SC 998 of 2018
IV మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి, రంగారెడ్డి కోర్టులో చర్లపల్లి జైలు ఖైదీ ఇచ్చిన దరఖాస్తు
నా పేరు సయ్యద్ గపూర్, CT నెంబర్ 6634. నేను చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఉంటున్నాను. 14.5.2023 నాడు సాయంత్రం వేళలో జైలు సిబ్బంది నన్ను కొట్టారు. చిత్రహింసలకు గురి చేశారు. నాకు ఐదు రోజుల నుంచి తిండి లేదు. కేవలం నీళ్లతో మాత్రమే ఉన్నాను. మూడు నెలల కిందట కూడా ఇదే విధమైన వేధింపులకు గురి చేశారు. మొన్న సంతోష్ కుమార్ రాయ్ సూపరింటెండెంట్, కృష్ణమూర్తి, వెంకటరెడ్డి నా ముఖం మీద కాళ్ళ మీద తన్నారు. నా నోట్లో రక్తం నుంచి రక్తం కారింది.
సంతోష్ కుమార్ రాయ్, కృష్ణమూర్తి, వెంకట్ రెడ్డి, సత్య ల వేధింపులు, చిత్రహింసలు తట్టుకోలేక నిన్న 15. 05. 2023 నాడు బ్లేడుతో నా నెత్తి మీద గొంతు మీద కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాను.
పైన పేర్కొన్న అధికారులు నన్ను ఆత్మహత్య చేసుకోమని చెప్పారు ఇంకా అప్పుడు మాకు ఎలాంటి ఆపద ఉండదు అన్నారు.
గత మూడు వారాల నుండి సంతోష్ కుమార్ రాయ్ సూచనల మేరకు మౌలాలి పప్పు అనే ఒక విచారణ ఖైదీ చేతులకు గ్లౌజు తుడుక్కొని తన వేళ్లను నా గుద మార్గంలోకి చోప్పిస్తున్నాడు. మిగతా ఖైదీలకు కూడా ఈ విధంగానే జరుగుతుంది.
మొన్న జవాన్లు నా చేత సర్ఫ్ నీళ్లు బలవంతంగా తాగించారు. మౌలాలి పప్పు ఈ ఐడియా ఇచ్చాడు. ఖైదీలకు వాంతులు రావడానికి ఈ విధంగా చేస్తారు.
మౌలాలి పప్పు జైలు అధికారుల కోసం పనిచేస్తున్నాడు. అతను తాగడానికి బీడీ, గంజాయి కానుకగా ఇస్తున్నారు. ఇక్కడ దాని గురించి చెప్పలేను.
ఈ విషయాలను కోర్టుకు తెలియజేస్తే కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో NDPS కేసులు పెడతామని వెంకట్ రెడ్డి, సత్య బెదిరిస్తున్నారు.
సింగిల్ సెల్లో ఉంటున్న విచారణ ఖైదీ కూడా న్యాయమూర్తులు కలవడం లేదు. వాళ్లు కేవలం జనరల్ బ్యారక్ లో ఉంటున్న విచారణ ఖైదీలను మాత్రమే కలుస్తున్నారు.
నేనుంటున్న మహానది బ్యారక్ లో లాక్ ఓపెన్ చేయకుండానే 24 గంటలు లాకప్ చేస్తున్నారు.
మహానది బ్యారక్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. వాటిని కోర్టు పరిశీలించాలి. సాయంత్రం వేళల్లో లైట్లు ఆఫ్ చేసి నన్నే కాదు మిగతా ఖైదీలను కూడా కొట్టి వేధిస్తున్నారు.
నాలుగు విచారణ ఖైదీల బ్లాకులు ఉన్నాయి. బ్రహ్మపుత్ర, చిత్రావతి, గంగ, మానస. ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు మాత్రమే లాకప్ ఓపెన్ చేస్తున్నారు. తిరిగి సాయంత్రం 3 గంటల నుండి 6 గంటల వరకు ఓపెన్ చేస్తున్నారు. రాత్రి 10:00 నుండి 6:00 వరకు ప్రతి ఒకరితో రెండు గంటల నైట్ డ్యూటీ చేయిస్తున్నారు.
ఇంటి పని మనుషుల్లాగా కడిగిపించడం, శుభ్రపరచడం, గుంతలు తవ్వడం, మరుగుదొడ్లను కడిగియ్యడం. ఇలాంటి పనులను వారానికి రెండు సార్లు చేయిస్తున్నారు. ఆహార పంపిణీ ఇంకా చాలా పనులను విచారణ ఖైదీల చేత చేయిస్తున్నారు.
కోవిడ్ రావడానికి ముందు, విచారణ ఖైదీలకు వారానికి రెండు ములాఖత్ లు ఉండేవి. అప్పుడు గంట వరకు ఫోన్లో మాట్లాడడానికి అనుమతి ఇచ్చేవారు.
ఇప్పుడు వారానికి ఒకసారి మాత్రమే విచారణ ఖైదీలకు ములాఖత్ ఇస్తున్నారు. అది కూడా 20 నిమిషాల వరకు మాత్రమే మాట్లాడనిస్తున్నారు.
మహానది బ్లాక్ లో ఉన్న అఫ్రోజ్ ఖాన్ అనే మరో విచారణ ఖైదీ నిన్న 15.05.2023 నాడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.
సంతోష్ కుమార్ రాయ్ బాధ్యతలు తీసుకున్న నాటి నుండి ముస్లింలను తల మీద టోపీ ధరించడానికి అనుమతించడం లేదు. చివరికి శుక్రవారం ప్రార్థన సమయంలో కూడా ఆజాం చేయడానికి అనుమతించడం లేదు.
వేళ్లను బలవంతంగా నా గుద మార్గంలోకి చోప్పించడాన్ని తట్టుకోలేక, ఇలాంటి థర్డ్ డిగ్రీ చిత్రహింసలను భరించలేక నేను ఆత్మహత్యాయత్నం చేసుకున్నాను. అధికారులు లాఠీలతో కొడుతున్నారు. నిత్యం వీళ్ళ చిత్రహింసలు అవమానాల వల్ల నా మతాన్ని ఆచరించలేకపోతున్నాను.
విచారణ ఖైదీల బ్లాక్ లో ఉంటున్న ఖైదీలు ఎవ్వరికి కూడా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 వరకు లాకప్ ఓపెన్ చేయడం లేదు.
ఒకవేళ నేను ఆత్మహత్య చేసుకుని చనిపోతే, పైన పేర్కొన్న అధికారులే నా చావుకు కారణం.
అధికారులైన సంతోష్ కుమార్ రాయ్, కృష్ణమూర్తి, వెంకట్ రెడ్డి, సత్యలకు వ్యతిరేకంగా అవసరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి
ఈ కంప్లైంట్ ఇచ్చాక, నా రక్షణ, భద్రతలను చూడాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను
కోర్టు హాల్లో ఈ ఫిర్యాదు ఇవ్వబడింది.
Needs action on Roy -wake up all political party leaders —MUSLIM —SO WHAT —HE IS INDIAN TOO