డిసెంబర్ 13 , 2023 న షుమారు 1.01 గంటలకు ఇద్దరు వ్యక్తులు పార్లమెంటులో ప్రమాదం లేని పొగ వ్యాపింప చేయడం ద్వారా తీవ్ర అలజడి సృష్టించారు. ఈ ఘటన దేశ వ్యాపిత సంచలన వార్తా.
ప్రమాదాన్ని ఊహించటం, చిలవలు పలావులుగా వర్ణించటం లో మీడియా సంస్థలు పోటీపడ్డాయి. వారు అలజడి సృష్టించారు కానీ ఎ ఒక్కరికి హాని తలపెట్టలేదు. ఆస్తులు విధ్వంసం చేయలేదు. మన పార్లమెంటు సభ్యులు మాత్రం ఆందోళనకు గురై ఆ వ్యక్తులను చితక బాదారు. పోలీస్ నైజం ప్రదర్శించారు. పార్లమెంట్ లోకి ప్రవేశించిన ఇరువురు, వారికి సహకరించిన మరో నలుగురు తమ భావాలను తెలియజేసే ప్రయత్నమే చేసారు. ఎవరిని వ్యక్తి గతంగా వ్యతిరేకించటం, దూషించటం జరగలేదు. కొందరు పార్లమెంటు సభ్యులు దానికి మైసూర్ బి జే పి ఏం పి ప్రతాప్ సింహ, అధికారపార్టీ కారణం అని రాజకీయలబ్ది కోసం ఆరాటపడ్డారు . ఇదే అవకాశం గా ఆక్రోశించి ఆవేశపడ్డారు . లోక్ సభ లోకి అక్రమం ప్రవేశించటం లేదా ప్రవేశాన్ని దుర్వినియోగ పరచటం, పొగవదలటం వారుచేసిన నేరం. దాన్ని పార్లమెంటు పై దాడి అని అభివర్ణించడం ఎంతవరకు సబబో విజ్ఞులు, మేధావులు ఆలోచించాలి. వీరి పై ఉపా నేరాన్ని మోపటం అత్యంత దారుణం . ఈ ఆందోళన కారుల పట్ల ప్రభుత్వం వ్యవహరించే విధానం ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏ నిర్బంధ చట్టాలకు వ్యతిరేకంగా వారు నినదించారో అదే చట్టం ద్వారా వారిపై పోలీస్ చర్య తీసుకోవటం అత్యంత దారుణం. ఈ ఘటన కచ్చితంగా భద్రతా వైఫల్యమ్ కూడా ఒక కారణం ఆ వైఫల్యం ఎంతవరకు నివారించ వచ్చు. గ్యాలరీలోకి వచ్చే వ్యక్తుల మెదళ్ళ శోధించటం సాధ్యమా! యిదే పనిని ఏం పి చేయగలరా! కనుక వారినే పూర్తి బాధ్యులను చేయడం ఎంతవరకు సబబు? ప్రజలు ఆలోచించాలి. ఈ సంఘటనలో దర్యాప్తు అధికారుల బాధ్యత వేరు.పార్లమెంటు బాధ్యత వేరు.కనీసం ఏ రాజకీయ పార్టీ, పార్లమెంటు సభ్యులు ఆందోళన కారులు లేవనెత్తిన అంశాల పై ఎందుకు నోరు మెదపరు ? పార్లమెంటులో అంతా సవ్యంగా జరిగితే ఈ ఘటన ఎందుకు జరిగింది ? ఘటనకు కారణం అయినవారు విద్యావంతులు, పిచ్చివాళ్లు కాదుకదా! సహేతుక మైన కారణాన్ని కనుగొనాలి కదా! భారత ప్రజాస్వామ్య ప్రాధమిక హక్కుల గూర్చి ప్రస్తావించిన వారి ఆందోళన పార్లమెంటుకు పట్టదా ? చర్చ జరిపితే దేశద్రోహులుగా ముద్ర వేస్తారనే అనుమానమా, భయమా!
