దుఃఖ సంచారి చంద్రుడు
కలల్లా
పగులుతున్న వెన్నెల
ఈ సింహాసనానికి సిగ్గు నరం లేదు
ఒక చలన సౌందర్య
మానవ జీవ కళ
జీవితంలో తడుస్తున్నప్పుడు-
కళ్ళల్లో శిశిరం!
ఒక చిరునామా
జాతీయ జెండా నెత్తుటి దాహమై పోయింది
ఒక నిప్పుల కల మీద
ప్రవహిస్తున్న మృత్యువు
బువ్వ కుండలో
బుల్లెట్ చొరబడింది
రెక్కలు తెగిన చూపుల్లో
కుప్పకూలిన నవ్వులు
ఒక అకాల యుద్ధం పగలబడి నవ్వుతున్నా
కాలం
కన్నీళ్లు సానపడుతూ
ఒక అంతర్గత ప్రమాద కంపం
తొంగి చూస్తూ ఉంటుంది
దేశభక్తి నిధి
సామ్రాజ్యవాదం చీకట్లో కులుకుతున్నా
పొన్న పూలు రాలిపడిన
ధ్వని సుడుల్లో
దేశ దరిద్రం
మనసు విప్పు కుంటోంది