(2004 అక్టోబర్ 15 నుంచి19 దాకా అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి, రెండు విప్లవ పార్టీలకు మధ్య శాంతి చర్చలు జరిగాయి. దానికి సన్నాహంగా తెలుగు సమాజాల్లో ఒక గొప్ప భావ సంఘర్షణ జరిగింది. ఈ మొత్తానికి విప్లవోద్యమం వైపు నుంచి కా. ఆర్‌కె నాయకత్వం వహించాడు. శాంతి చర్చల నేపథ్యంలో 2004 జూలై నుంచి నడిచిన *చర్చ ఫర్ డెమోక్రటిక్ స్పేస్* పత్రిక బులెటిన్2(జూలై 25)లో ఆర్‌కె రాసిన వ్యాసం ఇది. పాఠకుల కోసం పునర్ముద్రిస్తున్నాం- వసంతమేఘం టీం)
ఈ వాదన కొందరికి ఆశ్చర్యంగానూ, అతిశయోక్తిగాను అనిపించవచ్చు. కాని, సామాజిక రుగ్మతలను, అసమానతలను, అన్యాయాలను రూపుమాపడంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి మౌలిక నమస్యకు పరిష్కారం చూపడంలో నక్సలైట్ల పాత్రను, 30 సంవత్సరాల పైబడిన వారి ఆచరణను వస్తుగతంగా పరిశీలించిన వారికి ఈ నిషేధం ఎత్తివేతకి – రైతుల ఆత్మహత్యల నివారణకి మధ్య వుండే గతితార్కిక సంబంధం చక్కగానే అర్ధం అవుతుంది. ఈ నిర్ధారణ కేవల ఊహాగానం కాదు. ఇది అసందర్భం, అతిశయోక్తి అని కొట్టిపారేయదగ్గ బలహీనమైన వాదన ఎంతమాత్రం కాదు! నక్సలైట్ల సిద్ధాంత రాజకీయ అవగాహనను, నిర్మాణాత్మక కృషిని విశ్లేషిస్తే రైతుల ఆత్మహత్యల నివారణకు నిషేధం ఎత్తివేత చర్య ఎంతగానో దోహదవడగలదని అర్థమవుతుంది. నక్సలైట్ల సిద్ధాంత రాజకీయాల్ని వ్యతిరేకించేవారు సైతం ఈ వాస్తవాన్ని కాదనలేరని చెప్పడం అతిశయోక్తి కాదు.
ఈ గతితార్కిక సంబంధాన్ని అర్ధం చేసుకోవాలంటే వర్గసమాజాల్లో పీడిత ప్రజలు ప్రభుత్వం నుండి, పాలకవర్గాల నుండి వేరుపడిపోయిన స్థితిని, వారు పరాయీకరణకు గురి అయిపోయారనే వాస్తవాన్ని ముందు మనం గ్రహించాలి!
రాజ్యం తన ఉదాత్తతను చాటుకోవడానికి ఎప్పటికప్పుడు ఎంతగా ప్రయత్నించినప్పటికీ, కొన్ని ప్రభుత్వ విధానాలు పీడిత ప్రజలకు సామాజికన్యాయం కల్పించేవి గాను, అసమానతలను, ప్రస్ఫుటంగా కనిపించేవాటిని రూపుమాపే లక్ష్యంతో కూడుకున్నవిగా చెప్పబడినప్పటికీ, రాజ్యాంగంలో బూర్జువా హక్కులు, వివిధరకాల వివక్షతల్ని శిక్షార్హమైనవిగా పరిగణించే చట్టాలు, విధానాలు అందులో పాందుపరచబడినప్పటికీ సమాజంలో వ్యవస్థీకృతం అయి వుండే దోపిడీసంబంధాలను ప్రభుత్వ యంత్రాంగం ద్వారానే మార్చడం అనేది అసాధ్యంగానే వుంటుంది. ఇది కాదనలేని వాన్తవం! ప్రభుత్వాధికారులు, పోలీసుయంత్రాంగం ధనవంతుల చెప్పుచేతుల్లోనే వుంటూ దోవిడీనంబంధాల మార్పుకి పెద్ద ఆటంకంగానే పనిచేస్తుంటాయి. ఈ నిజాన్ని అర్థం చేసుకోడానికి రెండు మూడు, ఉదాహరణలు చూద్దాం!
