కోవిడ్ సుదీర్ఘ విరామం అనంతరం సెప్టెంబర్ 1 నుండి తెలంగాణలో ప్రత్యక్ష విద్యబోధన ప్రారంభమైంది. విద్యార్థుల ఆరోగ్యంపై కలత చెందిన కొంత మంది తల్లిదండ్రులు, వ్యక్తులు సెప్టెంబర్ 1 నుండి పాఠశాలల ప్రారంభం నిలిపివేయాలని పిల్ వేశారు. ఆగస్టు 31 నాడు అత్యవసరంగా హైకోర్టు బెంచ్ పాఠశాలల ప్రారంభంపై విచారణ జరిపి గురుకులాలు,సంక్షేమ హౕస్టళ్ళను మినహాయించి మిగిలిన విద్యాసంస్థల ప్రారంభానికి అనుమతినిచ్చింది.అదే సమయంలో గురుకులాలు,సంక్షేమ హౕస్టళ్ళలో కోవిడ్ నిబంధనలు అమలుపై, అక్కడి వసతుల కల్పన, కనీస సౌకర్యాలపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గురుకులాలో, సంక్షేమ హౕస్టళ్ళలోని విద్యార్థులు నివసించే గదులలో కోవిడ్ నిబంధనలు అమలుకు ఏమాత్రం అవకాశం లేదు. మా పరిశీలనలో, వివిధ జిల్లాలలోని సంక్షేమ హౕస్టళ్ళు, గురుకులాలు శిథిలావస్థకు చేరగా,హైదరాబాద్ తదితర పట్టణాలలో అద్దె బిల్డింగులలో కొనసాగుతున్నాయి.నలుగురు ఉండాల్సిన హౕస్టల్ గదిలో 10 మందికి పైగా ఉంటున్నారు.చాలా వసతిగృహాలలో వసతి సౌకర్యం ప్రత్యేక గదులుగా ఉండకుండా జనరల్ వార్డుగా ఉంటున్నది. ఈ వార్డులో 60-80 మంది వసతిపొందుతున్నారు. ఈ పరిస్థితుల వల్ల తెలంగాణలో సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
కోవిడ్ నిబంధనలు,భౌతిక దూరం పాటించడం అసాధారణ నియమం. కానీ సరిపడా స్నానాల గదులు, మరుగుదొడ్లు లేకపోగా అపరిశుభ్ర వాతావరణం రాజ్యమేలుతున్నది. సంక్షేమ హౕస్టళ్ళలోని పరిశుభ్రత, టాయిలెట్ల నిర్వహణకు ఉద్యోగులను నియమించకపోవటం, ప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయించకపోవడం ఈ పరిస్థితికి కారణం.ఇక ప్రభుత్వం ప్రకటించిన పౌష్టికాహార భోజన మెనూ ఏ సంక్షేమ వసతి గృహంలో అమలు కావడం లేదు. ఉదయం అల్పాహారంలో ఉడ్లీ-పల్లిచట్నీ,బోండ,మైసూరు బజ్జీ,పూరి వంటి అల్పాహార మెనూ ఇప్పటికీ అమలు చేయకపోగా మధ్యాహ్నం భోజనం కొరకు వండిన తెల్ల అన్నం, చింతపండు పులుసును ప్రతిరోజు విద్యార్థులు అల్పాహారంలో తీసుకుంటున్నారు. మధ్యాహ్న భోజనంలో అందించాల్సిన కూరగాయల కూరను వండకుండా పప్పు కూరతో సరిపెడుతున్నారు. పౌష్టికాహారం అందించటంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ కొరవడటం, వార్డెన్ ల అవినీతితో విద్యార్థులు అనారోగ్యంబారిన పడుతున్నారు.
విద్యార్థినిలు రక్త హీనత(Anemia)బారినపడుతున్నారు. ఇలాంటి సమస్యలు రాజ్యమేలు తున్నచోట కోవిడ్ నిబంధనలు పాటించబడటం ఎలా సాద్యం? ఈ హౕస్టళ్ళలో చదువుతున్న యస్సీ, యస్టీ,బి సి, మైనారిటీ కుటుంబాలకు చెందిన నిరపేద విద్యార్థులు వారి చదువులు కొనసాగించటం ఎలా? తెలంగాణ ఏర్పాటు అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కె జి టు పి జి ఉచిత విద్య హౕమినిచ్చి మోసం చేసిన తెరాస పాలకులు,గురుకులాలను కెజి నుండి పిజి ఉచితవిద్యకి నిదర్శనమని ప్రకటిస్తున్నారు.