ఆందోళన కారుల ఆ సమయంలో చేసిన నినాదాలు పరిశీలిద్దాం. “రాజ్యాంగాన్ని రక్షించుకొందాం “రాజ్యాంగ విలువలు కాపాడుకుందాం “మణిపూర్ హింసాకాండను వ్యతిరేకిద్దాం “నల్ల చట్టాలను రద్దు చేయాలి ” ఇవి పార్లమెంటు మొత్తని ఉద్దేశించి చేసినవి.ఇవి అన్ని నిస్వార్ధమైనవి .స్వలాభం కోసం చేసినవి యెంత మాత్రము కావు. యావత్ ఘటనను దేశ వ్యాపిత ప్రజానీకం చూశారు. సమస్యను ఎత్తి చూపిన మార్గం మాత్రం ఆపేక్షణీయం. యావత్తు పార్లమెంటు ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడటంలో చెందిన వైఫల్యాల మూలంగా తాము ఈవిధంగా ప్రవర్తించినట్లు వారు మీడియా ముందు వ్యక్తీకరించారు .నైతిక బాధ్యత వహించాల్సిన పార్లమెంటు సభ్యులు తన్ని పోలీసులకు పట్టించిన దానిపై పెదవి విప్పలేదు. ఆందోళన కారులకు తాము ఏ ప్రజల కోసం ఈ చర్యలకు పాల్పడ్డారో ఆ ప్రజల నుండి తగిన మద్దత్తు మాత్రం లభించలేదు. అందుకు కారణం ప్రస్తుతం అధికారం లో వున్నా ప్రభుత్వమే కారణం. నిరసనను, విమర్శను, అభిప్రాయాలను, ఆలోచనలను శాంతియుత పద్దతిలో జరిపే ఆందోళనలను సహితం దేశద్రోహపు చర్యలుగా పార్లమెంటులో చట్టాలను రూపొందించటం ఈ చర్యలకు ప్రధాన కారణం. సుప్రీం కోర్టు, హైకోర్టు లు ఎటువంటి కేసుల విచారణ సమయం లో వ్యాఖ్యలు ఒకరకంగా, తీర్పులు మరోరకంగా ఉండటం దేశంలోని ప్రజాస్వామి వాదులకు ఆందోళన కలిగిస్తున్నాయి.
నాటి స్వాతంత్ర పోరాటాలను రక్తపుటేరులతో ముంచిన బ్రిటిష్ సామ్రాజ్య వాదులు నిరంకుశ నిర్బంధ చట్టాల ద్వారా మనలను ఏలారు. అదే విధమైన పోకడను నేడు మన పార్లమెంటు అనుసరిస్తున్నదని ఆందోళన కారుల అభిప్రాయం.అందుకే నాడు భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ ,సుఖ్ దేవ్ మొదలగు వారు అనుసరించిన మార్గంలో ఇటువంటి చర్యకు పాల్పడి ఉండవచ్చు. మనకు మన పాలకులకు వారు ఆరాధ్యులే కానీ ఆచరణీయులు కాదు. అందుకే నాడు భగత్ సింగ్ వగైరాల మీద మోపిన కేసులే వీరిపైనా మోపారు. ఒక వైపు గాంధీ గారి వారసులం, మాది అహింసా మార్గం అని చెప్పుకునే పాలకులు, పార్లమెంటు ఇంత క్రూరమైన, నిరంకుశ మైన చట్టాలకు నిలయంగా ఎందుకు మారింది. ఇదేనా డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ వ్రాసిన రాజ్యాంగం. రాజ్యాంగ సవరణల పేరట రాజ్యాంగ స్ఫూర్తిని పార్లమెంటు నిర్వీర్యం చేయటం లేదా ? గతం లొ ఇదే “ఉపా “కేసు అరెస్ట్ సందర్భగా నేటి మన భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్ట్ న్యాయ మూర్తి జస్టిస్ చంద్ర చూడ్ వ్యాఖ్యలు గుర్తు కోస్తున్నాయి. ప్రెజర్ కుక్కర్ హీట్ ఎక్కువైతే పేలిపోతుందని. ఎటువంటి అప్రజాస్వామిక చట్టాల వల్ల ఎటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి కైనా పార్లమెంటు ఎటువంటి నిర్బంధ చట్టాలను సమీక్షించలి. డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తి కి అనుగుణంగా ప్రజాస్వామిక విలువల్ని కాపాడుకోవాలి. పార్లమెంట్ లో అలజడికి కారణమైన ఆరుగురి పై “ఉపా “ని ఎత్తివేసి సాధారణ ఐ పి సి తదితర చట్టాల ద్వారా నేరవిచార జరపాలి.ప్రపంచం లో ఏ దేశంలో నియంతృత్వం ద్వారా పాలకులు పరిపాలన ఎక్కువ కాలం కొనసాగించలేడు.
Chandrasekhar garu
U r wrong. Sir -whatever u r stand —u donot go inside parliament /
Needs respect /honour /SMOKE /SLOGANS ARE NOT RIGHT
SECURITY IS MISSING —NEEDS WAKE UP CALL
THEY CROSSED THE LINES — NEEDS PUNISHMENT
——————BUCHIREDDY GANGULA