కులవివక్షతను మన రాజ్యాంగం శిక్షార్హమైన నేరంగానే పరిగణిస్తుంది. ‘అంటరానితనం’ నిర్మూలన అయిపోయినట్టు మన పాలకులు నిత్యం చాటింపు వేయించుకుంటారు. కాని, సామాజిక వాస్తవికత ఇందుకు భిన్నంగానే మనకు కనబడుతుంది. ‘అంటరానితనం’ అనేది దేశ సామాజిక వ్యవస్థకి పట్టిన పెద్ద చీడలా దేశంలో ఎక్కడ చూసినా అది నేటికీ మనల్ని వెక్కిరిస్తూనే వుంటుంది. హోటళ్ళలో దళితులకి వేరి గ్లాసులు, దేశంలో అనేకచోట్ల దళితుల దేవాలయ ప్రవేశ నిషేధం, అనేక గ్రామాలలో సమష్టి బావులలో నీళ్ళని దళితులు తాకరాదు, అగ్రవర్ణాలవారి ఇళ్ళల్లో దేనికీ దళితులకి ప్రవేశం లేదు – ఇలాంటి వివక్షతలు నేటికీ నిరాటంకంగా కొనసాగిపోతూనే వున్నాయి.
‘భూపరిమితి చట్టం’ చేసి దశాబ్దాలు గడిచిపోయాయి. నెహ్రూ కాలం నుండి భూసంస్కరణల అమలులో పాలకులు అలిసిపోతూనే. వున్నారు! కాని, ఆచరణలో జరిగింది శూన్యం! లేక అతికొంచెం మాత్రమే రాజ్యాంగం, సంబంధిత చట్టాలు ‘భూసంస్కరణల’ గూర్చి ఎంత పెద్ద హామీలు గుప్పించినా అవి అమలుకి ఏనాడూ నోచుకోలేదు. భూస్వాములు, ఉన్నతాధికారులు, రాజకీయనేతలు, పోలీసులు, ‘భూసంస్కరణల్ని’ నీరుగార్చి బూటకపు సంస్కరణలుగానే మిగిల్బారు!
లింగవివక్షతను అరికట్టడానికి కూడా లెక్కలేనన్ని చట్టాలు వచ్చాయి. “వరకట్న నిషేధవు చట్టం” వాటిలో ఒకటి. ఈ చట్టం వుండగా కూడా వరకట్న వేధింపు హత్యలు, ఆత్మహత్యలు జరగని రోజంటూ వుండదు. గర్బస్థ శిశువు లింగనిర్భారణను చట్టం నిషేధించింది… తల్లిగర్భం లోని శిశువుపై లింగనిర్ధారణ పరీక్షలు జరిపించి ఆడశిశువు అని తేలితే, పిండాన్ని తల్లిగర్భం లోనే హత్యచేయడం ఈనాడు సర్వసాధారణమైపోయింది. లింగవివక్షని చాటే ఇలాంటి ఉదాహరణలు ఎన్నయినా చెప్పాచ్చు!
