వాడి మౌనం వెనుక....
ఎన్ని భయానక దృశ్యాలో ...
ఎన్ని చెడు కాలాలో .....
ఎన్ని నగ్నదేహాల ఊరేగింపులో .....
ఎన్ని హృదయంలేని బుల్డోజర్లో ...
తెగిపడ్డ మానవ దేహాల ‘ మణిపురా ‘ లెన్నో ...

వాడి మౌనం వెనుక ....
త్రవర్ణ పతాకంలో
కాషాయ ' వర్ణా ' ధిపత్యం
భారత జనేచ్ఛ రాజ్యాంగాన్ని ఆవరిస్తున్న
మనువాద మహా రాజ్యాంగం !
జైలు గోడల మధ్య బందీలవుతున్న
మాట్లాడే నోళ్లు
ఆలోచించే మెదళ్లు
ప్రశ్నించే గొంతుకలు
ధిక్కరించే స్వరాలు

వాడి మౌనం వెనుక
సూడో చరితలు
సూడో శాస్త్ర విద్యలు
సనాతన ధర్మ కుట్ర చట్రాలు
మూఢ విశ్వాసాల ము క దాడులు
మొత్తంగా వాడి మౌనం వెనుక ఉన్నది
ఏకశిలా సదృశ జాతీయవాద గర్వం

వాడి మౌనాన్ని బద్దలు చేయడానికి
వాడి ఫాసిస్టు గుట్టుమట్టులు
బట్టబయలు చేయడానికి
సిద్ధమవుతున్నాయి
మాట్లాడే నోళ్లు
ఆలోచించే మెదళ్ళు
ప్రశ్నించే గొంతుకలు
ధిక్కరించే స్వరాలు.

Leave a Reply