నేను ఎవరినంటే
పుట్టుకతో ప్రమేయం లేనివాడిని
మరణంతోనూ ప్రమేయం ఉండీ లేనివాడిని
మధ్యకాలంలో నేను,
నేనే!
గత నా మానవసారాన్ని అకళింపు చేసుకుంటున్నవాడిని
గతం వర్తమానంలోకి ఎగబాకిన వైనాన్ని అధ్యయనం
చేస్తున్నవాడిని
వర్తమానం భవిష్యత్‌లోకి పురోగమించే గతిశీలతను
విశ్వసించినవాడిని
అందుకే నేను
చరిత్ర పురోగమిస్తుందని నమ్మినవాడిని
ఆ చరిత్ర పురోగమనంలో భాగమైనవాడిని
చరిత్రను నడిపించే చోదకశక్తిని
ఇక ఇప్పుడు
నేను ఎవరినంటే,
నేను కమ్యూనిస్టును – విప్లవ కమ్యూనిస్టును.
చరిత్ర పురోగమిస్తుందని నమ్మిన వాడిని