ఈ వాస్తవాలు మనకు తెలియజేసేదేమంటే ప్రభుత్వం ఎంత మంచి చట్టం చేసినా అది ‘పైనుండి’ అమలు కాదనీ, ప్రజల చైతన్యాన్ని పెంచి పోరాటదిశలో వారిని సమీకరించడమొక్కటే మార్గమనీ మనకు అర్ధమవుతుంది. నేడు రాష్ట్రంలో పరంపరగా సాగుతున్న రైతుల ఆత్మహత్యల నివారణ కూడా ఈ కోవకు చెందినదే. కొత్తగా రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన నలభై దినాలుగా అనేక చర్యలు చేపట్టింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతుకుటుంబాలతో సహా అందరికీ కొత్త ప్రభత్వం కొత్తగా ప్యాకేజీ ప్రకటించడం, హామీలు ఇవ్వడం హర్షించదగ్గ విషయమే అయినా చివరికి ఆ సాయం ఎంతమంది బాధిత రైతులకి ముడుతుందో, ముట్టేదెంతో చెప్పడం కష్టం! అప్పులపై మారిటోరియం వ్రకటించడం, నకిలీ వురుగుమందులు నాసిరకం విత్తనాలు అమ్మకాలపై అమ్మేవారిపై కఠినమైన ఆంక్షలు చర్యలు, రైతులకు ఉచిత విద్యుత్ పంపిణీ, పాత బకాయిల బలవంతపు వనూళ్ళ నిలిపివేత, రైతుల ఉత్పత్తులకి మార్కెటింగ్ సౌకర్యాల కల్పన – ఇలాంటి పలురకాల ఉపళమన చర్యలు ప్రభుత్వం చేపట్టినా, ప్రభుత్వం ఇంకా ఎన్నెన్ని హామీలు ఇస్తున్నా ఇవన్నీ కూడా ఆత్మహత్యల పరంపరని ఆపలేకపోయాయి సరికదా అవి రాష్ట్రంలో రోజురోజుకి మహమ్మారిలా వ్యాపించిపోయాయి. ఎప్పుడూ పచ్చగా సుభిక్షంగా వుండే ప్రాంతాల్లో సైతం రైతుల ఆత్మహత్యలు సాగిపోవడాన్ని చూస్తే వ్యవసాయరంగంలో సంక్షోభం ఎంత ముదిరిపోయిందో, రైతుల నిరాశా నిన్సవాలు ఎంతటిస్థాయికి చేరిపోయాయో మనకు అర్ధమవుతుంది.
వ్యవసాయ సంక్షోభానికి నివారణగా, వరిష్కారంగా భూసంన్కరణల్ని ఖచ్చితంగా అమలుచేయడం, సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధానాలకి, సామ్రాజ్యవాద ఆర్థిక సంస్థల విషమ షరతులకి తలొగ్గకుండా వుండటం, వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు, ధరలు అమలుచేయడం, వ్యవసాయ పరికరాలు ఇతర వ్యవసాయావనరాలకు సబ్సిడీలందించడం, తగినంత సాగునీరు విద్యుత్ సరఫరా, రుణ నహాయాలను అందించడం, అప్పుల రుణభారం కింద నలిగిపోయే రైతుల్ని రుణవిముక్తి చర్యలతో ఆదుకోవడం – లాంటి రైతు అనుకూల విధానాలను, చర్యలను మనం ఈ ప్రభుత్వాల నుండి ఆశించడం అమాయకత్వమే! ఏమంటే ఇవి సామ్రాజ్యవాదుల, బడా భూస్వామ్య బడా పెట్టుబడిదారివర్గాలకి, బడా వ్యాపారులకి కొమ్ముకాసే ప్రభుత్వాలు కనుక! ఈ వ్యవస్థ చట్రంలో రైతాంగం ఎదుర్కొనే గడ్డుసమస్యలకు పరిష్కారం కనబడదు! అయినా కూడా ఈ పరిస్థితి తప్పనిసరిగా ఆత్మహత్యలకు దారితీయాల్సిన అవనరం లేదు. అలాంటి దుస్థితిని తప్పక అరికట్టవచ్చు. రైతుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసి వారిని ఆత్మహత్యల వైవు నెట్టివేసే భయంకర సమన్య అయిన రుణభార సమస్యను వర్గపోరాటం ద్వారా ఎదుర్కోవడం, సహకార సంస్థల నేర్పరచుకోవడం, వడ్డీ వ్యాపారులకు కల్తీవిత్తనాల, పురుగుమందుల విక్రయదారులకి వ్యతిరేకంగా వారితో లాలూచీపడే అవినీతిపరులైన అధికారులకి వ్యతిరేకంగా పోరాడే స్ఫూర్తిని రైతాంగానికి అందియ్యడం ద్వారానే రైతుల ఆత్మహత్యల్ని నివారించగలం.