పాలకులు చెబుతున్న గురుకులాలలో కనీసం కోవిడ్ నిబంధనలు అమలు పర్చలేని దౌర్భాగ్య పరిస్థితి నెలకొనటం వారి వైఫల్యానికి నిదర్శనం. హైదరాబాద్ మహౕనగరంలోని అబిడ్స్ ప్రాంతంలోని షెడ్యూల్డ్ కులాల బాలుర అద్దె వసతి గృహంలో 200 మంది విద్యార్థులకు కేవలం ఆరు మరుగుదొడ్లు ఉండగా వాటి తలుపులు ఊడిపోయి ఉన్నాయి.హైదరాబాద్ లోని రామ్ నగర్ బి సి సంక్షేమ హౕస్టళ్ళో వసతి గదులు సరిపడక విద్యార్థులు నేలపై పడుకుంటున్నారు.వందల హాస్టళ్లకు వార్డెన్లు లేరు. ఇంచార్జి వార్డెన్లనే కొనసాగిస్తున్నారు. వంట మనుషులు,వాచ్ మేన్లు లేరు. అద్దె హౕస్టళ్ళలోహౕస్టళ్ళలో విద్యార్థినులకు సెక్యూరిటీ సమస్యలున్నాయి. హౕస్టళ్ళలోని అసలు సమస్యలు పరిష్కారించి ప్రత్యక్షబోధనకు చర్యలుచేపట్టకుండా మళ్లీ ఆన్ లైన్ విద్యభోదననే కొనసాగిస్తామన్న సర్కారు అందుకవసరమైన ఆన్ లైన్ ఉపకరణలు, సౌకర్యాలు కల్పించటం లేదు.
నిరపేద కుటుంబాలకు చెందిన లక్షలమంది విద్యార్థులు ఆండ్రాయిడ్ ఫోన్,ల్యాప్ టాప్,ఇంటర్నంట్ కనెక్టివిటీ లేక విద్యకు దూరమవుతున్నారు. ఇలాంటి సందర్భంలో ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు సౌకర్యాలు, పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత పాలకులపై ఉన్నది.మన దేశంలో,రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు,సంక్షేమ హౕస్టళ్ళలో కరోనా వైరస్ వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలకుండా శాశ్వత ప్రతిపాదికన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేయాల్సిన అవసరం మనందరిపైన ఉన్నది.
ప్రతి ఏడాది కోట్ల రూపాయల అద్దెలు ప్రైవేటు బిల్డింగుల యాజమాన్యాలకు ముట్టచెబుతున్న సర్కారు పక్కా భవనాలు ఎందుకు నిర్మించడం లేదనేది విద్యార్థుల ప్రశ్న.ప్రతి వసతి గృహంలో వైద్యసదుపాయం కల్పించాలి.హెల్త్ ఆపిసర్, నర్స్ లను నియమించాలి. శిథిలావస్థలో ఉన్న హౕస్టళ్ళ స్థానంలో కొత్త హౕస్టళ్ళు యుద్ధప్రతిపాదికన నియమించాలి. మరుగుదొడ్ల నిర్వాహణ, పరిశుభ్రత,శానిటైజేషన్ కొరకు అదనపు నిధులు విడుదల చేయాలి. అదనపు సిబ్బందిని నియమించాలి. గురుకులాలు, సంక్షేమ వసతిగృహాలలోని విద్యార్థుల కాస్మోటిక్ చార్జీలు వెయ్యి రూపాయలకు పెంచి ప్రతినెలా అందిస్తే విద్యార్థులు వారి కనీసఅవసరాలతో పాటు అదనంగా సబ్బులు, షానిటైజర్లు, మాస్కులు, డాటా బాలెన్స్ లు సమకూర్చుకోవడంలో ఉపయోగపడుతుంది.
విద్యార్థినిల హౕస్టళ్ళకు మహిళా సెక్యూరిటీ గార్డులచేత రక్షణ కల్పించాలి. వేల సంవత్సరాలుగా విద్యకు దూరంగా ఉన్న దళితులు,ఉత్పత్తి కులాలు,వివిధ తెగలు,మత మైనారిటీ కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుతున్న,నివసిస్తున్న గురుకులాలు, సంక్షేమ హౕస్టళ్ళను నిర్లక్ష్యం చేయడమంటే వారిని రెండవశ్రేణి పౌరులుగా చూడటమే.
ఈ సమస్యలు పరిష్కరించకుండా సబ్బండవర్గాలను ఉద్ధరిస్తామవే మాటలు వట్టి నీటిమూటలే. పీడితప్రజలను మోసంచేయడమే. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాలు, సంక్షేమ హౕస్టళ్ళ బాగుకోసం తక్షణమే అధిక నిధులు కేటాయించాలి. ప్రత్యేక చర్యలు చేపట్టి సంక్షేమ హౕస్టళ్ళను, గురుకులాలను అభివృద్ధి చేయాలని ఉద్యమించాలి.