1969 ఏప్రిల్ 22న లెనిన్ శతజయంతి రోజు ఏర్పడిన సిపిఐఎంఎల్ కు సరోజ్దత్తా సాంస్కృతిక సేనాని. ఈ మార్చి 11న ఆయన 110వ జయంతి. సిద్ధార్థ శంకర్రే కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను 1971 ఆగస్టు 4`5 తెల్లవారకుండానే కిడ్నాప్ చేసి కలకత్తా, షహీద్మినార్ మైదానంలో ఒక మూలన కాల్చి చంపిది. లెనిన్ శత వర్ధంతి సందర్భంగా ఆయన రాసిన బ్రాహ్మణీయ ఫాసిస్టు వ్యతిరేక కవితలు మూడు వసంతమేఘం పాఠకుల కోసం…
1. యవ్వనం నేను చండాలుడ్ని జీవితానికి అస్పృశ్యుడ్ని ఈ శ్మశానవాటిక నుంచి జీవితాలు తమ ముగింపు చూసే చోటి నుంచి నేను చితిమంటల బూడిద నుంచి బొగ్గులు ఏరుకుంటాను మరణానంతర అగ్నికీలల నుంచి పొగ తాగడానికి వణికించే రాత్రిళ్లు అదే నాకు కుదుపునిస్తుంది నా నగ్న దేహానికి హాయినిస్తుంది తిమ్మిరి నరాలను వెచ్చగా కరుస్తుంది నా కంఠాన్ని గుండెలను ఎంతో లోతైన ఆహ్లాదకరమైన గుటకవలె కాలస్తుంది నా అలసిన కన్నులను గంగను చూడటానికి తెరుస్తాను తన ఊగుతున్న నగ్న వక్షోజాలతో ఎప్పటివలెనే నిర్లక్ష్యంగా బురద నీటిలో బుడగలు రేపుతుంది ప్రశాంతమైన జీవితం చందన చితిపై కాలిపోయింది మండుతున్న (శ్మశాన)ఘాట్ నుంచి జ్వాలలు ఆకాశాన్ని నాకుతున్నాయి ఇక్కడ నివసించేవాళ్లు ఎప్పటికీ శిక్షించబడేవాళ్లే నేనొక్కడ్నే కులాసాగా ఉంటాను ధూమామృతం నన్ను సజీవంగా ఉంచుతుంది నేను ఆరంభాన్ని, అంతాన్ని, భవిష్యత్తును, గతాన్ని ఈ మృత్యు నల్లని రాత్రి నేను యవ్వన అస్పృశ్యుడ్ని. 2. ఉత్తరకాండం`అనంతర పరిణామం రాముని రాజప్రాసాదంలో చందన పరిమళం నిండిపోయింది యమున మీంచి వీచే గాలిలో ఒక కుళ్లిపోయిన శవం వాసన వచ్చినప్పుడు తప్ప రాజుగారి ఈత కొలను దగ్గర వెలివేయబడిన ఒక శిరచ్ఛేదిత దేహం తగలబడుతున్నది పాలరాతి రాజసౌధం చీకటి మూల ఒక వృద్ధ నాయకుడు కదల లేడుగాని గత ప్రశంసలను నెమరేసుకుంటున్నాడు ఎన్నటికీ మాసిపోని క్రూరమైన యుద్ధ నేరాల నీడలను పరుస్తూ బలి దయ్యమై దాగి ఉన్నాడు సముద్ర ఇసుక తిన్నెలపై అజేయమైన శత్రురాజు శాశ్వత చితి మండుతున్నది ఒక అసహ్యకరమైన ద్రోహి లంకను పాలించాల్సి ఉన్నది అతడు వృథాగా తన భయాన్ని ప్లాస్టిక్ నవ్వుతో కప్పేయాలని ప్రయత్నిస్తున్నాడు తమ తండ్రిని చంపి పాప విమోచనం చేసే కవల కుమారులను ఇంకెంత కాలం తన గర్భం మోయాలని బందీ మాత యోచన చేస్తున్నది. 3. లెనిన్`నుంచి ఆయన అదృశ్యమైన చేతులు చరిత్ర నిర్మాణంలో తీరిక లేకుండా ఉన్నాయి ఆయన జీవితానంతరం ఆయన ఉనికిలో లేకుండా పోలేదు ఎంత విరోధాభాసం ఒక నాస్తికుడి మరణంలేని ఆత్మనీడ రక్తమాంసాలు లేకుండా ఏళ్లుగా వృద్ధి చెందుతున్నది అమరుల రక్తం నుంచి ఆయుధాలు ఏరి ఆ మహత్తర నాయకుడి ఉత్తేజం మనను పిలుస్తున్నది మూఢ విశ్వాసాలపై పోరాడమని శాస్త్రజ్ఞులకు పిలుపునిస్తున్నది రైతాంగాన్ని నిరంతర పోరాటానికి నిర్దేశిస్తున్నది.