వస్తున్నారొస్తున్నారు
ఖద్దరు బట్టలేసి
కహానిలు చేప్పనికి
దొంగ లీడర్లంతా
డోచోకొని తినడానికి
వస్తున్నారొస్తున్నారు
మీ నోటికాడి ముద్దలాగి
ఓటునడగడానికి వొస్తున్నరొస్తున్నారు
పాత లీడరొచ్చి
మళ్ళీ ఛాన్స్ ఆడిగినాడు
కొత్త లీడర్
ఒక్క ఛాన్స్ అడిగినడు
పాత లీడర్ పార్టీ
పనేమిచేసింది లేదు
కొత్త లీడేర్ పార్టీ
కొత్తగా చేసేదేం లేదు
అన్ని పార్టీలు కలిసి
అందినకాడికి దోచేవే
వస్తున్నారొస్తున్నారు
70 ఏండ్ల నుండి
ప్రజలను దోచుకునేదొక పార్టీ
పొద్దంతా పొత్తులకోసం
ఎదురుచూసేదొక పార్టీ
కులం పేర మతం పేర
చిచ్చుపెట్టేదోక పార్టీ
సెంటిమెంట్ తోని
చక్రం తిప్పేదొక పార్టీ
వస్తున్నారొస్తున్నారు
ఓట్లకోసం వస్తారు
ఉద్యోగం ఊసేత్తరు
నీళ్ల జాడలేదు
నిధుల జాడలేదు
నైజాము దొరగాళ్లను
ఉరికించిన తెలంగాణ
అధిపత్యకుల భూస్వాముల
తరిమేసిన తెలంగాణ
తెగువని ఒడిసిపట్టాలె
తెలంగాణ ప్రజల ఎజెండాను
పాలకుల ముందుంచాలే
స్వేచ్ఛహక్కులు
విరజిల్లే తెలంగాణ
నిర్మించుకోవాలే.
Related