గత ఒకటి-ఒకటిన్న దశాబ్దాల్లో మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న దేశంలో, 2014లో ఆత్మహత్యల రేటు సగటున రోజుకు 52 అయిన చోట, దాదాపు 80లక్షల రైతులు వ్యవసాయం వదిలేసిన చోట, ఈ విషయంపై నలుదిశలా ఆవరించిన నిశ్శబ్దం భయానక భవిష్యత్తును, ప్రమాదకర ఆర్డిక-రాజకీయాలను సూచిస్తుంది.

ఒక్క వాక్యంలో చెప్పాలంటే సీనియర్‌ నవలాకారుడు సంజీవ్‌ రాసిన కొత్త నవల “ఫాస్‌” (ఉరి) ఈ భయానక నిళ్ళబ్దం, మానవద్వేష ఆర్థిక-రాజకీయాలకు వ్యతిరేకంగా వేసిన ఒక పెనుకేక. నిజానికి వ్యవసాయం ప్రభుత్వాల, అధికార అంగాల ఆలోచనలూ, పథకాలకు మాత్రమే కాదు మధ్య తరగతి అవగాహనకు కూడా చాలా దూరం. ఏ మధ్యతరగతి భారతీయ గార్హియన్‌ వ్యవసాయాన్ని తమ పిల్లలు కెరియర్‌గా ఎంచుకోవడం గురించి ఆలోచించరు. పిల్లల ఫ్యాషన్‌ షోలో తన పిల్లవాడిని ‘రైతు’ రూపంలో చూపించాలని ఏ మధ్య తరగతి తల్లికీ ఊహకు కూడా రాదు. గ్రామీణ భారతం పట్ట ప్రజాస్వామ్యపు నాలుగో స్థంభమని చెప్పబడే మీడియా అవలంబిస్తున్న నేరపూరిత విస్మరణ దాని పతనపు చరమదశకు ఒక సంకేతం, ఒక లక్షణం. దిల్లీకి చెందిన సంస్థ – సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ ఇటీవలి రిపోర్టు ప్రకారం దేశంలో అ(గ్రస్టానంలో వున్న ఆరు వార్తా పత్రికల్లోని మొదటి పేజీల్లో (గ్రామీణ భారతానికి 0.18 శాతం చోటు దొరుకుతున్నది. దేశంలోని ఆరు పెద్ద వార్తా ఛానెల్స్‌ ప్రైమ్‌ టంలో 0.16 శాతం చోటు దొరుకుతున్నది. ఇటువంటి నేపథ్యంలో రైతుల ఆత్మహత్యల పట్ట వహిస్తున్న “నిశ్శబ్దం అనే నేరంలో (ప్రభుత్వాలూ, అధికార అంగాలే కాదు మనందరం భాగస్తులంగా కనబడుతాం.

