“అబ్బా… వీవీకి బెయిలొచ్చింది, యేమైనా కోర్టుల వల్లే కాస్తో కూస్తో న్యాయం జరుగుతుంది”

“రెండువేల పద్దెనిమిది నుంచి జైల్లో పెట్టి విచారణ జరపకుండానే తీర్పు యివ్వకుండానే శిక్షాకాలం అమలు చేస్తున్నారు కదా?”

“ఔన్లే, యిప్పటిదాకా ఆయన మీద పెట్టిన యే కేసూ నిలబడలేదు”

“ఇప్పుడూ బీమా కోరేగాం కేసూ నిలబడదు. ఆల్రెడీ ఆర్సెనాల్ ఫోరెన్సిక్ సంస్థ అమెరికా వాళ్ళు రిలీజ్ చేసిన రిపోర్టులో కూడా పోలీసులు పెట్టిన ఎలిగేషన్లు కల్పితాలని, నిందితుల కంప్యూటర్లలోకి సాక్షాలని అక్రమంగా లోడ్ చేశారని చెప్పింది”

“ఎవరు యేమి చెప్పినా, మనం చెప్పిన రిజల్టు వస్తేనే మనం నమ్ముతాం, అదే నమ్మదగింది అవుతుంది”

“అమెరికా నాయకులు చెప్తే మన నాయకులు వింటారు. అమెరికా సంస్థ చెపితే వినరు, మర్చిపోతారు”

“ఔనూ… వీవీని పాస్ పోర్ట్ సబ్మిట్ చెయ్యమని అన్నారట…”

“విజయమాల్యా మొదలు నీరవ్ మోడీ లాంటివాళ్ళకయితే తిరిగి వీళ్ళే పాస్ పోర్ట్ అరేంజ్ చేద్దురు…”

“బొంబాయిలోనే వుండాలని కూడా షరతు…”

“హైదరాబాదాయనకు బొంబాయిలో వుండమంటే యిల్లెవరిస్తారు? ఆరునెల్ల తర్వాత అతేమిటో గతేమిటో అదీ తెలీదు…”

“కుటుంబ సభ్యులు తప్ప యెవరూ కలవకూడదట కదా?”

“ప్రజలే అతని కుటుంబం అని తెలీదు…”

“పోని అతని రక్త సంబంధీకులే కలవాలని అన్నా- వాళ్ళు వాళ్ళ వుద్యోగాలూ బతుకులూ వదిలేసి పిల్లల చదువులు వదిలేసి వచ్చి బొంబాయిలో వుండగలరా, యెంత కాలం?”

“స్నేహితులతో వుండడానికి కూడా లేదట. బైటివాళ్ళను కలవడానికీ లేదట. ఎవరెవరు వుండేది ఎంఐయ్యేకు ఫోను నెంబరుతో సహా యివ్వాలట…”

“పెద్ద తేడా లేదు”

“దేనికి?”

“జైల్లో వుండడానికీ బైట వుండడానికీ!”

“ఇప్పుడేమంటారో తెలుసా?, ఇన్నాళ్ళూ బెయిలూ బెయిలూ అన్నారు, యిస్తే చూశారా అని అంటారు”

“అదే బెయిలంటే”

“అదేం బెయిలూ?”

“ఉన్న చోట జైలు చెయ్యడమే బెయిలు!”

One thought on “జైలూ బెయిలూ!

Leave a Reply