ప్రజల నుండి వేరుపడిపోయిన పాలకవర్గ పార్టీలు వారి ప్రభుత్వ యంత్రాంగాలు ఎన్నెన్ని హామీలిచ్చినా కూడా ఇంకెన్ని ఉపశమన చర్యలు, పథకాలు చేపట్టినా కూడా రైతాంగ ప్రజల్లో పేరుకు పోతున్న నిరాశా నిస్పృహల్ని పోగొట్టడం, వారిలో మనోస్థయిర్యాన్ని కలిగించడం దుస్సాధ్యం అని వేరే చెవ్పనక్కళ్లేదు! ఈ పాలకవర్గ పార్టీలు, ప్రభుత్వాలు వైతుల్ని. నిరాశా నిస్పృహల నుండి బయటపడవేయజాలవు. రైతాంగ ప్రజల గుండెల్లో గూడుకట్టకొని ఉంటూ వారి మనోభావాలను, సమన్యలను, నారి మనోవేదనలను ‘అత్మీయతతో ఆర్ధం చేసుకునేవారు మాత్రమే వారికి అలాంటి ఆత్మస్టైర్యాన్ని అందించగలరు. రైతాంగం తమ హక్కుల కోసం, సమస్యల పరిష్కారం కోసం పోరాడాలనే స్ఫూర్తిని అందివ్వడం ద్వారానే వారిని ఆత్మహత్యలకు పురికొల్పే నిరాశామయ వాతావరణం నుండి బైటపడేయడం సాధ్యం! ఇది పైనుండి వచ్చిపడే ఆదేశాల ద్వారానే హామీ వర్షం ద్వారానే ఇది సాధ్యమైపోదు. నిస్వార్థంగా కింది నుండి పనిచేసే కార్యకర్తలతో కూడిన మూలాల్లో స్థానం ఏర్పరచుకొని పనిచేసే పార్టీకి మాత్రమే ఇది సాధ్యం. వర్గపోరాట పంథాననుసరించి విప్లవకర పార్టీకి ఇది సాధ్యం.
మన రాష్ట్రంలో ఇప్పుడు ఇలాంటి శక్తి, స్వభావాలతో ఉంటున్న ప్రముఖ పార్టీ పీపుల్స్‌వార్ పార్టీయేననేది కాదనలేని వాస్తవం. దశాబ్దాల తరబడిగా రాష్ట్రంలోని పీడిత వ్రజాబాహుళ్యంలో మరీ ముఖ్యంగా విస్తృత రైతాంగ ప్రజల్లో పార్టీ కార్యకర్తలు, రైతాంగ సాయుధ దళాలు వేళ్ళూనుకొని ఉన్నాయి. నిత్యనిర్పంధాల మధ్య కూడా మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, వారి సాయుధ దళాలు రక్తార్పిత త్యాగాలు చేస్తూ ప్రజలతో మమేకమై వుంటూ వారిని అంటిపెట్టుకునే వస్తున్నారు. ప్రజల సమస్యలను తీర్చగల పార్టీ పీపుల్స్‌వార్ మాత్రమేననే ముద్రని మా పార్టీ విసృత ప్రజల్లో వేయగలిగింది. అలాంటి నిస్వార్ధ సేవానిరతి, పోరాటశీలత గల క్యాడర్‌ను పాలకవర్గ పార్టీల్లో ఏ ఒకదాంట్లోనూ. చూడలేరు. ఇక పాలకవర్గ పార్టీ నాయకత్వాన సాగే దోపిడీ స్వభావాన్ని, అవినీతి భాగోతాల గూర్చి చెప్పనే అక్కళ్లేదు. చాలామంది నిరుపేద ప్రజలలో పీవుల్స్‌వార్ పార్టీకి ఆపన్నుల్ని ఆదుకునే ఒక జానపద కథానాయకుడి లాంటి ముద్ర (ఇమేజ్) ఉంది. మేము నిర్వహించే కరువుదాడులు, క్రూరులైన భూస్వాములకు, వడ్డీ వ్యాపారులకు వ్యతిరేకంగా మేము చేసే పోరాటాలను, మేం నిర్వహించే ప్రజాకోర్టులు, పార్టీకి అలాంటి ఇమేజ్‌ని