 ‘ఆధునిక కథ’ కాలం నుండి కథా సాహిత్యంలో “గ్రామం, రైతులు” అంచులకు నెట్టి వేయబడ్డారు. ‘ఆధునిక కథ” నేతలు పట్టణ మధ్యతరగతి-నిమ్న మధ్య తరగతికి చెందిన వాళ్లు. వాళ్లు అనుభవించిన యధార్హం ఇదే. అందుచేత నెత్తురు తాగే వర్గంతో అవినాభవ సంబంధం” వున్న మధ్యతరగతి హిందీ కథా సాహిత్యంపై ఆధిపత్యం సంపాదించింది. ఆ కాలంలో (గ్రామాల, రైతుల జీవితం గురించి రాస్తున్న రచయితల కథలను తరచుగా చర్చకు ఆవల పెట్టేశారు. ఆ తర్వాత 70 దశకంలో నిస్సందేహంగా నక్సల్బరీ పోరాటం, (ప్రజాస్వామ్య, నూతన ప్రజాస్వామ్య సాహితీ-సాంస్కృతిక ఉద్యమం ప్రభావం కారణంగా రైతులూ-కార్మికులు, ఆదివాసుల ఉద్యమ కథలు ముందుకు వచ్చాయి. కానీ 80వ దశక ఉత్తరార్థంలో తిరిగి ఆధునిక కథపై పట్టణ మధ్య తరగతి ప్రభావం ‘పైచేయి సాధించడం మొదలుపెట్టాయి. మారిన పరిధులూ, దేశ-కాలాలూ, స్వప్నాలూ, ఆశలూ-ఆకాంక్షలూ, నిరాశా-అసంతృప్ప్తులతో మధ్యతరగతి ప్రధాన స్రవంతికి చెందిన కథా సాహిత్యంపై తన ఆధిపత్యాన్ని నెలకొల్పింది. సాహిత్యం, కళలకు చెందిన అన్ని (ప్రక్రియల నుండి రైతులూ-కార్మికులు బహిష్టృతులయ్యారు. అన్ని కాలాల్లోని నిస్సందేహంగా మినహాయింపులున్నాయి. ‘గోదాన్‌” తర్వాత ‘మైలా ఆంచలోలో మారుతున్న వూరు ముందుకు వచ్చింది. రాహీ మాసూంరాజా రాసిన ‘ఆధా గావ్‌, శ్రీలాల్‌ శుక్లా రాసిన ‘రాగ్‌ దర్చారీ, వీరేంద్ర జైన్‌ రాసిన’డూబ్‌, ‘పారొలలో తమ తమ విభిన్న రూపాల్లో గ్రామీణ ప్రాంతాన్ని వ్యక్తీకరించారు. మార్కేండేయ్‌ శేఖర్‌ జోషి, శైలేష్‌ మటియానీ, మధుకర్‌ సింహ్‌, సంజీవ్‌, శివ్‌మూర్తి, విజేంద్ర్‌ అనిల్‌, సురేష్‌ కాంటక్‌, రామ్‌దారీ సింహ్‌ దివాకర్‌, చంద్ర కిశోర్‌ జాయ్‌స్వాల్‌, శైవాల్‌ తదితరుల కథల్లో కూడా ఊరు వుంది. తన సుఖం, దుఃఖం, నవ్వు, సంతోషం, విషాదం, పరిహాసంతో సంపూర్ణమైన ఊరు. కానీ మధ్య తరగతి వృత్తాంతపు గాలి దుమారంలో ఊరి కన్నీరూ, నవ్వూ అన్నీ ఎక్కడో మాయమయ్యాయి.

ఈ నిర్లక్ష్యం ఆత్మహత్యా సదృశం. ఊరు-వ్యవసాయాల దుఃఖమూ, వేదన ఆత్మహత్యల భయానక కాలంలో ప్రవేశించింది. ఇటువంటి ప్రమాదకరమైన సమయంలో ‘ఫాన్‌’ నవలా ప్రచురణ అనేది హిందీ సాహిత్య ప్రపంచానికి సాధారణ విషయం కాదు. ముఖ్యంగా ఈ విశిష్ట రచన గర్భధారణ నుండి జన్మించే వరకూ జరిగిన ప్రక్రియ ఉల్లేఖణీయం. సంజీవ్‌ రచన, వస్తువు డ్రాయింగ్‌ రూం రైటింగ్‌కు విరుద్ధం.

నిజం చెప్పాలంటే ఈ రచన సంజీవ్‌ చేసిన మూడేళ్ల తపస్సు ఫలితం. ఇక్కడ ‘తపస్య’ను యథాతథ అర్హంలో తీసుకోకూడదు. కీళ్లవాత పీడితుడైన రచయిత బిగుసుకుపోయే మోకాళ్ళూ, కీళ్ళ్లూ వేళ్ల నొప్పి, పోటుతో విదర్భ గ్రామాల్లోని రైతుల   ఆత్మహత్యల కారణాలను (మరణాలకు కారకులను) శోధించడానికి అవిశ్రాంతంగా, అశాంతితో చేసిన అన్వేషణగా భావించాలి. కుటుంబపెద్ద ఆత్మహత్యతో స్తబ్బతలో, అత్యంత వేదనలో మునిగిపోయిన కుటుంబ సభ్యుల వద్ద కూర్చొన్న సంజీవ్‌ పొందిన అనుభూతి అంతా ‘ఫాస్‌’ పేజీలపై పరుచుకుంది.

