విరబూసిన ఆకాశం
వికసించిన చిరునవ్వు
జల్లు జల్లుకు పులకింత
అమ్మలక్కల పాటలకు దమధమ సాగే వరి నాట్లు
దిన దిన చూపంత
పెరిగే పైరు వైపే
ఎగబడిన మొగిపురుగు
సేదతీరే సుడిదోమ
జాడ లేని దీపాలి ముసుర్లు ఆశ నింపే సంక్రాంతి మబ్బులు
కరెంటు లో ఓల్టేజ్ లు
మోటర్ రిపేర్లు...
పైసల కోసం తిప్పలు
కనబడే ఆలి తాళి
ఊట గుంజే పెద్ద బోరు
చిగురించే వసంత రుతువు
తలమాడే మండుటెండ
మెదవు పారని నీళ్ల వంతు
చెలిమ రాని సైడ్ బోర్లు
అడుగంటిన నీటి ఊట
సరిపోని తడి పదనుకు
ఎదురొచ్చే సావుకారి
గింజ మిగలని చాట తట్ట
కొంగు బట్టి ఎదురుజూశే
ఇoటామె గంపెడాశ...
ఎగ దన్నే దుఃఖానికి
మిగిలిన కన్నీటి బొట్లు-
రైతాంగమా!

మట్టిని నమ్మి మళ్లా
సాలు పెట్టు
పొడిచే పొద్దులో.

Leave a Reply