కలిగించాయి. పీడిత ప్రజల పక్షపాతపార్టీగా ‘ప్రజల సాధికారతను సంపాదించుకుంది మా పార్టీ. ప్రజల మధ్య తలెత్తే ఆంతరంగిక వైషమ్యాల్ని వైరుధ్యాల్ని పరిష్కరించడంలో కొన్ని సందర్భాలలో అతిగా పోయి అమాయకుల్ని శిక్షించారనే ఆరోపణలు, అన్యాయమైన తీర్పుల్ని రుద్దారనే అభియోగాలు లేకపోలేదు. కాని అలాంటి పొరపాట్లు ఒక ధోరణిస్థాయిలోనే వున్నట్టు మా పార్టీ ‘ప్రబలశత్రువులు సైతం ఆరోపించలేరు! ధనబలం, అధికారబలం, కండబలం వుండే దోపిడీశక్తులకు వ్యతిరేకంగా పీడిత ప్రజల పక్షాన దృఢంగా నిలిచిపోరాడటమే మా పార్టీ ప్రదర్శించుకునే పదే పదే రుజువు బేసుకొనే దాని ప్రధాన ధోరణి! కనుకనే మా పార్టీ కార్యకర్తలతో, సాయుధ దళాలతో సామాన్య ప్రజలు తమ బతుకు బాధల్ని, గుండె ఘోషల్ని నిర్భయంగా స్వేచ్ఛగా పంచుకోగలుగుతారు. కుప్పకూలిన రైతుల్ని ఆదుకోవడం సంగతలా వుంచి ‘అయ్యో!’ అంటూ అక్కున చేర్చుకొని ఓదార్చే వారే లేకుండా పోయారు. అలాంటి దుస్థితిలో పడిన రైతాంగంపై ‘గోరుచుట్టపై రోకటి పోటు’లా అప్పులిచ్చిన భూస్వాములు, వడ్డీవ్యాపారులు, బ్యాంకు యాజమాన్యాల సాధింపు వేధింపులు ఆస్తుల జప్తలు అరెస్టులు అక్రమకేసులు, జైలు నిర్బంధాలు… వీటితో ఆత్మాభిమానమే ఏకైక ఆస్తిగా మిగిలిన రైతులు అవమానభారాన్ని భరించలేక ఆత్మహత్యల్ని ఆక్రమించారు.
తమకు ఆప్పులైనవారితో మాత్రమే రైతులు తమ బతుకుబాధల్ని గంండెఘోషల్ని కలబోసుకుంటారు. పీపుల్స్‌వార్ పార్టీ రైతులతో అలాంటి సాన్నివాత్యాన్ని పెంచుకుంది, పెనవేనుకుంది. కనుకనే ‘ఆకలితో చావడంకన్నా పోరాటంలో మరణించడం మేలు’ అనే నినాదంతో అది రైతాంగ ప్రజల్లో పోరాట ఉత్సాహ, ఉత్తేజాల్ని రగిలించగలిగింది. వైతాంగంలో ఎనలేని గుండెనిబ్బరాన్ని నింపగలిగింది. పూర్వంలా మా పార్టీ గ్రామీణ ప్రాంతాలలో విసృత రైతాంగ ప్రజల మధ్య స్వేచ్ఛగా తిరుగాడగలిగితే చాలు రైతుల ఆత్మహత్యల పరంపర దానికదిగానే ఆగిపోగలదు. మా పార్టీపై వుంటున్న నిషేధాన్ని ఎత్తేసి, మా తలలపైని వెలల్ని రద్దు చేసేసి, వార్ కార్యకర్తలు ప్రజలవద్దకు వెళ్ళడంపై వుండే అన్నిరకాల ఇంక్షల్ని రద్దుచేసేస్తే, పోలీనులు గాలింవులు వేధింపులు హత్యాకాండలకి న్వస్తి చెప్పి, నక్సలైట్లు ప్రజల మధ్యకు స్వేచ్ళగా వెళ్ళే వాతావరణాన్ని కల్పిస్తే చాలు! వారు రైతుల్మో ఇతర పీడిత తాడిత ప్రజలలో నూతన ఆశల్ని నూతనోత్సావోన్ని చిగురింపజేయగలరు. వారిలో ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరించగలరు, వారిని