అది
తెలంగాణ నేల విముక్తి కోసం
సాగిన సాయుధ రైతాంగ పోరాట కాలమది
దేశ ముఖ చిత్రాన్ని కర్రు నాగలితో
చెక్కిన
వసంత మేఘ గర్జనలో
పల్లెలన్నీ తడిసాయి..
ఆ వర్షపు జల్లు
అన్ని పల్లెల్ని కలిపాయి..
ఆ ధార
గోదావరికి తాకింది..

నాటి
గొండ్వాన రాజ్యం
నుస్పూర్ సంస్థానం
మావో నాటే – మావో రాజ్(రాజ్యం) లో
పురుడోసుకున్న కటకం.!

ఎన్ని
అంతరాల దొంతరలున్న
వ్యవస్థలో
అతనో
ఒక నల్ల కలువ
ఈ నేల మాగానపు
నల్ల రేగడి
సింగరేణి
నల్ల బంగారంపు రుపు
ఈ దేశపు వెలుగు
అతను..

ఆరు పదులు దాటిన
నాలుగు పదుల ఉద్యమం
నాలుగు పాదాల రాజ్యాన్ని
దిక్కరించిన సుదర్శనం
అతను.

అతను
ఎవరని చెప్పాలి
ఒక విద్యార్థి ఉద్యమమనా..
ఒక సికాసా అనా..
ఒక రైతాంగ కార్యకర్త అనా..
నల్ల ఆదిరెడ్డి, రాజలింగం సోపతా
అతను ఎవరని చెప్పాలి.
ఎన్ని అని చెప్పాలి.
ఏమని చెప్పాలి

అతనో
ఉద్యమం
అతనో
యుద్ధ గీతిక
అతనో
విముక్తి బాట
అతనో
గెరిల్లా..
అతనే
కటకం సుదర్శన్
అతనే
పోరుబాటకు సుదర్శనుడు
విముక్తి నావకు దూలా దాదా..

Leave a Reply