1
ఆధునిక రామాయణం
విద్వేషం తెంపిన తల
వెదురు మనిషైంది
నెత్తురొడుతున్న ప్రశ్నలా
కళ్ళుమూసుకొని
ఈ దేశం కళ్ళల్లోకి చూసింది
మనిషిని
పశువుకన్న హీనం చేసిన విలువల్ని గర్భీకరించుకున్న
శవపేటిక మీది కౄరజంతువుల్ని
దేశం నిండా విస్తరించిన
అన్ని దిక్కుల్ని
ధిక్కరిస్తూ
మూసిన పెదాల్తో నవ్వింది
'అబ్దుల్ కలామ్ ప్రథమ పౌరుడైయ్యాడు
గుజరాత్
ముస్లిం నెత్తుట్లో దాండియా ఆడాక
దళిత రుధిరవర్షం ఉత్తర భారతాన్ని
ముంచి వేస్తున్నప్పడే
దళిత కోవిందు కొత్త ప్రథమ పౌరుడైయ్యాడు
ఆదివాసీ ముర్ము ప్రథమ పౌరురాలైయ్యాక
మరణ మృదంగ విన్యాసాలు
ఆదివాసి కొండలు లోయలు
అడవుల్లోకి విస్తరించాయి'
హహహ అని అరిచింది
కవులకు కళాకారులకు మేధావులకు వినిపించేలా!
నేను కుకీ నీ
హిందుత్వ తుంచిన
ఆధునిక శంభూక తలనంది .
2
మంటల పూర్
-------------
తిరిగి
ఒక గుజరాత్రి
మణిపూర్ నావహించి
మృత్యుకేకలు అహాకారాలు ఆర్తనాదాలు
చీల్చబడిన మానవ శవాలు
నరకబడిన తలలు
విసరబడిన మొండాలు
కోసి పడేసిన రొమ్ములు
చెల్లాచెదురైన కాళ్ళూ చేతులు
మృత్యువాక్రమిస్తున్న నగ్న ప్రాణాల అమ్మలు
నెత్తుట్లో ఈదుతున్న శవాలు
మణిపురి గర్భాన్ని చీల్చి
కుకీ పిండాన్ని శూలానికి గుచ్చి ఊరేగుతున్న
మత వ్యాపారం
మణిపూర్ కొండల గుండెల్లో
కుకీ జోమీ ల కాళ్ళకింద
ముడుచుకు పడుకున్న
దేశం సొమ్ము
ప్లాటినం బంధుమిత్రుల నగ్నంగా
నడిపించుకు పోవడం కోసం
కార్పోరేటు కనుసన్నల సెంగల్ కలల కుట్ర !
రెడీమెడ్ గిరిజనుని తో
గిరిజనుల ఇల్లు తగలబెట్టి
గిరులప్రాంత మంతా తన్నుకు పోయె కుట్ర !
అబ్బ
వాణ్ణి డిస్ట్రబ్ చేయకండి !
కామ రాజ్యమో
రామ రాజ్యమో స్థాపిస్తున్నాడు.
మృత్యుస్పర్శ
--------------
పదిలక్షల సూటు వేసుకొని
యాబయారించుల ఛాతి
మొసలికన్నీరు నాయకుడు
పై దుస్తులు ఒలిచాడు
చీరా లాగేశాడు
లో దుస్తులు గుంజేశాడు
ప్రపంచ బహిరంగ మార్కెట్లో
బహిరంగ అసభ్య చేష్ఠల ట్రంపు ప్రియుడు
భారతమాతకు జై అంటూనే
భూమంతా
నగ్నంగా తిప్పాడు
యథా నాయక
తథా కార్యకర్త
పై దుస్తులు ఒలిచారు
చీరా లాగేశారు
లో దుస్తులు గుంజేశారు
మతం మార్కెట్లో
మణిపూర్ మాతను
వాళ్ళుపుట్టిన మార్గాన్ని పొక్కిలి చేస్తూ
నగ్నంగా తిప్పారు
వాడు దేశాన్ని
వాళ్ళు దేహాల్ని
రోజూ నలభైవేల అల్పాహారం తింటూ
అంగాంగం అంగట్లో పెట్టినోని అనుచరులారా!
అమ్మతనాన్ని ఛిద్రంచేయడమే
మగతనం అనుకునే మతమృగాల్లారా!
నడిబజార్లో
ఇనుప గొల్సుల చేతుల్తో
అమ్మల రొమ్ములు పట్టుకున్నోన్ని
వాళ్ళమ్మ పాలకు బదులు
ఉచ్ఛపోసి పెంచుంటది
బహిరంగంగా
అమ్మల జననావయవాల్లో
చేతులు ముంచిన వాళ్ళు
పియ్యి తిని పెయ్యి పెంచుంటారు పందుల్లా!
హిందూ తాలిబన్లారా!
యూదు స్త్రీల నగ్న ఊరేగింపులా
మీరు పాలు తాగిన రొమ్ముల్ని
మీ జనన జననంగాల్ని
మీ తల్లుల్ని మీ చెల్లెల్ని మీ భార్యల్ని
మీ భారతమాతను నగ్నంగా ఊరేగించారు
సిగ్గును కాశీలో వదిలి
శరాన్ని గంగలో తోసి
హిందూ నాజీల్లారా!
హిట్లర్ ముస్సోలినిల కుక్కచావులు
ఇవ్వాళ ఇప్పుడే కాకపోవచ్చు
కళ్ళు కాయలు కాసేలా
మీ కోసం ఎదురు చూస్తూనే ఉంటాయి
Related