బన్‌గావ్‌ గ్రామానికి చెందిన రైతు శివశంకర్‌, అతని భార్య శకున్‌, బిడ్డలు సరస్వతి, కళావతిల జీవిత కథతో నవల (ప్రారంభమవుతుంది. రకరకాల పాత్రలు, ఘటనలు, సమాచారాల మధ్య శంకర్‌. చలాకీతనం, శక్తితేజస్సుతో ఉడుతలా గెంతే కళావతి (కళ) రచన పఠనీయతకు గతిశీలను ఇస్తూ వుంటుంది. స్వయంగా “విదర్భ” ఒక ప్రధానమైన పాత్ర రూపంలో నవలలో వున్నప్పటికీ సంప్రదాయరూపంగానే కావొచ్చు నాయికగా కళ్ళ ఆమె వ్యవహరించే తీరూ, తాటాకుల మంట వంటి ఆమె కోపతాపాలూ పాఠకులను పేజీలకు కట్టిపడేస్తాయి.

ఆమె తల్లి శకున్‌ కూడా ఒక అవిస్మరణీయమైన పాత్ర. ఆమె నిప్పు లాంటి దళిత స్త్రీ ఒక్క దెబ్బతో హిందూ దేవీ-దేవతల చిత్రాలను చెత్తలో పడవేయగలుగుతుంది. ఢంకా వాయించి బౌద్ధ మతాన్ని స్వీకరిస్తుంది. అన్ని కష్టాలనూ, అడ్డంకులనూ, భర్త తటపటాయింపునూ ఎదుర్కొని బిడ్డలను చదివించడానికి దృఢంగా నిలబడుతుంది. భర్త ఆత్మహత్య వల్ల కుప్పకూలిపోదు. మరింత ఎత్తుకు ఎదిగి సమాజమంతటి కోసం మద్య నిషేధాన్ని డిమాండ్‌ చేస్తూ భట్టీ పగులగొట్టే ఉద్యమానికి నేతృత్వం వహిస్తుంది. మెట్టినింటి చిత్రహింసలను ఎదిరించి వచ్చిన కూతురు కళను వెన్నుతట్టి ముందుకు వెళ్లడానికి ప్రోత్సహిస్తుంది. శకున్‌ రూపంలో అద్భుతమైన, అద్వితీయమైన పాత్రను రూపొందించాడు సంజీవ్‌. కళావతి, శకున్‌, ఆశా వాన్‌ఖడే వంటి స్త్రీ పాత్రలకు రూపం పోసి నవలాకారుడు బహు విస్తృతి కలిగిన హిందీ కథా సాహిత్యపు కొంగులో అపూర్వమైన కానుకను మూటకట్టాడు.

శంకర్‌ మాధ్యమంగా బన్‌గావ్‌ గ్రామపు దళిత శేతకార్ల వ్యవసాయపు భూమి స్థితిగతులూ, భౌగోళిక వివరాలతో నవల ప్రారంభం అవుతుంది. భారత దేశ గ్రామాల వలస ఆర్థిక సామాజిక విషయాలు కూడా స్పష్టమవుతాయి. ఈ సామాజిక పరిస్థితుల్లో దళితులూ, మహిళల ఊపిర్లను కనపించే, కనిపించిన బానిసత్వపు సంకెళ్లు నియంత్రిస్తాయి. శంకర్‌ రాత్రి నిద్రపోయే సమయంలో తన భార్యతో తన ఎడ్డు – లాలూ, మాక్తూల గురించి చర్చించడం రైతు జీవితపు ఎంతో సహజమైన చిత్రాన్ని కండ్లకు కడుతుంది. పాఠకులు తక్షణం విదర్భ [గ్రామ జీవితంతో మమేకం అవుతారు. అటవీ శాఖ ఉద్యోగులు, పోలీసు అధికారులు సహజంగా ఎలా వుంటారో, ఈ నవలలోనూ అలాగే వుంటారు. పై నుండి కింది వరకూ గల ప్రభుత్వమూ, ప్రభుత్వ సంస్థల స్వభావం ఏ మాత్రం మారలేదు. ఆధునికం అని చెప్పబడే వ్యవసాయం వ్యవసాయాన్ని మార్కెట్‌తో జోడించింది.

