వాడు దేశాన్ని ఒక మూసలో నెట్టుతుంటే
కావడి పట్టుకొని అన్నదాత ఆందోళన చేస్తున్నాడు
మద్దత్తు ధర కోసమో, పంటల రక్షణ కోసం మాత్రమే కాదు
ఫాసిజం ఎంత వెర్రి తలలు వేసిందో
దేశ రాజధాని నలుదిక్కుల చుట్టూ ముట్టిన రైతు
చాటి చెపుతున్నాడు
వాడు అయ్యోధ్యా రామమందిరం అంటూ
దేశ ప్రజల మేదల్లో మూడవిశ్వాసాన్ని నింపి
దేశాన్ని మతం పేర ముక్కలు చెయ్య చూస్తున్న చోట
దేశమే తమ ఇల్లు అంటూ
అన్నదాతల ఆందోళన చూడమంటాను
వాడు ప్రశ్నను ఎదుర్కోనలేక
ధర్నాలను, రాస్తారోకాలను అడ్డుకొనడానికి
అక్రమంగా కుట్ర కేసులు,NIA దాడులను ఉసిగొల్పుతున్న కాడా
నిటారుగా నిలబడి నాగలి కర్రును భుజాన వేసుకొని
ఆరుగాలం గాసం వెంట పెట్టుకొని
ట్రాక్టర్లనే గుడిసెలుగా చేసుకొని
నిలబడ్డ రైతాంగాన్ని చుడాలంటాను.
వాడు ఒక కుట్రల కుతంత్రాలు వలయాన్ని
ఈ దేశ ప్రజల మీద విసురుతున్న చోట
రైతంగాం ఒక ఆయుధమై కదిలింది
దేశ రాజధానిని చుట్టూ ముట్టి
సరికొత్త దేశాన్ని నిర్మిస్తాం అంటున్న
రైతు దృశ్యమే నాకు కనబడుతుంది.
Related