జాగ్రత్త

శవాల చేతులతో
బంగ్లాలు కటించుకునే
కుభేరులున్నారు
జాగ్రత్త

పచ్చి మాంసాన్ని
పగడ్బందీగా పీక్కు తినే
గుంట నక్కలున్నాయి
జాగ్రత్త

కాలి కాలని
బొక్కల్ని మెడలో వేసుకుని
కరోనాని కాటికి పంపాలనుకునే
వైద్యులున్నారు
జాగ్రత్త

ఓ రోగి
ఓ త్యాగి
జాగ్రత్త

మున్నూట అరవై వేల కోట్ల
దేవుళ్ళున్న
ఈ పుణ్య భూమిలో
ఆర్థా నాధాలకి
ఆయుశ్శే లేదు
జాగ్రత్త

భారత్ మాత కి జై
అనే నినాదంలో
జై తెలంగాణ
అను నినాదంలో
ఈ దేశ చరిత్ర బందీ అయి
బ్రతుకు చాలిస్తున్నది జాగ్రత్త

ఊపిరి బిగబట్టుకుని
ఉద్యమించకుంటే
రేపటి భవిష్యత్ బర్తరఫే

ఓ రోగి
ఓ త్యాగి
జాగ్రత్త

నిషేధ రేఖలు
నిన్ను నిలువునా…
చీల్చాలనుకుంటాయి
జాగ్రత్త

Leave a Reply