గజ్జెలు లేకుండా కూడ నీ పాదాలు ఎంత భంగిమలో ఉన్నాయి
ఈ పాదాల్లో కొంచెం కొంచెం దుమ్ము పట్టి ఉన్నది
ధూళి అనగానే గుర్తుకొచ్చింది నువ్వు నీ ‘యోయో’ (అమ్మమ్మ)
ఒళ్లోకి వట్టికాళ్లతోనే
గోముతో పరుగెత్తాలనుకోవడం కూడ ప్రేమనే
మట్టితో సూటిగా మాట్లాడుతూ నీ కాళ్లు పాదాలు
రేలా స్వరంలోకి తర్వాత ఎగుస్తాయి
మొదట నీ పాదాలను ఈ మట్టి రమ్మని పిలుస్తుంది
నువ్వూ నీ పాదాలు రెండూ ఎంత శాంతంగా
ఎంత ప్రకాశిస్తూ, ఎంత నిష్కళంకంగా కనిపిస్తున్నారు
నీ గోళ్లు చాల విచారంగా కనిపిస్తున్నాయి
నీ అమ్మ దగ్గర నెయిల్కట్టర్ లేదు
నువ్వీ పాదాలతో కొంచెం దూరం నుంచి
నడిచివస్తూ ఉంటే వీధుల్లో ఈ రోజుల్లో
చూడబోతే చీకట్లు తొలగిపోయినట్లనిపించింది
నువ్వు ఎన్నెన్నో కిలోమీటర్లు నడవాల్సిన అవసరం ఉంది
నీ పాదాలలో అనుభవాలకి కొరత లేదు
నా చూపులు నీ పాదాలమీదికొచ్చి నిలిచి
పోయినవంటే నువు నమ్మకపోవచ్చు
ఎంత సుందరమైనవి, ఎంత నిటారయినవి
రెండుపాదాల్లోనూ సమానంగా వేళ్లున్నాయి
నీ పాదతలాలపై ఉబికివచ్చిన రేఖలు
ఒక్కసారే ఎంత స్పష్టంగా కనిపిస్తున్నాయి
నేనేమీ జ్యోతిష్కుణ్ని కాదు
అయినా చూడు అవి అంతరిక్షం మీదికి కూడ
నడిచేంత యోగ్యమైనవిగా కనిపిస్తున్నాయి
నీ పాదాలకబ్బే మోజా (మేజోళ్ల) జత వారానికోసారి వచ్చే
హట్ (సంత)లో నీ కోసం నిరీక్షిస్తూ
ముఖం వేలాడేసి మూల్గుతున్నవి
వచ్చేవాళ్లు, పోయేవాళ్లు ప్రతి ఒక్కరి గురించి
నువ్వేమీ పట్టించుకోకు
కులాసాగా పయనించు
మరో ప్రపంచంలో నీకు స్వాగతం చెప్పే
ఏర్పాట్లు జరుగుతున్నాయి
నేను నీ పాదాలు కడగడానికి
ఇంద్రావతి జలాలు పట్టుకొస్తాను
ఒక అన్నం పొట్లం, ఒక మోజా () జత
చంద్రుని ఒక పెద్ద చిత్రం
ఒక సూర్యుని పోస్టర్ (గోడపత్రిక)
ఒక గ్లోబ్ (భూగోళం) కూడ
గ్లోబ్ విషయం నీకేమీ తెలియదు
మనిషి ప్రపంచంలోకి చంద్రునిలోకి
ఎక్కడెక్కడికి చేరుకున్నాడో
నేను తెలియచేస్తాను
నువ్వు భూగోళం మీద నీ రెండుపాదాలు
దృఢంగా మోపాలి
ఎక్కడెక్కడ నీ ఇల్లు ఉన్నదో చెప్పాలి
ఎక్కడెక్కడ జల్ జంగల్ జమీన్
ఉన్నాయో చెప్పాలి
ఎక్కడెక్కడ ఆకాంక్షలు నమ్మకం ఉన్నాయో చెప్పాలి
నేను కుత్తుకదాకా ప్రేమ నింపుకొని వస్తాను
నీ నుదుటిమీద కాదు
నీ రెండు పాదాలను ముద్దాడడానికి
(ఆరునెలల పసిపాప సోడీ మంగ్లీ బీజాపూర్ పోలీసుల ఏకపక్ష నిర్విచక్ష కాల్పుల్లో మరణించినపుడు బీజాపూర్ కవి పూనమ్ వాసమ్ రాసిన కవిత)
15.01.2024
Related
I will come to kiss your two feet’s *****great poem poonam ji
====================
BUCHI reddy gangula