కానీ దీనివల్ల గ్రామీణ భూస్వామ్య-పితృస్వామ్య స్వభావంలో ఏ మార్చూ రాలేదు. దీనికి వ్యతిరేకంగా మధ్యస్త కులాలు భారతదేశ వ్యాప్తంగా పీడక కులాల వలె భూస్వామ్య పీడన, అహంకారం, కుల ద్వేషాలను స్వీకరించాయి. అందువల్లే శకున్‌ తన బిడ్డ కళను అశోక్‌తో స్నేహం గురించి హెచ్చరిన్తుంది. “అశోక్‌ శోభ కొడుకు. మరాఠా. మరాఠీలకు మాంగ్‌-మేశ్రంలకు స్నేహం, సాన్నిహిత్యం ఎలా కుదురుతుంది?” ఆఖరికి అదే జరిగింది.

బన్‌గాంలోని గుడి పూజారి ఆపాదమస్తకం కామాతురుడు, వ్యభిచారి సదాశివ్‌ భాగవత్‌ మహారాజ్‌ కళ, అశోక్‌ల గురించి ఎంతగా పుకార్డు పుట్టిస్తాడంటే తండ్రి శివశంకర్‌ భరించలేక బావిలో దూకి ప్రాణాలు తీసుకుంటాడు. అయితే ఈ పుకారు అతడి ఆత్మహత్యకు తాత్కాలిక ఉత్ప్రేరకంలా   పని చేసింది. నిజానికి బిడ్డల పెండ్లి సంబంధాల కోసం తిరిగి తిరిగి కట్నం డిమాండ్లతో అతని మనసు ముందే విరిగిపోయి, చెదిరిపోయి జీవితంతో ఓడిపోయి వుండింది.

రచయిత శంకర్‌-ళకున్‌-కళల కథ విన్ఫృతిని పెంచుతూ యావత్తు యవత్‌మాల్‌-విదర్భలకు జోడిస్తూ, సాధారణీకరిస్తూ పోతాడు. ఇలా ఈ రచన మన దేశ, కాలాలకు ప్రాతినిధ్యం వహిస్తూ మన ముందు నిలుస్తుంది. ఆత్మహత్య కారణాలను సంజీవ్‌ అనేక కోణాల్లో పరిశీలించాడు. సహజంగానే రైతుల ఆత్మహత్యలకు దారితీస్తున్న ఆర్థిక-రాజకీయ కారణాలు ప్రముఖంగా చిత్రించబడ్డాయి. అయితే వాటి మానసిక పరిస్థితులకు కూడా పూర్తి (ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఎందుకంటే విదర్భలో ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో ఎక్కువ మంది మరాఠాలు. “మరాఠాల (ప్రాచీన గౌరవం, గొప్పతనంల భారం కూడా వీళ్ల ఆత్మహత్యలకు ఒక కారణం. మరొక కారణం వీళ్ల కులానికే చెందిన కొంత మంది ఉద్యోగస్తుల మోటార్‌ సైకిల్‌, కలర్‌ టీవీ, ఫ్రిజ్‌. ఇది వాస్తవం – ఎంత పెద్దవ్యవసాయం వుంటే అంత పెద్ద నష్టం. రెండూ వీళ్లను ముందుకుతోస్తూ ఆత్మహత్యల వరకూ తీసుకెళ్తున్నాయి.” (పేజీ. 71)

అయితే రచయిత కేవలం ఆత్మహత్యల నల్లటి నీడలతో నవలకు ఒకే రంగును అద్దలేదు. రకరకాల ఆశా కిరణాలు భిన్న రంగులను వెదజల్టుతూ ఆశావాదపు దివిటీని జ్వలింపజేస్తాయి. సునీల్‌ కాకా కొడుకు సైంటిస్టు విజయేంధద్ర్‌ ఈ రచనకు కథానాయకుడి వలె వుంటాడు. ఇతడు కాలిఫోర్నియాకు వెళ్లే కార్యక్రమాన్ని ఆపుకొని రైతుల ఆత్మహత్యల కారకాలను పరిశీలించడాన్ని తన ప్రాజెక్టుగా ఎంచుకొంటాడు. ఈ ప్రాజెక్టు కథను ముందుకు నడిపించడమే కాకుండా అనేక దేశీ-విదేశీ ప్రత్యామ్నాయాలను పాఠకుల ముందు పెడుతుంది. దాని మాధ్యమంగానే వ్యవసాయ శాస్త్రవేత్త దాదాజీ ఖోబ్రాగడే, గోండు గ్రామానికి చెందిన దేవాజీ, తోపాజీల నూతన, ఆధునిక ప్రయోగాలు మనకు పరిచయం అవుతాయి.

