నీవు నాకు
నేను నీకు
ఎన్నటికీ దూరం కాదు

నీ ప్రతి
ఉచ్ఛ్వాస నిశ్వాస‌లో
మాత్రమే కాదు

నీ కన్నీటి
చుక్కల్లోనే కాదు

నీ ఆనంద
క్షణాల్లోనే కాదు

నీ అంతర్మథ‌నంలోనే కాదు

నీవు నేనుగా
నేను నీవుగా
తొలి చూపులోనే
తొలి స్పర్శలోనే
ఏకమై ఉన్నాము

ఏ నిర్భంధ‌మూ
మనలను విడదీయలేదు

మనం
మృత్యుంజయులం
మన ప్రేమా
అజరామరం.

Leave a Reply