ఏమిటో..
అంతా విచిత్రంగా ఉంది కదూ
ఎక్కడో నిశీధి చీకట్లను అలుముకొని
కూర్చున్న నేను
ఈ వసంతానికో వాన చినుకు నయ్యానంటే
నీకు నమ్మాలని లేదు కదూ
అయినా నాకు తెలుసు..
నీకు ప్రశ్నంటే నచ్చదని
అసత్యాన్ని ఆలింగనం చేసుకున్న
అన్యాయానికి అత్మీయుడవు నీవు
అహంకారపు అధిపతివి నీవు
మరి నీకు నిజాలు చెప్పేవారంటే
నిజాన్నిపాడేవారంటే
నిజం కోసం పోరేవారంటే
నీకు ఎలా గిట్టుతుంది
మది నిండా మతాన్ని
మతి నిండా పెట్టుబడిని పెట్టుకున్న
ప్రేతాత్మవి నీవు
నీకు స్వేచ్ఛ కోసం వేసే అడుగులంటే భయం
నీ భయమే నా ఆయుధం
అదే నా తుపాకీ
నా తుపాకీకి మనసుంది
ప్రపంచ ప్రేమకు నా తుపాకే చిహ్నం.
బావుంది