ఆత్మహత్యలకు దూరం చేయగలరు. కల్తీవిత్తనాలు, ఎరువులు, పురుగుమందుల అక్రమ విక్రయాల్ని అతినులువుగా అదుపు చేయగలరు. రైతులను నిర్ధాక్షిణ్యంగా దోచుకు తినే కాబూలీవాలాల్ని కట్టడి చేయగలరు. దోపిడీ రాజకీయనాయకులు వారి ప్రభుత్వ యంత్రాంగాలు చేయాల్సిన, చేస్తామని వారు పదే పదే నమ్మబలుకుతున్న, కాని వారు ఏమేరకు కూడా చేయలేకపోతున్న రైతాంగం కోరుకునే అనేక న్యాయమైన చర్యల్ని మేం చేపట్టగలం. ఖచ్చితంగా వాటిని అమలు చేయగలం! రైతుల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం ఏర్పరచిన “హెల్ప్‌లైన్లు’ రైతులకు నిజమైన హెల్ప్ ని (సహాయాన్ని ) అందించలేవు! సామ్రాజ్యవాద ప్రపంచీకరణ నేపథ్యంలో రోజురోజుకీ తీవ్రమవుతున్న వ్యవసాయ సంక్షోభ స్థితి రైతుల్ని ఇంకా ఎక్కువగా ఆత్మహత్యలవేపు నెట్టివేయడం అనేది తప్పనిసరిగా జరిగే ఒక భయానక పరిణామం అని మనం గుర్తించాలి. రైతులనే కాదు, చేనేత కార్మికులు తదితర మిగతా ప్రజారంగాలన్నింటికీ ఈ మహమ్మారి వ్యాపించనుంది. క్రిందినుండి జరిగే. తీవ్రకృషి ద్వారానే (Serious grossroot Activity) ఈ వివరిణామాలకి అడ్డుకట్టలు వేయగలమని గుర్తించాలి!
వాస్తవ వరిస్థితిని ఈ లోతుల్లో అర్ధం చేసుకుంటూ రాష్ట్రంలోని రాజశేఖరరెడ్డి ప్రభుత్వం పీపుల్స్‌వార్ పార్టీపై నిషేధాన్ని ఎత్తివేసే విషయంలో ఎలాంటి తటవటాయింవులుకి గురికారాదు!“కాల్పుల విరమణ” విషయంలో లాగానే ఈ విషయమై కూడా చొరవ ప్రదర్శించాలి! ఇక మేము కూడా గ్రామీణ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళి ఏ ఒక్కరికీ ‘ప్రాణహాని తలపెట్టకుండా మా ప్రజామోదకర పంచాయితీల ద్వారా అశేష రైతాంగ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం! శాంతియుత పద్ధతుల్లోనే ప్రజలను చైతన్యపరుస్తూ, వారిని పోరాటాలలో నమీకరిన్తూ రైతాంగ ప్రజల్ని కాల్చుకుతినే తోడేళ్ళ లాంటి జలగల్లాంటి దోపిడీగాళ్ళని ప్రజలముందు నిలబెట్టి బుద్ది చెపుతాం! రైతులు నిసహాయంగా అత్మహత్యలకు పాల్పడకుండా వారిని అడ్డుకొని ఆదుకొని వారిలో బతుకుపై ఆశల్ని రేకెత్తించడం, వారిలో కొత్త ఉత్సాహ, ఉత్తేజాన్ని రగిలింపజేయడం మా సామాజిక బాధ్యతగా స్వీకరిస్తాం. ప్రజల ప్రయోజనాలు, తప్ప వేరే ప్రయోజనాలు లేవని చాటిచెప్పుకునే మా పార్టీ ఈ సామాజిక బాధ్యతను తప్పక భుజాన్న ఎత్తుకోగలదని చెప్పగలం!
అయితే కొత్త ప్రభుత్వ వైఖరి సైతం ఇందుకు, ‘దోహదపడేదిగా ఉండాలి!