రైతుల ఆత్మహత్యలకు అనేక రకాల కారణాలున్నాయి. వీటిని దూరంగా నిలబడి తటస్థ పరిశీలకుల వలె అర్ధం చేసుకోలేం. కనుక అధికారులు నష్టపరిహారానికి అర్హతలను, అనర్హతలను తమకు తోచినట్టుగా నిర్ణయిస్తారు. ఆత్మహత్య చేసుకోకూడదని రైతు  ఉద్యమ 

 ప్రఖ్యాత నాయకుడు సునీల్‌ కాకా చేసే గర్జన రైతులకు అండగా వుండేది. అదే సునీల్‌

కాకా కరువు దెబ్బకు తన యాభయి ఎకరాల కలల పంట చనిపోవడాన్ని చూసి భరించలేక ఆత్మహత్య చేసుకుంటాడు. మరొకవైపు ఒక మహిళా రైతు ఆశా వాంఖడే తన సోమరి భర్తను పక్కనపెట్టి వ్యవసాయాన్ని కొనసాగిస్తుంది. ఆమె సాహసం, సంఘర్షణ అందరికీ ప్రేరణగా మారుతుంది. ఊహించని వర్షంతో అమ్మకానికి సిద్ధంగా వున్న పత్తి నాశనం అవుతుంది. ఆ దెబ్బను భరించలేని ఆమె జీవితం నుండి నిష్క్రమిస్తుంది. సాయిపుర్‌ గ్రామమంతా ఆత్మహత్యకు అనుమతి కోరుతూ దరాఖాస్తు చేసుకుంటుంది. పూజారి నిరంజన్‌ దేవ్‌ గిరి ఉచ్చులో చిక్కుకొని ఏ కారణమూ లేకుండా గోహత్యా పాపాన్ని తలకు చుట్టుకొని ఎద్దులాగా అంబా అంబా అనే రైతు ఉద్యమ ఉజ్వల నాయకుడి మోహన్‌దాస్‌ బాఘ్‌మరే విషాదం, ఇటువంటి తీవ్రమైన దుఃఖాన్నీ, బాధనూ కల్గించే చిత్రీకరణలు పాఠకులను ప్రతీ క్షణమూ కదిలిస్తాయి. వీటన్నింటికీ విడిగా, విలక్షణంగా మన ఉడుత కళావతి, ఆమె త్రికోణ (ట్రేమ కథ, అశోక్‌ విజయేంద్ర్‌లతో ఆమె విలక్షణమైన, అద్వితీయమైన రొమాంటిక్‌ సంబంధం నిజానికి ఈ రచన పఠణీయతకు ఇరుసు వంటిది.

ఈ రచన పడుగూ పేకలను నేసే ప్రక్రియలో రచయిత, పరిశోధకుడు- ఈ ఇద్దరి మధ్య కలహం కొనసాగుతూ వుంటుంది. పరిశోధకుడు, అతడి సమాచారం, గణాంకాలు ఎక్కువయిన చోట చదివే వేగం తగ్గుతుంది. కానీ ఒకవేళ మనలో కొంతైనా సున్నితత్వం మిగిలి వుంటే, నేటి గ్రామీణ భారతపు సంపూర్ణ చిత్రంతో మమేకం కావాలనుకుంటే “ఫాన్‌ పేజీల మీదుగా ప్రయాణించడం చాలా అవసరం.

(సమకాలీన్‌ జన్‌మత్‌ మాస పత్రిక సౌజన్యంతో)

హిందీ నుండి అనువాదం: మిడ్కో

( గమనిక : గత సంచికలో పొరపాటున పూర్తి సమీక్షను ప్రచురించనందున తిరిగి పూర్తి సమీక్షను ప్రచురించాం. పాఠకులు గమనించగలరు. )

Leave a Reply