మా పైని నిషేధాన్ని ఎత్తివేసే విషయంలో, మా తలలపైని వెలలను రద్దుచేసే విషయంలో రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అనవసర మీమాంసను ప్రదర్శిస్తోంది! ‘కాల్పుల విరమణ” విషయంలో ప్రదర్శించిన లాంటి చొరవను ప్రదర్శించలేకపోతోంది! లాంఛనప్రాయమైన చర్చల ప్రక్రియ. ప్రారంభానికి ముందే నిషేధం ఎత్తివేత జరగాలి! అప్పుడు చర్చల ప్రక్రియ చురుకుదనాన్ని సంతరించుకుంటుంది. ఫలప్రదం అయ్యే దిశలో కొనసాగుతుంది! కేంద్రంలో ‘పోటా’ లాంఛనంగా. రద్దుకాకుండా ఇక్కడ రాష్ట్రంలో పీవుల్స్‌వార్ పైన నిషేధం రద్దుని అమలుచేయడం సాధ్యమా అనే తర్కానికి ఇక్కడ తావే లేదు. ఎందుకంటే – ఈ రద్దు చర్య అనేది ప్రధానంగా రాష్ట్రంలో ప్రభుత్వం – పీవుల్స్‌వార్ పార్టీల మధ్య నెలకొన్న పరస్పర అపనమ్మకం(miatrust) తో కూడిన వాతావరణాన్ని చర్చల పురోగమన దిశలో అధిగమించే చర్యగా, వుంటుంది. మధ్యయుగాలలో వ్యూడల్ రాచరిక వ్యవస్థలో వుంటుండిన ‘తలలకు వెలలు’ లాంటి. అనాగరిక విధానాన్ని రాజశేఖరరెడ్డి ప్రభుత్వం నిస్సంశయంగా తక్షణమే ఉపసంపరించుకోవాలి!
అప్పుడిక త్యాగం, అంకితభావం, పోరాటస్సూర్తి ప్రదర్శిస్తూ మేము గ్రామాలలో రైతాంగ ప్రజల మధ్య స్వేచ్ఛగా చురుగ్గా పనిచేయగలుగుతాం. రైతాంగాన్ని ఆవహించిన నిలువెత్తు నిరాశా నిస్నృహల నుండి వారిని బయటపడవేయగలుగుతాం. వారిలో ఆత్మస్థయిర్యాన్ని రగిలించగలుగుతాం. రైతుల ఆత్మహత్యల పరంపరకి ఖచ్చితంగా అడ్డుకట్టలు వేయగలుగుతారు. యావత్ సమాజం నంతోషించదగ్గ, గర్వించదగ్గ, ఆహ్వానించదగ్గ ఒక కొత్త వాతావరణాన్ని సృష్టించ గలుగుతాం! తద్వారా మేము బలపడిపోతాం. మేము బలపడిపోకుండా ప్రభుత్వమే కాదు, ఇంకే శక్తీ మమ్మల్ని అడ్డుకోలేదు. ఏమంటే విశాల ప్రజల ‘ప్రయోజనాలతో వారి ఆశలు ఆకాంక్షలతో ముడిపడి వుండే విషయం అది కనుక! వార్ బలపడాలని రైతులు ఇతర పీడితప్రజలు కోరుకుంటే, వారంతా దాన్ని తమ అవసరంగానే భావిస్తే అలా “వార్ బల పడడాన్ని ఎవరూ తప్పుపట్టలేరు, నిరోధించలేరు! పోతే కేవలం నిషేధం కారణంగా పీవుల్స్‌వార్ బలహీనపడిపోయిందని చెప్పగలిగే రుజువు సాక్ష్యాలు ఎవరిదగ్గర గాని ప్రభుత్వం వద్ద గాని వున్నాయా? లేవు! నిషేధం నిర్బంధాల మధ్య కూడా మేం ప్రజల మధ్యనేవున్నాం, బలపడుతూనే వున్నాం.
కనుక నిషేధం ఎత్తివేస్తే మా పార్టీ కొత్తగా బలపడిపోతుందనే కుతర్కాల్ని కుంటి సాకుల్ని గురుతు చేయకుండా ప్రజల ఆకాంక్షల ప్రాతిపదికగా చూస్తూ ప్రభుత్వం పీపుల్స్‌వార్ పార్టీ పైన నిషేధాన్ని తక్షణం ఎత్తివేసి, చర్చల ప్రక్రియ అర్ధవంతంగా సాగేందుకు సహకరించడం ద్వారా రాష్ట్రంలో పరంపరగా సాగిపోతున్న రైతుల ఆత్మహత్యలను నివారించడంతో పాటు, ఇతరత్రా ముఖ్యమైన ప్రజా సమస్యల్ని సాధ్యమైనంత సంతృప్తికరం గాను, సత్వరంగాను పరిష్కరించడానికి ప్రభుత్వం తన మార్గాన్ని సుగమం చేసుకోవాలి!
రచనాకాలం : జులై 8, 2004.